ముంబై: ఎడ్‌టెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా కంపెనీ షేరు ఎక్స్చేంజీల్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఇష్యూ ధర(రూ.109)తో పోలిస్తే బీఎస్‌ఈలో 31.28% ప్రీమియంతో రూ.143 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 49% ఎగసి రూ.162 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 42% లాభంతో రూ.155 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 44,382.43 కోట్లుగా నమోదైంది.
ఎమ్‌వీ ఫొటోవోల్టాయిక్.. ప్చ్
సౌరశక్తి సంస్థ ఎమ్‌వీ ఫొటోవోల్టాయిక్ పవర్ షేరు ఇష్యూ ధర(రూ.217)తో పోలిస్తే ఎలాంటి లాభ, నష్టం లేకుండా ఫ్లాటుగా రూ.217 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.207 వద్ద కనిష్టాన్ని, రూ.228 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 1% స్వల్ప లాభంతో రూ.219 వద్ద ముగిసింది.
కంపెనీ మార్కెట్ విలువ రూ.15,166 కోట్లుగా నమోదైంది


