గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: బ.పంచమి ఉ.7.59 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పునర్వసు రా.1.17 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.1.50 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.51 వరకు, తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు,అమృత ఘడియలు: రా.11.06 నుండి 12.38 వరకు.
సూర్యోదయం : 6.06
సూర్యాస్తమయం : 5.23
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం.. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థికాభివృద్ధి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి.
వృషభం....కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా నిరుత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మిథునం..... ఉద్యోగయత్నాలు కొంత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.
కర్కాటకం.... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చికాకులు. ఆస్తి వివాదాలు.
సింహం.... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో మీపై గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య.... పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం.
తుల.... పనులు కొన్ని వాయిదా పడతాయి. మిత్రులతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. ఆధ్యాత్మిక చింతన.
వృశ్చికం.... రుణాలు చేస్తారు. పనులు నత్తనడకన సాగుతాయి. నిర్ణయాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
మకరం... నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారవృద్ధి. కళాకారులకు సన్మానాలు.
కుంభం.... పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
మీనం.. చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.


