ఇక జైలుకే.. : ఎస్పీ
బొబ్బిలి: గతంలో మద్యం తాగి వాహనాలు నడిపి తే రూ.10వేల జరిమానా విధించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దానితో పాటు వారిని జైలుకు కూడా పంపించి శిక్ష అనుభవించి చేసిన తప్పులు తెలుసుకునేలా చేస్తామని ఎస్పీ దామోదర్ అన్నారు. ఆది వారం రాత్రి పట్టణంలోని పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గంజాయి తరలించినా, సేవించినా కఠినమైన చర్యలుంటాయన్నారు. అలాగే మహిళలు, మైనర్ బాలికలతో లైంగిక వేధింపులు చేసే వారిపై పోక్సో, గృహ హింస చట్టాలను అమలు చేస్తామన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడే ఆన్‌లైన్ మోసగాళ్లను ఇటీవల అరెస్ట్ చేశామన్నారు. అనంతరం మండలంలో ని దిబ్బగుడ్డివలసలో గ్రామస్తులకు సైబర్ నేరాలు, గృహ హింసలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ జి.భవ్యారెడ్డి, సీఐలు కె.సతీష్‌కుమార్, నారాయణరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


