ఆనందంగా చుట్టొద్దాం! | - | Sakshi
Sakshi News home page

ఆనందంగా చుట్టొద్దాం!

Nov 10 2025 7:15 AM | Updated on Nov 10 2025 7:15 AM

 ఆనంద

ఆనందంగా చుట్టొద్దాం!

● వరంగల్‌లో అందుబాటులో అద్దె కార్లు.. ● ఆసక్తి చూపుతున్న పర్యాటకులు, నగర వాసులు

ఖిలా వరంగల్‌ : అభిరుచి, అవసరాల మేరకు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ బైక్‌తో పాటు కారు ఉంటోంది. అయితే రైళ్లు, బస్సుల ద్వారా మాత్రమే చేరుకునే పట్టణాలు, ప్రాంతాలకు తమ సొంత వాహనాలను తీసుకెళ్లడం సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో కారు ఉంటే బాగుంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి వారికి శుభవార్త. వివిధ పనుల నిమిత్తం వరంగల్‌ నగరానికి వచ్చే వారికి అద్దె కార్లు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు, నగరవాసుల అవసరం, ఆసక్తి మేరకు ప్రస్తుతం వరంగల్‌, హనుమకొండ ట్రైసిటీలో 10 వరకు సెల్ఫ్‌ డ్రైవ్‌, అద్దె కార్ల షాపులు ఉన్నాయి.

అద్దె కారులో సంతోషంగా

పర్యాటక ప్రాంతాల సందర్శన..

ఆదివారం, ప్రభుత్వ సెలవు వచ్చిందంటే మేడారం,మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి, హైదరాబాద్‌, యాదగిరి గుట్ట, పాలకుర్తి, వేములవాడ, కొ మ్మాల, పాకాల, రామప్ప, లక్నవరం సరస్సుకు సెల్ఫ్‌ డ్రైవ్‌తో కుటుంబంతో కలిసి వెళ్లాలనే ఆశ అం

దరిలోనూ ఉంటుంది. వారి ఆశలను వరంగల్‌ నిరుద్యోగ యువత తీరుస్తోంది. సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లను అందుబాటులో ఉంచుతోంది. వీటిని పర్యాటకులు, నగర వాసులు వినియోగించుకుంటూ కారులో సంంతోషంగా ప్ర యాణిస్తూ తమ ఆశలను నెరవేర్చుకుంటున్నారు.

అద్దెకు అన్ని రకాల కార్లు..

నగరంలో నిరుద్యోగ యువత ఉపాధే మార్గంగా సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లు, రెంటల్‌ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల కార్లను అద్దెకు ఇస్తున్నారు. ఫలితంగా నగరానికి వచ్చే పర్యాటకులు, వ్యాపారులకు ఇది ఎంతో ప్రయోజన కరంగా ఉంది. హుందాగా కారులో షికారు చేస్తూ పనులు పూర్తి చేసుకుని తిరిగి కారు అప్పగించి వెళ్లిపోయే సౌలభ్యం అందుబాటులోకి వచ్చేంది. యువత, వ్యాపారులు, పర్యాటకులు ఈ సౌలభ్యాన్ని ఎక్కువ వినియోగించుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వాహనాన్ని బుక్‌ చేసుకోవాలంటే నేరుగా కారు సెల్ఫ్‌ డ్రైవ్‌, రెంటల్స్‌ కేంద్రాలకు వెళ్లి తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ కాపీలు, ఒరిజనల్‌ డ్రైవింగ్‌ జతచేసి పూరించిన ఫార్మట్‌ అందజేయాల్సి ఉంటుంది.

చాలా బాగుంది

నేను హైకోర్టులో అడ్వకేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు రైలులో వస్తుంటా. ఇక్కడ సెల్ఫ్‌ డ్రైవ్‌ కారు తీసుకుని నగరంలో పనులన్నీ పూర్తి చేసుకుంటా. అనంతరం కారు అప్పగించి తిరిగి హైదరాబాద్‌ వెళ్తా.

దేవులపల్లి మల్లికార్జున్‌రావు, అడ్వకేట్‌

యువతే ఆసక్తి చూపుతోంది

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితోపాటు నగరానికి చెందిన యువ త ఎక్కువగా కార్ల ను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిబంధనల మేరకు కార్లను అద్దెకు ఇస్తున్నాం.

ఎస్‌. విజయ్‌కుమార్‌,అద్దెకార్ల షాపుల యజమాని, వరంగల్‌

అద్దె రుసుము ఇలా..

ఈకేంద్రాల్లో 12 గంటల కన్నా తక్కువ సమయానికి కారు అద్దెకివ్వరు. 24 గంటల సమయానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కారు సీట్లను బట్టి ధర నిర్ణయిస్తారు. 24 గంటలకు ఐదు సీట్ల కారుకు రోజుకు రూ. 1,300 నుంచి రూ.1,600 వరకు వసూలు చేస్తారు. అదే ఏడు సీట్ల కారు అయితే రూ.1,900 నుంచి రూ.2,000 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కారు కంపెనీ బట్టి రెంటల్‌ ధర నిర్ణయిస్తారు. దీనిని బుక్‌ చేసుకోవాలంటే నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి గాని, సంస్థ ఫోన్‌ నంబర్‌కు గాని కాల్‌ చేయాలి.

 ఆనందంగా చుట్టొద్దాం!1
1/2

ఆనందంగా చుట్టొద్దాం!

 ఆనందంగా చుట్టొద్దాం!2
2/2

ఆనందంగా చుట్టొద్దాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement