నేడు జేఎన్‌టీయూ జీవీలో వర్క్‌షాప్
విజయనగరం రూరల్: జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ఎంఈలు, స్టార్ట్–అప్, మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పించేందుకు జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌డీసీ)ఆధ్వర్యంలో మంగళవారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు వీసీ వి.వి.సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొ రేషన్, జేఎన్‌టీయూ జీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌లో సాంకేతిక ఆవిష్కరణలతో ఎంఎస్‌ఎంఈల బలోపేతం, మేధో సంపత్తి హక్కులు, స్టార్ట్ అప్, సాంకేతిక బది లీ–వాణిజ్జీకరణ’ అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్ మార్కులు, కాపీ హక్కులు, భౌగోళిక గుర్తింపులపై సెషన్లు వారీగా శిక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ఎంఎస్‌ఎంఈలు, స్టార్ట్ అప్‌లు సంబంధిత క్యూఆర్ కోడ్‌తో నమోదు చేసుకోవాలన్నారు.
సంతకవిటి: మండలంలోని శ్రీహరినాయుడు పేట సమీపంలో 24ఎల్ కాలువకు గండి పడింది. కాలువకు సామర్థ్యానికి మించి సాగునీరు విడిచిపెట్టడంతో గండిపడినట్టు రైతులు తెలిపారు. కాలువ నీరు పొలాలను పోటెత్తడంతో ఆందోళన చెందుతున్నారు. కాలవకు నీటి విడుదలను నిలిపివేసి తక్షణమే గండిని పూడ్చాలని కోరుతున్నారు. కాలువలో సామర్థ్యానికి మించి నీరు ప్రవహిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్న అంశాన్ని ‘వద్దంటే సాగునీరు.. రైతు కంట కన్నీరు’ శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. అధికారులు నీటి ప్రవాహాన్ని పరిశీలించినా సరిచేయ లేకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
విజయనగరం క్రైమ్: దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సోమవారం బాంబు పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు విజయనగరం పోలీసులు నగరంలో నాకాబందీ నిర్వహించారు. ఎస్పీ దామోదర్ సూచనల మేరకు వన్‌టౌన్ సీఐ ఆర్‌వీకే చౌదరి, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్‌ఐలు రాంబాబు, పీసీలు నాగరాజు నగరంలోని రైల్వే స్టేషన్, వాహనాలను నిశితంగా తనిఖీ చేశారు.
విజయనగరం అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులు ఈ ఎస్‌ఐ పథకంలో చేరేందుకు ఆన్‌లైన్ పోర్టర్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఈఎస్‌ఐ అసిస్టెంట్ డైరెక్టర్ (విశాఖ) శ్యామ్‌ప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కోరారు. విజయనగరం ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో సోమవారం జరిగిన ఈఎస్‌ఐ పథ కం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడా రు. వైద్యసేవలు పొందేందుకు ఈఎస్‌ఐ తప్పనిసరన్నారు. కార్యక్రమంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళానికి చెందిన అకౌంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
నేడు జేఎన్‌టీయూ జీవీలో వర్క్‌షాప్


