కూసుమంచి: కూసుమంచిలోని శివాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ – విద్యుల్లత దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా జడ్జి దంపతులకు చైర్మన్ రేలా ప్రదీప్‌రెడ్డి, ఈఓ శ్రీకాంత్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు శేషగిరిశర్మ ప్రత్యేక పూజలు చేయించారు. కాగా, కార్తీక సోమవారం కావడంతో ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
జమలాపురంలో సత్యనారాయణస్వామి వ్రతం


