రక్తదానం ప్రాణదానంతో సమానం
మామునూరు: రక్తదానం ప్రాణదానంతో సమానమని, అర్హులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ సూచించారు. వరంగల్ మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో స్థానిక కార్పొరేటర్ ఈదురు అరుణవిక్టర్ ఆధ్వర్యంలో జేఎన్‌వీ వరంగల్ అల్మినీ అసోసియేషన్ సహకారంతో ఉచిత వైద్యశిబిరం, మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ బలరాం నాయక్ హాజరై మాట్లాడుతూ రక్తదానాన్ని మించిన దానం మరోటి లేదన్నారు. అనంతరం రక్తదాతలకు మెమోంటోలు, రక్తదాన ధ్రువీకరణ పత్రాలను అందజేసి ఎంపీ అభినందించారు.


