రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
ఎల్కతుర్తి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లి–ముల్కనూరు రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మంగళపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి శ్రీనివాస్(48) తన మనవళ్లు రిషి, రక్షిత్‌ను తీసుకొని ద్విచక్రవాహనంపై మంగళపల్లి నుంచి ముల్కనూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వైపు వస్తున్న టిప్పర్ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. ద్విచక్ర వాహనంపై ఉన్న బసిరెడ్డి శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని రహదారిపై ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ పులి రమేశ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వంగర ఎస్సై దివ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మంగళపల్లి–ముల్కనూరు రోడ్డుపై బైక్‌ను ఢీకొన్న టిప్పర్
ఎల్కతుర్తి–సిద్దిపేట రహదారిపై
మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన
న్యాయం చేస్తామని ఏసీపీ
ప్రశాంత్‌రెడ్డి, సీఐ రమేశ్ హామీతో
ధర్నా విరమణ
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం


