వాషింగ్టన్: సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా (Ahmed al-Sharaa) అంతర్జాతీయంగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ (Brad Cooper)తో పాటు పలువురు అమెరికా అధికారులతో కలిసి అల్-షరా బాస్కెట్ బాల్ ఆడారు.
ఈ స్నేహపూర్వక ఆట వాషింగ్టన్‌లో నిర్వహించబడిందని సమాచారం. సిరియా అధ్యక్షుడు అల్-షరా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సిరియా అధ్యక్షుడిగా అల్-షరా చేసిన తొలి అధికారిక అమెరికా పర్యటనగా గుర్తించబడింది.


