రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్య
నేడు రోగులకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు సర్వజన ఆస్పత్రిలో గణనీయంగా పెరిగిన ఓపీ 2022లో జిల్లా ఆస్పత్రి సర్వజన ఆస్పత్రిగా మార్పు 2022 అక్టోబర్ నెలలో ఓపీ సంఖ్య 15,366 2025 అక్టోబర్‌లో ఓపీ సంఖ్య 37,497 రోగులకు అందుబాటులో న్యూరో సర్జరీ, మెడికల్ అంకాలజీ, న్యూరో మెడిసిన్, యురాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవన్నీ జగనన్న చొరవతోనే...
●విజయనగరం మండలానికి చెందిన బి.సంతోష్ అనే యువకుడికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కొద్ది రోజులు క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అతన్ని
పరీక్షించిన న్యూరో సర్జరీ వైద్యులు బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా చేశారు.
ఇప్పడు కోలుకుంటున్నాడు.
●గంట్యాడ మండలానికి చెందిన సాయి అనే యువకుడు ఇటీవల పురుగు మందులు సేవించడంతో అతని పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో
చేర్పించారు. అతనికి 15 రోజుల పాటు
ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు
అందించడంతో కోలుకున్నాడు.
ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.
సర్వజన ఆస్పత్రి అయిన తర్వాత ఓపీ సంఖ్య బాగా పెరిగింది. సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో రోగులు అధికంగా వస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
విజయనగరం ఫోర్ట్:
రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టి న నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్ప త్రులు కార్పొరేట్‌ను తలదన్నేలా రూపుదిద్దుకున్నా యి. నాటి ప్రభుత్వం చేసిన ఆస్పత్రుల అభివృద్ధి ఫలితాలు క్రమేణ రోగులకు నిత్యం అందుతున్నా యి. రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే అప్పటి వరకు అందిన సూపర్ స్పెషాలిటీ సేవలు ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అందుతున్నాయి. దీంతో రోగులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి తోనే తాము ఆరోగ్య సేవలు సంతృప్తికరంగా పొందగలుగుతున్నామని గుర్తు చేసుకుంటున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి కృషితోనే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారు. గతంలో ఏ ప్రభుత్వం అలోచన చేయని విధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే గొప్ప ఆలోచన చేశారు. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. అంతేకాకుండా కళాశాలను కూడా త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోనే వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ తరగతులు చదువుతున్నారు.
2022లో అంకురార్పణ
2022 వరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఏవీవీపీ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిగా ఉండేది. కేవలం 200 పడకలు మాత్రమే అప్పట్లో ఉండేవి. ఎటువంటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందేవి కావు. 2022లో జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో జిల్లా ఆస్పత్రి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారింది. వైద్య విధాన్ పరిషత్‌లో ఉన్న ఆస్పత్రి డీఏఈ (వైద్య విద్యా సంచాలకులు) పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు వైద్యులు, సిబ్బంది పెరిగారు.
600 మంది వరకు రోగులకు చికిత్స
ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 600 మంది వరకు రోగులకు చికిత్స అందిస్తున్నారు. 18 విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. 75మంది వైద్యు లు పనిచేస్తున్నారు. వీరే కాకుండే స్టాఫ్‌నర్సులు, క్లాస్ ఫోర్ ఉద్యోగులు, మినిస్టీరియల్ ఉద్యోగులు, పారా మెడికల్ ఉద్యోగులు అనేక మంది పెరిగారు.
రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్య
రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్య


