ఐపీవోలు లాటరీ టికెట్లు కావు.. | IPOs are not lottery tickets: Shripal Shah | Sakshi
Sakshi News home page

ఐపీవోలు లాటరీ టికెట్లు కావు..

Nov 10 2025 3:13 AM | Updated on Nov 10 2025 3:13 AM

IPOs are not lottery tickets: Shripal Shah

దేశీ ప్రైమరీ క్యాపిటల్‌ మార్కెట్లలో ఐపీవోల సందడి నెలకొంది. 2025 తొలి తొమ్మిది నెలల్లో కంపెనీలు 75 మెయిన్‌బోర్డ్‌ ఐపీవోల ద్వారా సుమారు రూ. 1 లక్ష కోట్లు సమీకరించాయి. ఆఖరు త్రైమాసికంలో మరో రూ. 1 లక్ష కోట్లు సమీకరించనున్నాయి. ఇప్పటికే ఎన్‌ఎస్‌డీఎల్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ మొదలైనవి రాగా, గ్రో, ఫోన్‌పే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యుచువల్‌ ఫండ్‌లాంటి రాబోయే ఇష్యూలపై భారీగా ఆసక్తి నెలకొంది. ఇది ఇన్వెస్టర్లకు మంచి వార్తే ఆయినప్పటికీ, ఐపీవోల మీద ఆసక్తి పెంచుకుంటున్న రిటైల్‌ ఇన్వెస్టర్లలో మరింత క్రమశిక్షణ, అవగాహన పెరగాల్సిన ఆవశ్యకతను కూడా తెలియజేస్తోంది.  

చాలాకాలంగా ఐపీవోలంటే తక్షణ లాభాలందించే లాటరీ టికెట్లనే అభిప్రాయం నెలకొంది. ఇలాంటి మైండ్‌సెట్‌ చాలా ప్రమాదకరమైనది. వీటిని లాటరీ టికెట్లుగా భావించి, లిస్టింగ్‌ లాభాల కోసమే అప్లై చేయడం మంచిది కాదు. ఫండమెంటల్, వాస్తవిక విలువనే పరిగణనలోకి తీసుకోవాలే తప్ప ఆఫర్‌ సమయంలో నిర్ణయించిన మార్కెట్‌ ధరను కాదు. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధి గాథలో పాలుపంచుకునే అవకాశాన్ని కల్పించడంలోనే ఐపీవోకి సంబంధించిన సిసలైన విలువ ఉంటుంది. కాబట్టి తక్షణ లాభాల కోసం ఐపీవోలను లాటరీ టికెట్లుగా భావించకుండా ఉండటం ముఖ్యం.  

గ్రే మార్కెట్‌ ప్రీమియంలతో జాగ్రత్త.. 
గ్రే మార్కెట్లో ప్రీమియంలపై (జీఎంపీ) అతిగా ఆధారపడటం కూడా మంచిది కాదు. జీఎంపీ అనేది స్వల్పకాలిక స్పెక్యులేషనే తప్ప సిసలైన విలువను ప్రతిబింబించదు. ఈ ప్రీమియం తక్కువగా ఉన్నప్పటికీ లిస్టింగ్‌లో అదరగొట్టిన ఐపీవోలు ఇటీవల ఎన్నో చూశాం. ఉదాహరణకు స్విగ్గీ లిస్టింగ్‌కి ముందు జీఎంపీ ఒక మోస్తరుగా కనిపించింది. కానీ లిస్టింగ్‌ వేళ బిజినెస్‌ ఫండమెంటల్స్‌కి తగ్గట్లుగా రాణించింది.

ఇక భారీ జీఎంపీ పలికిన ఐపీవోల వెంట పరుగులు తీసి, తీరా ఆ ప్రీమియంలన్నీ మాయమైపోయి, ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్న ఉదంతాలూ ఉన్నాయి. కాబట్టి జీఎంపీ తక్కువగా ఉన్నంత మాత్రాన ఐపీవో బలహీనమైనదని గానీ, జీఎంపీ ఎక్కువగా ఉంటే కచ్చితంగా లాభాలు వస్తాయని గానీ అనుకోవడానికి ఉండదు.  
సముచిత వేల్యుయేషన్స్‌.. 

