ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్ల ఎంపిక

Nov 10 2025 7:36 AM | Updated on Nov 10 2025 7:36 AM

ఉమ్మడ

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్ల ఎంపిక

కాసిపేట: మండలంలోని సోమగూడెం సింగరేణి మైదానంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సీనియర్‌ వాలీబాల్‌ పురుషులు, మహిళల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికై న ఉమ్మడి జిల్లా జట్లు ఈనెల 13 నుంచి 16 వరకు మేడ్చల్‌ జిల్లా వీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్‌ వాలీబాల్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొననున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నల్ల శంకర్‌, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు, ఎంపిక పోటీల ఆర్గనైజింగ్‌ కార్యదర్శి భైరగోని సిద్దయ్య, సంయుక్త కార్యదర్శి రావుల రాంమోహన్‌, స్థానిక నాయకులు ముత్తె భూమయ్య, డైకిన్‌ ఏసీ డీలర్‌ రమేశ్‌, దుర్గం గోపాల్‌, జిల్లా విద్య,ఉపాధ్యాయ సంఘం నాయకులు గాజుల శ్రీనివాస్‌, పీఈటీలు విఠల్‌, సుదీప్‌ కుమార్‌, శ్రీనివాస్‌, రెఫరీ రమేశ్‌, క్రీడాకారులు ఆజ్మీర శ్రీనివాస్‌, ప్రేంకుమార్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపికై న ఉమ్మడి జిల్లా మహిళ జట్టు

డి.శివాని(భీమారం), జి. ప్రీతి (ఆస్నాద్‌), ఈ.అ నూష(ఆస్నాద్‌), కె.శ్రీవైష్ణవి(కోటపల్లి), బి.హరి ప్రియ(జన్నారం), టి.అనూష (తిర్యాణి), ఏం.అమూల్య (అచులపూర్‌), బి.దీపిక (ఆదిలాబాద్‌), ఏ. లావణ్య(ఆదిలాబాద్‌), బి.లావణ్య(ఆసిఫాబా ద్‌), జె. వైష్ణవి (జైపూర్‌), మౌనిక (కోటపల్లి) 12 మందిని, నిఖిత, రుచిత, నక్షత్ర, చందన నలుగురిని స్టాండ్‌ బైగా మొత్తం 16మందిని ఎంపిక చేశారు.

పురుషుల జట్టు

ఏ. అనుదీప్‌(మంచిర్యాల), రాహుల్‌ (నిర్మల్‌), షారూఖ్‌ (సోమగూడెం), గురునాథ్‌ (ఉట్నూర్‌), విష్ణు(ఆదిలాబాద్‌), రాజేశ్‌ (సోమగూడెం), అర్జున్‌(ఖానాపూర్‌), బహదూర్‌షా(తిర్యాణి), అంజి (చిత్తపూర్‌), డి.మనోహర్‌ (ఆస్నాద్‌), రాజు (బోథ్‌), ఎస్‌కే. మోహిత్‌షేక్‌ (ఆదిలాబాద్‌)లను స్టాండ్‌ బైగా కార్తిక్‌నాయక్‌, కల్యాణ్‌, ప్రవీణ్‌, రమేశ్‌ నలుగురు మొత్తం 16మందిని ఎంపిక చేశారు.

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్ల ఎంపిక1
1/2

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్ల ఎంపిక

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్ల ఎంపిక2
2/2

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ జట్ల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement