ఖమ్మం సహకారనగర్: జిల్లా విద్యాశాఖాధికారిగా చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల క్రితం డీఈఓగా డైట్ ప్రిన్సిపాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించగా... ఆయన కొంతకాలానికే ఉద్యోగ విరమణ చేశారు. ఆతర్వాత జెడ్పీ సీఈఓ కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించాక అదనపు కలెక్టర్ శ్రీజకు డీఈఓగా బాధ్యతలు అప్పగించారు. ఈనేపథ్యాన జిల్లాకు రెగ్యులర్ డీఈఓగా చైతన్య జైనీని నియమించారు.
డిప్యూటీ సీఎం దృష్టికి
వెళ్లడంతో...
మధిరలో ఇటీవల విద్యాశాఖపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. జిల్లాకు పూర్తిస్థాయి డీఈఓ లేని అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీంతో ప్రస్తుతం సెలవులో ఉన్న కరీంనగర్ డీఈఓ చైతన్య జైనీని ఖమ్మంకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


