పేదలకు ఉచిత న్యాయ సహాయం
డెంకాడ: పేద ప్రజలు న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. జిల్లా న్యాయ సేవా దినోత్సవాన్ని పురష్కరించుకు ని మండలంలోని డి.కొల్లాం గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సమ న్యాయం పొందడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. రూ.3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారందరూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చని చెప్పారు. ఆర్థిక, ఇతర కారణాలు వలన ఏ ఒక్కరూ న్యాయం పొందే అవకాశం కోల్పోకూడదన్న ఉద్దేశంతో 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రకారం డీఎల్‌ఎస్‌ఏగా ఏర్పాటైందన్నారు. దీని ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందించడమే లక్ష్యమన్నారు. వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు అందేందుకు కూడా సహాయం చేస్తుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నేరుగా గాని, టోల్‌ఫ్రీ నంబరు 15100కు ఫోన్ చేసి న్యాయ సహాయం పొందవచ్చని వివరించారు.
శక్తి యాప్‌పై విస్తృత ప్రచారం
విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడు తూ బాలికలకు, మహిళలకు రక్షణగా ఉండే శక్తి యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. సోషల్ మీడియా వలన మంచి, చెడులు కూడా ఉన్నాయని, అందువలన జాగ్రత్తగా వ్యవహరించా లని చెప్పారు. సదస్సులో సర్పంచ్ అట్టాడ కృష్ణ, జిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కె.రవిబాబు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


