బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నాగార్జున సర్కిల్ లోని ఎం పి ఎం టైం స్క్వేర్ మాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రటాట ది బిగ్గెస్ట్ గేమింగ్ జోన్ ను ఆదివారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలు శారీరక క్రీడలకు దూరమై సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని దీనివల్ల వారు మానసికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వస్తున్నాయని అన్నారు. ఇటువంటి గేమింగ్ జోన్లు పిల్లలకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

రటాట గేమింగ్ జోన్ నిర్వాహకులు శైలజ, కోటి బాబు మాట్లాడుతూ నగరంలోని 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద గేమింగ్ జోన్ గా ఇది నిలిచిపోతుందని సుమారు 50 కి పైగా క్రీడలు ఈ జోన్ లో పిల్లలకు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. పిల్లలకు శారీరక క్రీడలతో పాటు మానసికంగా ఐక్యులేవల్స్ పెంచే ఆటలు కూడా ఇక్కడ ఉన్నాయన్నారు.
స్క్విడ్ గేమ్ సిరీస్ లో ఫేమస్ అయిన హైపర్ గ్రిడ్ గేమ్ కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ పివిఆర్ మూర్తి, డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, శివ, సింధూర, అనూష తదితరులు పాల్గొన్నారు.


