భార్య కాపురానికి రావడం లేదని..
కురవి: భార్య కాపురానికి రావడంలేదనే కారణంతో భర్త సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. డోర్నకల్ మండలం పెరుమాళ్లసంకీసకు చెందిన శెట్టి వెంకటేశ్వర్‌రావుకు కొన్ని సంవత్సరాల క్రితం రాజోలుకు చెందిన పుష్పతో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం కూడా జరగడంతో పుష్ప తల్లిగారింటికి వచ్చింది. తన భార్యను కాపురానికి పంపించడం లేదని వెంకటేశ్వర్‌రావు శనివారం రాజోలుకు వచ్చి గొడవ చేసినట్లు సమాచారం. ఆదివారం గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని టవర్‌పై నుంచి దించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ విషయమై ఎస్సై సతీశ్‌ను వివరణ కోరగా వెంకటేశ్వర్‌రావు తన భార్యను కొట్టడంతో ఆమె తల్లిగారింటికి వచ్చిందని, భార్య కావాలని టవర్ ఎక్కగా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిపారు.
సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రాజోలులో ఘటన