రిటైల్‌ ఇన్వెస్టర్లకు వరం 
ప్రస్తుతం చాలా మటుకు ఐపీవోలు, అన్‌లిస్టెడ్‌ వేల్యుయేషన్లతో పోలిస్తే చాలా ఆకర్షణీయమైన ధరతో ముందుకొస్తున్నాయి. దీనితో అన్‌లిస్టెడ్‌ మార్కెట్లో బడా హెచ్‌ఎన్‌ఐలు చెల్లించిన దానికంటే తక్కువ రేటుకే షేర్లను సొంతం చేసుకునే అవకాశం రిటైల్‌ ఇన్వెస్టర్లకు లభిస్తోంది. అన్‌లిస్టెడ్‌ మార్కెట్లో ఎలా ఉన్నా ఐపీవో విషయంలో సముచిత ధరే నిర్ణయించేలా ఇష్యూయర్లు, మర్చంట్‌ బ్యాంకర్లు కసరత్తు చేస్తుండటం ఆరోగ్యకరమైన పరిణామం. దేశీ క్యాపిటల్‌ మార్కెట్లు మెచ్యూర్‌ అవుతోండటాన్ని ఇది సూచిస్తోంది.  

ఆలోచించి ఇన్వెస్ట్‌ చేయాలి.. 
ఇన్వెస్టర్లు ఐపీవోలను కూడా దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడుల కోణంలోనే చూడాలి. దరఖాస్తు చేయడానికి ముందే కంపెనీ మేనేజ్‌మెంట్, వ్యాపార మోడల్, ప్రమోటర్ల బ్యాగ్రౌండ్, ఆర్థిక పనితీరు మొదలైనవన్నీ అధ్యయనం చేయాలి. కంపెనీలు ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉంటే ఐపీవో దశలో పాక్షికంగా కొంత ఇన్వెస్ట్‌ చేసి, లిస్టింగ్‌ తర్వాత రేటు గానీ తగ్గితే మరికాస్త ఇన్వెస్ట్‌ చేయడమనేది ఒక వ్యూహం. ఇలా చేయడం వల్ల ఎక్కువ రిస్కు తీసుకోకుండా నాణ్యమైన వ్యాపారాల్లో సగటున మంచి

వేల్యుయేషన్‌తో ఇన్వెస్ట్‌ చేసినట్లవుతుంది.  
అత్యంత నాణ్యమైన ఐపీవోలు పెద్ద సంఖ్యలో రాబోతుండటంతో భారత్‌ వృద్ధి గాధలో పాలుపంచుకునేందుకు ఇన్వెస్టర్లకి బోలెడన్ని అవకాశాలు లభించబోతున్నాయి. కొత్త తరం టెక్నాలజీ, రిటై ల్, ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్‌ నుంచి ఇన్‌ఫ్రా, హె ల్త్‌–టెక్, ఫిన్‌టెక్‌ వరకు వివిధ రంగాలకు చెందిన ఇష్యూలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా విస్తరణ దశలోనో లేక లాభదాయకతను వేగవంతం చేసు కునే దశలోనో ఉంటున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇవి ఆసక్తికరంగా ఉండవచ్చు. అయితే, ఐపీవోలను స్పెక్యులేషన్‌ సందర్భాల్లాగా కాకుండా పూర్తి సమాచారం తెలుసుకుని, హేతుబద్ధంగా ఆలోచించి, ఇన్వెస్ట్‌ చేయడం కీలకంగా ఉంటుంది.  

స్మార్ట్‌ వ్యూహం..
సంస్థాగత ఇన్వెస్టర్లను అనుసరించడం మరో ప్రాక్టికల్‌ టిప్‌. బడా దేశీ, గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు అధునాతన రీసెర్చ్, వేల్యుయేషన్‌ సాధనాలు అందుబాటులో ఉంటాయి. ఐపీవో ముగియడానికి ముందు ఇలాంటి ఇన్వెస్టర్లు ఎంత మేర సబ్ర్‌స్కయిబ్‌ చేశారనే విషయం బహిరంగంగానే తెలుస్తుంది. ఈ సబ్‌్రస్కిప్షన్‌ని బట్టి వారు సదరు ఇష్యూపై ఎంత ధీమాగా ఉన్నారనేది తెలుసుకోవచ్చు. యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కేటగిరీలో పెద్ద సంస్థలు భారీగా ఇన్వెస్ట్‌ చేస్తే కాస్త భరోసా లభించడానికి ఆస్కారం ఉంటుంది. 

  • శ్రీపాల్‌ షా ఎండీ, కోటక్‌ సెక్యూరిటీస్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement