కోటలో పర్యాటకుల సందడి
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటలో ఆదివారం పర్యాటకులు సందడి చేశా రు. విదేశీయులు, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తు న తరలొచ్చి అద్భుత శిల్ప సౌందర్యాన్ని తిలకించారు. కోటలోని స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలోని శిల్ప సంపద, ఖుష్ మహల్, ఏకశిల గుట్ట, రాతి, మట్టికోట అందాలను తిలకించారు. పర్యాటక శాఖ గైడ్ రవి యాదవ్ విదేశీయులకు కాకతీయుల విశిష్టత గురించి వివరించారు. అనంతరం పర్యాటకులు ఏకశిల చిల్డ్రన్ పా ర్క్‌లో సేదదీరారు. కార్యక్రమంలో టీజీటీడీసీ కోట ఇన్‌చార్జ్ గట్టికొప్పుల అజయ్, కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్‌చార్జ్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
కోటలో పర్యాటకుల సందడి


