పెట్రోలు బంక్‌లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పెట్రోలు బంక్‌లో అగ్నిప్రమాదం

Nov 10 2025 7:28 AM | Updated on Nov 10 2025 7:28 AM

పెట్రోలు బంక్‌లో అగ్నిప్రమాదం

పెట్రోలు బంక్‌లో అగ్నిప్రమాదం

తప్పిన పెనుముప్పు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక గోకవరం బస్టాండ్‌ వద్ద ఉన్న భారత్‌ పెట్రోలియం బంక్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బంకుకు వచ్చిన వాహనం నుంచి ఒక వాల్వు తెరచి డీజిల్‌ అన్‌లోడ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా స్పార్క్‌ వచ్చి నిప్పు అంటుకుంది. ఈ హఠాత్‌ పరిణామంతో పెట్రోలు కోసం వచ్చిన వినియోగదారులు, చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. ఇంతలో పక్కనే ఉన్న అగ్నిమాపక కార్యాలయం సిబ్బంది సమాచారం తెలుసుకుని వచ్చి ఏ త్రిబుల్‌ ఎఫ్‌ ఫోమ్‌ (నురగ) ను చల్లి మంటలను అదుపు చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేలు ఆస్తినష్టం వాటిలినట్లు అగ్నిమాపకశాఖాధికారి పేరూరి శ్రీనివాస్‌ తెలిపారు.

శతాధిక వృద్ధుడి మృతి

కరప: మండలం కూరాడ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధ పాస్టర్‌ మోర్త అండ్రేయ (104) ఆదివారం మృతి చెందారు. ఆండ్రేయ సొంత గ్రామం రామచంద్రపురం సమీపంలోని నరసాపురపేట. ఆ గ్రామం నుంచి 1975లో కరప మండలం కూరాడ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కొద్దిరోజుల ముందు వరకు ఆయన సువార్త చెప్పేవారు. ఇంతవరకు ఆయన తన పనులు తానే చేసుకునేవారని, వయసురీత్యా కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం పరలోకగతులయ్యారని బంధువులు తెలిపారు. ఆయనకు ముగ్గురు కుమారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆండ్రేయ మృతికి మండల అంబేడ్కర్‌ యువజనసేవా సంఘం ప్రతినిధి చిన్నం వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు సంతాపం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement