● బిల్లుల పేరిట దండుకున్న గురువులు ● వివరాలు సమర్పించాలని ‘సమగ్ర శిక్ష’ ఆదేశం ● విద్యాభివృద్ధి నిధుల పక్కదారిపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

● బిల్లుల పేరిట దండుకున్న గురువులు ● వివరాలు సమర్పించాలని ‘సమగ్ర శిక్ష’ ఆదేశం ● విద్యాభివృద్ధి నిధుల పక్కదారిపై ఫోకస్‌

Nov 10 2025 7:36 AM | Updated on Nov 10 2025 7:36 AM

● బిల

● బిల్లుల పేరిట దండుకున్న గురువులు ● వివరాలు సమర్పించాల

● బిల్లుల పేరిట దండుకున్న గురువులు ● వివరాలు సమర్పించాలని ‘సమగ్ర శిక్ష’ ఆదేశం ● విద్యాభివృద్ధి నిధుల పక్కదారిపై ఫోకస్‌

ఆదిలాబాద్‌టౌన్‌: సర్కారు బడులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని పలు ప్ర భుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలను పీఎంశ్రీ పథకం కింద ఎంపిక చేసింది. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గాను రూ.లక్షల నిధులు విడుదల చేస్తోంది. మొ దటి విడత జిల్లాలో ప్రయోగాత్మకంగా 24 పాఠశాలలను ఎంపిక చేయగా చాలాచోట్ల ప్రధానోపాధ్యాయులు ఆ నిధులను గోల్‌మాల్‌ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే అక్రమాలకు పాల్పడిన గురువుల బాగోతం బయటపడనుంది. జీఎస్టీ బిల్లులు సమర్పించి కాగితాల మీద అన్ని పనులు చేసినట్లు రికార్డులు సమర్పించి నిధులు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ఆడిట్‌ అధికారులు కేవలం జీఎస్టీ బిల్లులు చూసి అంతా ఒకే అన్నట్లుగా క్లియరెన్స్‌ ఇచ్చారు. వారిని సైతం ప్రభావితం చేసి డబ్బులు కాజేసినట్లుగా సమాచారం. అయితే ప్రభుత్వం జిల్లాలో తాజాగా 24 పా ఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఇటీవల మెమోలను జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, హెచ్‌ఎంకు పడనిచోట ఈ వ్యవహారం బ యటకు రాగా మిగతా చోట్ల రాజీమార్గంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా స్పష్టమవుతుంది.

నిధుల దుర్వినియోగం ఇలా..

జిల్లాలో పీఎంశ్రీ కింద ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 24 ఎంపిక చేశా రు. ఒక్కో పాఠశాలకు రూ.10 లక్షల నుంచి రూ. 30లక్షల వరకు ఏటా నిధులు విడుదలవుతున్నా యి. అయితే ఈ నిధులను నేరుగా ప్రధానోపాధ్యాయుల అకౌంట్లలో జమ చేయడంతో అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తీర్మానం చేసి పనులు చేపట్టాల్సి ఉండగా సంబంధిత హెచ్‌ఎంలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి వివరాలు సమర్పించారు. కొంత మంది విద్యార్థులను మాత్రమే టూర్‌ కు తీసుకెళ్లి అందరినీ తీసుకెళ్లినట్లు బిల్లులు లేపా రు. ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున మంజూరయ్యాయి. పాఠశాలల్లో కరాటే శిక్షణ ఇవ్వకున్నా ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేశారు. నామమాత్రంగా స్పోర్ట్స్‌ మెటీరియల్‌ కొనుగోలు, పదో తరగతి విద్యార్థుల స్నాక్స్‌, ఆర్థిక అక్షరాస్యత పేరిట కూడా డబ్బులు కాజేశారు. కెరీర్‌ గైడెన్స్‌ పేరిట విడుదలైన నిధులను కూడా కొంతమంది నొక్కేశారు. అంతేకాకుండా యూత్‌ ఎకో క్లబ్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌, మ్యాథ్స్‌, సైన్స్‌ సర్కిల్‌, జీసీసీ క్లబ్‌లు, సెల్ఫీ పాయింట్‌ పేరిట వేలాది రూపాయలను దుర్వినియోగం చేశారు. స్పోర్ట్స్‌ గ్రాంట్స్‌, పీటీఎం, టీఎల్‌ఎం, సెఫ్టీ సెక్యూరిటీ స్టూడెంట్స్‌ ఇంటరాక్షన్‌, గ్రీన్‌ స్కూల్‌, ఫొటో కాపీ, దినపత్రికలను వేయించకుండానే బిల్లులు లేపారు. వార్షికో త్సవం వంటివి.. ఇలా చెప్పుకుంటే పోతే ప్రతీ కా ర్యక్రమంలోనూ వేలాది రూపాయలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే విద్యా సంవత్సరం చివరలో రూ.9.50లక్షల వరకు నిధులు వి డుదల కావడం, ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు వాటిని వెచ్చించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఇదే అదునుగా కొంతమంది అకౌంట్లను జీరో చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో 24 పాఠశాలలకు సంబంధించి రూ.3 కోట్ల12లక్షల 86వేల 391 నిధులు వచ్చాయి. ఇందులో నుంచి రూ.3కోట్ల 11లక్షల 40వేల 148లను ఖర్చు చేశా రు. కేవలం మూడు స్కూళ్ల హెచ్‌ఎంలు రూ.లక్ష 46వేల 243 బ్యాలెన్స్‌గా ఉన్నట్లు చూపించారు.

హెచ్‌ఎంలకు మెమోలు ..

పీఎంశ్రీ కింద 24 పాఠశాలలకు విడుదలైన నిధుల ఖర్చుకు సంబంధించిన వివరాలు సమర్పించాలంటూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఇటీవల మె మో జారీ చేశారు. అందరికీ కలిపి విడుదల చేసిన ఈ మెమో ఇటీవల జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందింది. విడుదలైన నిధులు.. ఏ విధంగా ఖ ర్చు చేశారు.. బిల్లుల స్టేట్‌మెంట్‌.. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌.. ఫొటోలు తదితర వివరాలు పంపించాలని అందులో స్పష్టం చేశారు. అయితే 23 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరాలు సమర్పించగా కే స్లాపూర్‌ హెచ్‌ఎం వివరాలు సమర్పించలేద ని విద్యాశాఖాధికారులు తెలిపారు. క్షేత్రస్థాయికి వె ళ్లి విచారణ జరిపితే అక్రమాల గుట్టు రట్టవుతుంద ని భావించిన పలువురు హెచ్‌ఎంలు ఎస్పీడీ నుంచి ఆ దేశాలు రావడంతో ఆగమేఘాల మీద జీఎస్టీ బి ల్లులు సమర్పించారని పలువురు ఉపాధ్యాయ సంఘా ల నాయకులు, టీచర్లు అభిప్రాయపడుతున్నారు.

అక్రమాలకు చెక్‌పెట్టేలా ..

పీఎంశ్రీ నిధుల అక్రమాలకు చెక్‌పెట్టేలా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం నిధుల చెల్లింపులో మార్పులు తీసుకొచ్చింది.ఇక నుంచి ట్రెజరీ ద్వా రానే బిల్లులు చెల్లించనుంది. అయితే హెచ్‌ఎం ఖా తాలకు కాకుండా కాంట్రాక్టర్‌ లేదా షాపు యజమానుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.

జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలు

24

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు

జిల్లాలో పీఎంశ్రీ కింద 24 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా అభివృద్ధి కార్యక్రమాల కో సం ప్రభుత్వం హెచ్‌ఎం అకౌంట్లలో నిధులు వి డుదల చేసింది. ఖర్చులకు సంబంధించిన వివరాలను వారి నుంచి తీసుకుని ఉన్నతాధికారుల కు సమర్పించాం. ఇంద్రవెల్లి ప్రధానో పాధ్యాయుడిపై ఫిర్యాదు రావడంతో అధికారులు వి చారణ జరిపి ఆర్జేడీకి సరెండర్‌ చేశారు. మిగతా పాఠశాలలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. – రఘురమణ,

జిల్లా విద్యాశాఖ ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌

మిగిలిన నిధులు రూ.1.46లక్షలు (మూడు

పాఠశాలలకు సంబంధించి)

2024–25 సంవత్సరానికి..

మంజూరైన నిధులు రూ.3.12కోట్ల

ఖర్చు చేసిన నిధులు రూ.3.11కోట్లు

● బిల్లుల పేరిట దండుకున్న గురువులు ● వివరాలు సమర్పించాల1
1/1

● బిల్లుల పేరిట దండుకున్న గురువులు ● వివరాలు సమర్పించాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement