● అప్పటివరకు పోరాటం ఆగదు.. ● ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి చైర్మన్‌ చుంచు రామకృష్ణ | - | Sakshi
Sakshi News home page

● అప్పటివరకు పోరాటం ఆగదు.. ● ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి చైర్మన్‌ చుంచు రామకృష్ణ

Nov 10 2025 7:30 AM | Updated on Nov 10 2025 7:30 AM

● అప్పటివరకు పోరాటం ఆగదు.. ● ఆదివాసీ 9 తెగల కార్యాచరణ స

● అప్పటివరకు పోరాటం ఆగదు.. ● ఆదివాసీ 9 తెగల కార్యాచరణ స

● అప్పటివరకు పోరాటం ఆగదు.. ● ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి చైర్మన్‌ చుంచు రామకృష్ణ

‘ఎస్టీ’ నుంచి లంబాడాలను తొలగించాల్సిందే..

ఖమ్మంమామిళ్లగూడెం: ఎస్టీ జాబితా నుంచి వలస లంబాడాలను తొలగించడమే లక్ష్యంగా విస్తృత ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి చైర్మన్‌ చుంచు రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంతవరకు జేఏసీ జెండా, ఎజెండా ఒకటేనన్నారు. భగవాన్‌ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15న చలో అచ్చంపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, చెంచు తెగల సహకారంతో ర్యాలీ, సభ నిర్వహిస్తామని, ఈ నెల 23న మహబూబాబాద్‌ జిల్లా గుంజేడులో, 30న ఇల్లెందులో, డిసెంబర్‌ 4న చిరుమళ్లలో సన్నాహక సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్‌ 9న ఆసిఫాబాద్‌లో జరిగే బహిరంగ సభకు రాజకీయాలకు అతీతంగా ఆదివాసీలు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మైపతి అరుణ్‌కుమార్‌ మాట్లాడారు. లంబాడాల కుట్రలను తిప్పికొడతామన్నారు. అనంతరం చలో అచ్చంపేట, బొగ్గుట్ట, చిరుమళ్ల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో పలు సంఘాల అధ్యక్షులు, నాయకులు కల్తీ వీరమల్లు, కొట్నాక విజయ్‌, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, పూసం వెంకటలక్ష్మి, కురసం పద్మజ, బట్టు వెంకటేశ్వర్లు, కాట్రాజు శ్రీను, కుర్సం సీతారాములు, ముక్తి భాస్కరరావు, చిగుర్ల మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement