Adivi sesh
-
ఓటీటీకి అడివి శేష్ డెకాయిట్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.డకాయిట్ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ. -
ఓటీటీలోకి డెకాయిట్.. స్టీమింగ్ ఎప్పుడంటే..!
-
అడివి శేష్ ప్రేమ కథ.. కళ్లు చెమ్మగిల్లే స్టోరీ
డెకాయిట్ మూవీతో అడివి శేష్ ప్రేక్షకులను మెప్పించాడు. భగ్నప్రేమికుడు ఎలా ఉంటాడో చాలా ఎమోషనల్ టచ్‌తో నటించాడు. గతంలో గూఢచారి, మేజర్ వంటి సినిమాలతో సీరియస్ పాత్రలు చేసినప్పటికీ అందులో లవ్ సీన్ వస్తే జీవించేస్తాడు. ఇంతటి బరువైన సీన్లో కూడా సులువుగా అతను నటించడం చూసి ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. 'క్షణం', 'డెకాయిట్' వంటి సినిమాల్లో ఆ 'బిట్టర్ స్వీట్ పెయిన్' ఎలా వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో అడివి శేష్ వివరణ ఇచ్చారు.సినిమాల్లో ఎంట్రీకి ముందు అడివి శేష్ అమెరికాలో ఉండేవారని తెలిసిందే. అక్కడ తనకు 17ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని శేష్ ఇలా చెప్పాడు. అయితే, ప్రేమ విషయంలో ఎంతో క్షోభను అనుభవించానంటూ కొన్ని బాధాకరమైన విషయాలను ఇలా బయటపెట్టారు. అమెరికాలో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాను.. కానీ, రెండూ విషాదాన్నే ఇచ్చాయి. నా పుట్టినరోజు నాడే ప్రేమించిన అమ్మాయి మరోకరిని పెళ్లి చేసుకుంది. ఆ సంఘటన నేను భరించలేకపోయాను. ప్రతి పుట్టినరోజు నాడు అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే.. నాకు ఆ సంఘటనే గుర్తుకు వస్తుంది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మరో ప్రియురాలు అకాల మరణం ఎంతగానో నన్ను కుంగదీసింది.అడివి శేష్ ప్రేమ జీవితం గురించి తెలుసుకున్న తర్వాత నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అడివి శేష్ జీవితంలో ఇంతటి విషాదమా..? అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ గుండె కోత వింటే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లాల్సిందేనని . ఆయన ధైర్యానికి ఫిదా అవుతున్నారు. -
అడివి శేష్ డెకాయిట్.. చిచ్చుబుడ్డి ఫుల్ వీడియో వచ్చేసింది..!
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో సింగర్ జోనితా గాంధీ ఆకట్టుకుంది. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు. ఈ సాంగ్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
అప్పుడు మేజర్.. ఇప్పుడు డెకాయిట్.. మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పటికీ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. తాజాగా డెకాయిట్ మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినీ ప్రియులకు ఊరట కల్పించేలా టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్లో షేర్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తగ్గించారు. ఏపీలోని సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105, రూ.70గా ధరలు నిర్ణయించారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105, రూ.80, రూ.50గా ఖరారు చేశారు. టీజీలోని అన్ని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రం రూ.150గా ఫిక్స్ చేశారు. తగ్గించిన ధరలు ఈనెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాగా.. గతంలో మేజర్ సినిమాకు కూడా ఇదే తరహాలో టికెట్ ధరలు తగ్గించారని ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో డెకాయిట్ మూవీని థియేటర్లలో చూడాలనుకున్నావారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు. ఈ చిత్రంలో ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. Thank you for all the LOVE ❤️🔥❤️🔥❤️🔥Appudu #MAJOR ki Lowest Ticket PriceIppudu #DACOIT ki. We called the Theaters and Spoke to them about Lowering Ticket Prices ❤️🔥❤️🔥❤️🔥ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరల్లో:👉 ఆంధ్రప్రదేశ్ – ₹105, ₹70👉 తెలంగాణ – ₹105, ₹80, ₹50… pic.twitter.com/63Cq0H0Q4m— Adivi Sesh (@AdiviSesh) April 23, 2026 -
డెకాయిట్ సంతృప్తి ఇచ్చింది: సుప్రియ
‘‘సినిమా అంటే ఒక మ్యాజిక్ ఉండాలి. అలాంటి మ్యాజిక్ ‘డెకాయిట్’ చిత్ర కథలో ఉంది. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించకుండా తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం. అన్నీ బడ్జెట్ పరంగా ఆలోచిస్తే కథకు న్యాయం చేయలేం. అలాగే మంచి సినిమాకి ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. ‘డెకాయిట్’ చిత్రానికి పతాక సన్నివేశమే అందం’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ చెప్పారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘డెకాయిట్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం సుప్రియ విలేకరులతో పంచుకున్న విశేషాలు....⇒ ‘డెకాయిట్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని ఇస్తోంది. హరి పాత్రలో శేష్ అద్భుతంగా నటించారు. మృణాల్ పోషించిన సరస్వతి పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ బలంగా ఉన్న సినిమా తీయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది. ‘డెకాయిట్’ చిత్రం ఆ సంతృప్తి ఇచ్చింది.⇒ డిస్ట్రిబ్యూషన్ పరంగా, నిర్మాణపరంగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు బయటకు చెప్పుకుంటున్నాం అంతే. నాగార్జునగారి వందో సినిమా గురించి, 2027 సంక్రాంతికి ఆయన హీరోగా రానున్న సినిమా గురించి ప్రస్తుతం నేను ఏం చెప్పలేను.. ఆయనే చెబుతారు. మా ఎస్ఎస్ క్రియేషన్స్‌లో మళ్లీ సినిమా చేసేందుకు కథలు వినాల్సి ఉంది.⇒ ఓ సినిమా థియేటర్స్‌లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధనపై నిర్మాతలందరూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే నిర్మాతలు–ఎగ్జిబిటర్స్ మధ్య పర్సెంటేజ్ వి«ధానం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. రెంటల్ విధానంవైపే నేను మొగ్గు చూపుతాను. కాకపోతే సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం థియేటర్స్వారికి లాభం చేకూర్చేలాగా ఆలోచించాలి. ఈ అంశంపై నువ్వా? నేనా? అనే ధోరణితో కాకుండా మనం అనుకుని అందరం కలిసి మాట్లాడుకోవాలి. -
'డెకాయిట్'లో హీరోయిన్ మార్పు నిర్ణయం సరైనదేనా?
కొన్ని నెలల క్రితం 'డెకాయిట్' చిత్రంలో హీరోయిన్గా ఎంపికైన శృతి హాసన్ అనుకోకుండా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే తను స్వచ్ఛందంగా తప్పుకుందా లేక డెకాయిట్ టీమ్ తొలగించిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఆ పాత్రకు ఆమెకు సంబంధం లేకుండా పోయింది. వెంటనే ఆ స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు.అయితే ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత, మృణాల్ పోషించిన "సరస్వతి" పాత్రపై చర్చలు మొదలయ్యాయి. శృతి అభిమానులు ఈ పాత్రను ఆమె మరింత బాగా పోషించి ఉండేదంటున్నారు. కానీ తెరపై మృణాల్ నటన చూసిన ప్రేక్షకులు మాత్రం ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో డెకాయిట్ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని వంద శాతం సమర్థిస్తున్నారు.నటనలో శృతిని తక్కువ చేసి చూడలేం. తను కూడా ఈ పాత్రను బాగా చేసి ఉండేది. కానీ ప్రేక్షకులు ఆమెను తెరపై చూడలేకపోయారు. ఆ అవకాశాన్ని మృణాల్ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. సినిమాలో శృతి లేని లోటును మృణాల్ తీర్చిందనే చెప్పాలి. మొత్తానికి శృతి హాసన్ ఒక మంచి పాత్రను మిస్ అయింది. అదే సమయంలో మృణాల్ ఠాకూర్ తన కెరీర్లో మరో బలమైన పాత్రను సంపాదించుకుని ఆ పాత్రకు న్యాయం చేసింది. -
అడివి శేష్ డెకాయిట్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం డెకాయిట్. ఈ నెల ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఓవరాల్‌గా చూస్తే మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. ఈ చిత్రం ఆదివారం రోజు రూ. 6.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా విదేశీ మార్కెట్లోనూ రాణిస్తోంది. సండే ఒక్క రోజే రూ. 2.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ వసూళ్లు ఇప్పటివరకు రూ. 11.65 కోట్లకు చేరుకున్నాయి.ఇక ఇండియా వ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే రూ. 23.12 కోట్ల గ్రాస్ సాధించగా.. రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అడివి శేష్ నటించిన హిట్-2తో పోలీస్తే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా డకాయిట్ ముందంజలో ఉంది. హిట్-2 విడుదలైన మూడు రోజుల్లోనే భారతదేశంలో రూ. 16.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగా.. అదే సమయంలో డెకాయిట్ రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. కాగా.. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించగా.. మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.. -
‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
మృణాల్.. టాలీవుడ్ హీరోనే పెళ్లి చేసుకో : అల్లు అరవింద్
స్టేజ్‌పై సరదాగా మాట్లాడే టాలీవుడ్ ప్రముఖుల్లో నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో ఆయన స్పీచ్ ఎప్పుడూ నవ్వించేలా ఉంటుంది. అలాగే టాలెంట్ ఉన్న యువ నటీనటులను ప్రోత్సహించేలా ఆయన మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాళ్ల ప్రేమ విషయాలను కూడా బయటపెడుతుంటాడు. అయితే ఆయనకు తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్నిసార్లు నిజమవుతుంటాయి. ఓ సినిమా ఈవెంట్లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు.కాబట్టి ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని దీవించగా..ఆయన మాటలే నిజమై.. వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఆయన మరో నటిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. సీతారామం ఫేం మృణాల్ ఠాకుర్‌ని కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.తాజాగా ఆయన అడివి శేష్-మృణాల్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృణాల్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. లావణ్య మాదిరే నువ్వు కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ‘ఇంతకు ముందు ఒక అమ్మాయిని(లావణ్య త్రిపాఠి) దీవించాను. ఆమె మా వరుణ్ తేజ్ భార్య అయిపోయింది. అలాగే నువ్వు(మృణాల్) కూడా ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు(టాలీవుడ్) కావాలి. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అరవింద్ నవ్వుతూ అన్నాడు. #AlluAravind to #MrunalThakur,"You should marry somebody from here (Tfi ) and settle."We all know what happened when #AlluAravind said this on stage last time🤫😙 pic.twitter.com/3F9KQxvYft— MovieMind (@_MovieMind) April 12, 2026 -
'డెకాయిట్' రెండురోజుల కలెక్షన్స్
టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించిన చిత్రం డెకాయిట్.. ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీని దర్శకులు షానియల్ డియో తెరకెక్కించారు. తాజాగా రెండురోజుల కలెక్షన్స్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా అదే రేంజ్లో సత్తా చాటింది. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ మూవీలో ,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులు నటించారు.డెకాయిట్ చిత్రం రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రం విదేశాలలో కూడా బాగా రాణిస్తోంది, ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటింది. రాబోయే రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరగవచ్చని ఆశిస్తున్నారు. డెకాయిట్ చిత్రం బాగుందని ఇప్పటికే చాలామంది ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దని పోస్టులు షేర్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. దీంతో చాలా థియేటర్స్ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సత్తా చాటుతుంది. #Dacoit pulls off a massive heist at the box office, stealing audience love ❤️Collects ₹28+ CRORES GROSS worldwide in just 2 days 💥Don’t miss it in theatres near you 🤩Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS#AudienceBlockbusterDacoit pic.twitter.com/9NSGeIyELD— Annapurna Studios (@AnnapurnaStdios) April 12, 2026 -
ప్రేమతో మా సినిమా చూస్తున్నారు.. ధన్యవాదాలు: అడివి శేష్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నిన్న (శుక్రవారం) రిలీజైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సినిమాను చూసింది ‘డెకాయిట్’ యూనిట్. అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను మేం ప్రేమతో చేశాం. మీరు కూడా ప్రేమతో చూశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో సరస్వతి పాత్ర చేసిన మృణాల్ మా హీరో (నవ్వుతూ). నా బెస్ట్ ఫ్రెండ్ షానియల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం నాకు ఎమోషనల్‌గా అనిపిస్తోంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన సరస్వతి పాత్ర మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు మృణాల్ ఠాకూర్. ‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు షానియల్ డియో. -
డెకాయిట్ 1st డే కలెక్షన్స్: శేష్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్..
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్. ప్రేమకథ, యాక్షన్ మేళవించి ఉన్న చిత్రాన్ని షానియల్ డియో డైరెక్ట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఫస్ట్ డే కలెక్షన్స్భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం అడివి శేష్ కెరీర్లో ఇదే మొదటిసారి! మరి మొదటిరోజే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన డెకాయిట్ రానున్నరోజుల్లో ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి!సినిమా కథతక్కువ కులానికి చెందిన హరి (అడివి శేష్)ని అగ్రకులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) ప్రేమిస్తుంది. కానీ, కులం కారణంగా ఇద్దరూ విడిపోతారు. ఈ క్రమంలో ఓ కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పి హరిని జైలుకు పంపిస్తుంది సరస్వతి. 13 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన హరి తర్వాత అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను కేసులో ఇరికించిన సరస్వతిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఇంతలో హరి, సరస్వతికి డబ్బు సమస్య వస్తుంది. మరి హరి.. సరస్వతిపై పగ తీర్చుకున్నాడా? డబ్బు కోసం ఇద్దరు కలిసి ఏం చేశారు? అతడు సరస్వతి అతడిని జైలుకు ఎందుకు పంపించింది? అన్నది డెకాయిట్ చూసి తెలుసుకోవాల్సిందే! #Dacoit opens with a BANG ❤️🔥❤️🔥15 CRORES+ GROSS ON DAY 1 🔥The Biggest opening ever for @AdiviSesh 💥💥💥Don’t miss it in theatres near you 🤩Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS#AudienceBlockbusterDacoit pic.twitter.com/3WON13una1— Annapurna Studios (@AnnapurnaStdios) April 11, 2026 చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ -
‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: డెకాయిట్ నటీనటులు: అడివి శేష్,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులునిర్మాత: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్కథ, స్క్రీన్‌ప్లే: అడివి శేష్ దర్శకత్వం: షానియల్ డియోసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్విడుదల తేది: ఏప్రిల్ 10, 2026అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ టీం మరి ఆడియెన్స్‌ని మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.ఎలా తీశారంటే?..ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రేమ కథల్ని ఎంత కొత్తగా, ఎంత అట్రాక్టివ్‌గా చెప్పామన్నదే విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఆ విషయంలో డెకాయిట్ కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రేమకు కులం అడ్డు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇందులోనే అదే పాయింట్‌ను చూపించారు. కానీ ఇందులోని ప్రేమ కథను, ప్రేమికుల్ని కాస్త కొత్తగా, భిన్న శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేయసి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు హీరో. ఇద్దరూ కలిసి దొంగ తనాలు కూడా చేస్తుంటారు. ఇంటర్వెల్‌కు ఓ చిన్న పాటి ట్విస్ట్‌లాంటిది ఇస్తారు.ఇక సెకండాఫ్‌లో హీరోకి అసలు విషయం తెలియడం, గతానికి సంబంధించిన నిజం, తన కోసం ప్రేయసి చేసిన త్యాగం ఇవన్నీ తెలుస్తాయి. ఇక ప్రేయసికి ఉన్న ఇబ్బందిని తీర్చేందుకు ప్రియుడు చేసే త్యాగంతో క్లైమాక్స్ కాస్త బరువెక్కినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ ముందే పసిగట్టేస్తారు. కాబట్టి చివరకు అదేదో పెద్ద ట్విస్ట్, త్యాగంలా అనిపించదు. పైగా ఇది వరకు సినిమాల్లో చూసేసి ఉండటంతో ఇక్కడ ఆ ట్విస్ట్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు.అయితే ఈ చిత్రంలో కరోనా సమయంలో హాస్పిటల్స్ చేసిన దోపిడి, వ్యవహరించిన తీరుని మాత్రం బాగానే చూపించారు. ఈ సినిమాలో చాలా వరకు కరోనా నాటి పరిస్థితులు, అప్పటి వైద్య వ్యవస్థ గురించే చర్చించారు. ఆ పార్ట్ వరకు డెకాయిట్ ఆడియెన్స్‌ని మెప్పించే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు.ఎలా చేశారంటే?అడివి శేష్ ఈ సారి కాస్త కొత్తగా కనిపించాడు. యాసలోనూ చాలా వరకు మాడ్యులేషన్ చూపించాడు. ఆ యాస వల్లే కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాకపోవచ్చు. లుక్స్, యాక్షన్ పరంగా అడివి శేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్‌కి మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సరస్వతి అలియాస్ జూలియట్‌గా మృణాళ్ ఆడియెన్స్ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. ఇక అనురాగ్ కశ్యప్ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. సునీల్, ప్రకాష్ రాజ్ కారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఆర్ఆర్ సైతం సరికొత్తగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయితే విజువల్స్ గురించి చెప్పుకోవాలి. కెమెరా వర్క్ టాప్ నాచ్‌లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా అనిపిస్తాయి. ప్రతీ పైసాకి తగ్గ వర్క్ తెరపై కనిపిస్తుంది. -
అడివి శేష్ డకాయిట్.. ఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఇటీవల ట్రైలర్ రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీతో హిట్ కొట్టాలని అడివి శేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ఆడియన్స్‌ను అలరించాయి. నీవెంట నేను అంటూ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. శ్రీరామచంద్ర ఆలపించారు. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. కాగా.. మూవీని ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. A melody born from a heart that truly loves 🎶💕#Dacoit third single out now ❤️#NeeventaNenu (Telugu) sung by @Sreeram_singer ▶️ https://t.co/Ins3Eg6tx6#TuJahaan (Hindi) sung by @AdityaRikhariii ▶️ https://t.co/1UxWgVECH5Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS… pic.twitter.com/SespX3usQI— Annapurna Studios (@AnnapurnaStdios) April 8, 2026 -
అనుమానం అక్కర్లేదు... బ్లాక్‌బస్టర్ ఖాయం: వెంకటేశ్
‘‘కొన్ని సినిమాలు ఆరంభించినప్పుడే ఒక మంచి అనుభూతి ఉంటుంది. ‘డెకాయిట్’ ఆరంభమైనప్పుడే సుప్రియ ఓ మంచి సినిమా తీస్తోందనే ఫీల్ ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే తను చాలా ప్యాషనేట్. క్రమశిక్షణ ఉన్న టీమ్‌ని ఎంచుకుంది. అడివి శేష్ వరుస హిట్స్ కొడుతున్నాడు. మరిన్ని బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ‘డెకాయిట్’ కూడా బ్లాక్‌బస్టర్ అవుతుంది... ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని హీరో వెంకటేశ్ చెప్పారు. అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించారు.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్‌పై సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సుప్రియ కోసం ఇక్కడికి వచ్చాననుకుంటున్నారు.నిజాయతీగా చెప్పాలంటే నాకు ఇష్టమైన మా సురేంద్ర మామ (సుప్రియ తండ్రి)కోసం వచ్చాను. ఎస్ఎస్ క్రియేషన్స్‌పై సుప్రియ ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. మృణాళ్ మంచి నటి. ఈ మూవీ ట్రైలర్ చూడగానే లవ్‌స్టోరీలోనే యాక్షన్, ఎమోష న్ అన్నీ ఉన్నాయని తెలిసిపోయింది. ఇలాంటి మంచి కథ ఎంచుకున్నందుకు గౌరవంగా ఉంది. యూనిట్‌కి ఆల్ ది వెరీ బెస్ట్’’ అని పేర్కొన్నారు. సుప్రియ మాట్లాడుతూ– ‘‘నాన్నగారి ఎస్ఎస్ క్రియేష న్్స బ్యానర్లో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉంది. అందువల్లే ‘డెకాయిట్’ ఆరంభించాను. ఈ లోగోలో మా తాతగారి (ఏఎ న్ ఆర్) పంచె, మా నానమ్మ (అన్నపూర్ణ) కుంకుమ, పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత... దాని వెనుక మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్. ఇవన్నీ కూడగట్టి ఓ పదిహేను సెకన్లలో మా ఫ్యామిలీ కథ ఎలా చూపించుకోవాలా అనుకున్నాను. ‘డెకాయిట్’కి సైలెంట్‌గా ప్రోడ్యూస్ చేసి బ్యాక్బో న్ గా నిలిచిన మా అన్నయ్య సుమంత్‌కి థ్యాంక్స్’’ అని తెలిపారు. -
బంపర్ ఆఫర్ కొట్టిన 'లిటిల్ హార్ట్స్' కుర్రోడు
ఆచితూచి సినిమాలు చేసే యంగ్ హీరో అడివి శేష్.. 'డెకాయిట్'ని విడుదలకు సిద్ధం చేశాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'గూఢచారి 2' కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ కూడా రిలీజ్ కానుంది. వీటి తర్వాత ఎవరితో చేస్తాడనే దానిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. స్వయంగా సదరు దర్శకుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు.మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో 'డెకాయిట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. దీనికి 'లిటిల్ హార్ట్స్' దర్శకుడు సాయి మార్తాండ్ కూడా వచ్చాడు. మూవీ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే శేష్‌తో తన తర్వాతి సినిమా ఉంటుందని ప్రకటించేశాడు. లవ్ స్టోరీతో దీన్ని తెరకెక్కించనున్నారు. 'గూఢచారి 2' పూర్తయిన వెంటనే ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది.శేష్ విషయానికొస్తే చివరగా 2022లో 'హిట్ 2'తో థియేటర్లలోకి వచ్చాడు. మళ్లీ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు 'డెకాయిట్'గా వస్తున్నాడు. ట్రయిలర్ చూస్తే ఇది రివేంజ్ ప్రేమకథలా అనిపిస్తుంది. మరోవైపు 'లిటిల్ హార్ట్స్' మూవీతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తాండ్.. తొలి చిత్రంతో అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇప్పుడు శేష్‌తో చేయబోయే సినిమాతోనూ హిట్ కొడితే రేంజ్ పెరిగిపోవడం గ్యారంటీ. -
సుప్రియను వెక్కిరించడానికే వచ్చా.. నాగవంశీ ర్యాగింగ్
‘డెకాయిట్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత నాగవంశీ, సహ నిర్మాత సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేశారు. సినిమాలు ఎక్కువ రోజులు తీస్తున్నామని ఎప్పుడూ తమకు క్లాస్ పీకే సుప్రియ ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి ‘డెకాయిట్’ పూర్తి చేసిందనిక వెక్కిరిస్తూ మాట్లాడారు. మమ్మల్ని సినిమాలు ఎందుకు ఇన్ని రోజులు తీస్తున్నారంటూ సుప్రియ ఎప్పుడూ తిట్టేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి 147 వర్కింగ్ డేస్‌లో సినిమా తీశారు. ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు ఆమెకు లేదని ఆటపట్టించారు. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో సుప్రియకు చూపించినందుకు అడివి శేష్‌కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే, “హీరోల్ని నెత్తిన ఎక్కించుకున్నామని ఎప్పుడూ క్లాస్ పీకే సుప్రియ, ఇప్పుడు తొలిసారి బయట హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనుభవించారు. ఇంతకు ముందు తన ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు తీసిన సుప్రియకు ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. డెకాయిట్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరింత మంది హీరోలతో సుప్రియ సినిమాలు చేసి తమలాగే కష్టపడాలని చమత్కరించారు. ఓ వైపు నాగవంశీ సరదాగా ర్యాగింగ్ చేస్తుంటే, పక్కనే ఉన్న సురేశ్ బాబు నవ్వుతూ ఎంజాయ్ చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
అడివి శేష్ అంటే చాలా క్రష్ : టాలీవుడ్ నటి
టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు అడివి శేష్ అంటే నాకు క్రష్ ఉండేదని కామాక్షి భాస్కర్ల తన మనసులో మాటను బయటపెట్టింది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపింది. ఇప్పుడు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టమని వెల్లడించింది. కామాక్షి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. నాకు శేష్ అంటే చాలా క్రష్ ఉండేది : కామాక్షి భాస్కర్ల#AdiviSesh #MrunalThakur #Dacoit #KamakshiBhaskarla pic.twitter.com/wFNG7XC1Z3— Filmy Focus (@FilmyFocus) April 7, 2026 -
మదనపల్లి యాస మాట్లాడా: అడివి శేష్
‘‘నా గత సినిమాల్లో కథలో ఒక చిన్న భాగంగా ప్రేమకథ ఉంటుంది. కానీ, ‘డెకాయిట్’లో మాత్రం ప్రేమకథే మెయిన్ ప్లాట్ ఫామ్. ఒక ప్రేమకథలో యాక్షన్ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఒక యాక్షన్ సినిమాలో లవ్ స్టోరీ చూసేందుకు వెళ్తే నిరుత్సాహపడరు. ఇందులోని భావోద్వేగాలన్నీ కూడా సహజంగా ఉంటాయి’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘డెకాయిట్’.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో అడివి శేష్ విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం. ‘డెకాయిట్’ తెలుగు ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. హిందీలో మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ రీచ్ ఉంది. పవన్ సింగ్గారు ‘డెకాయిట్’లో చేయడం భోజ్ పురికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోజ్‌పురిలో కూడా ప్రీమియర్ వేస్తారా? అని ఫస్ట్ టైమ్ అడిగినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు నా మోకాలికి గాయం కావడంతో షూటింగ్ రెండు మూడు నెలలు ఆలస్యం అయింది. ఆ ఎఫెక్ట్ ‘గూఢచారి 2’ మూవీపైన కూడా పడింది. ‘డెకాయిట్’ కోసం 45 డిగ్రీల వేడిలో క్లైమాక్స్ చిత్రీకరించాం.⇒ డైరెక్టర్ షానియల్ డియో, నేను బెస్ట్ ఫ్రెండ్స్. అయితే సినిమా విషయంలో మాత్రం రాజీపడం. మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటి. నాగచైతన్య–శోభితగార్ల పెళ్లికి హైదరాబాద్ వచ్చిన సమయంలో అనురాగ్ కశ్యప్గారికి ఈ కథ చె ప్పాం. ఆయనకి నచ్చడంతో వెంటనే చేస్తానన్నారు. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ సుప్రియగారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్గారికి కూడా ఇది చాలా ఫ్రెష్ ప్రాజెక్టు అయింది. ‘డెకాయిట్’ తెలుగు వెర్షన్లో ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో...’ సాంగ్‌ని, హిందీలో ‘చీజ్ బడీ õß మస్త్..’ పాటని పెట్టాం. పోలాకి విజయ్‌గారు చాలా స్వీట్ కొరియోగ్రాఫర్. ⇒ ఈ సినిమాలో నేను చేసిన హరి పాత్ర క్యారెక్టర్ని బట్టి ‘డెకాయిట్’ టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ పాత్ర కోసం మదనపల్లి యాస ప్రాక్టీస్ చేశాను. నా నుంచి వరుసగా సినిమాలు రావాలంటే నేను రచయితగా ఉండకూడదనుకున్నాను. ‘గూఢచారి 2’ తర్వాత ఎమోషనల్‌గా రీఛార్జ్ అవ్వాలి అనుకుంటున్నా. ‘డెకాయిట్’ ని డాల్బీలో రిలీజ్ చేయాలని మొదటి నుంచి అనుకున్నాం. అల్లు అరవింద్‌గారు ఫోన్ చేసి, సినిమా చాలా ప్రామిసింగ్‌గా ఉంది.. కలిసి పనిచేద్దామనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు 19 ఏళ్లు. దాన్నుంచి బయటపడడానికి పదేళ్లు పట్టింది. నేను సిగరెట్స్, మందు తాగను, నాన్ వెజ్ కూడా తినను. అందుకే ఇప్పటికీ ఒకేలా ఉన్నాను. నా ‘గూఢచారి 2’ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుంది. -
ధురంధర్-2 ని లెక్కచేయని అడివి శేష్.. డెకాయిట్ పై.. ఫుల్ కాన్ఫిడెన్స్
-
‘డెకాయిట్’లో రొమాన్స్ కష్టంగా అనిపించింది: మృణాల్
అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ బట్టి చూస్తే..ఇది లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్ సినిమా అని అర్థమవుతుంది. ఇందులో హరి పాత్రలో హీరో అడివి శేష్, సరస్వతి పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. అయితే మృణాల్ తొలిసారి ఇందులో యాక్షన్ సీన్స్ కూడా చేసింది. అంతేకాదు ఓ పాపకు తల్లిగానూ నటించింది. అయితే ఈ సన్నివేశాలన్నీ ఈజీగానే చేసింది కానీ.. రొమాన్స్ సీన్సే కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించాయట. ఈ విషయాన్ని స్వయంగా మృణాలే చెప్పింది. డెకాయిట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం మృణాల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఛాలెంజింగ్‌గా అనిపించిన సన్నివేశాలేంటని ఓ విలేకరి అడగ్గా.. ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ‘యాక్షన్ సీన్లు నాకు ఇబ్బంది కాలేదు కానీ.. రొమాన్స్ సన్నివేశాలే ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ సినిమా. ఇందులో హీరోపై కోపం ఉన్నప్పటికీ.. పాస్ట్‌లో ప్రేమగా ఉండాలి. రొమాన్స్ చేయాలి. అలా నటించడం నాకు సవాల్‌గా అనిపించింది. సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది’ అన్నారు. ఇక స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు పారితోషికం కూడా తగ్గించుకున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. -
ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది.. థ్రిల్ అవుతారు: అడివి శేష్
‘‘ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నదే నా లైఫ్ ఫిలాసఫీ. ప్రాణం పెట్టి చేసిన సినిమా ‘డెకాయిట్’. ఇందులో ముఖ్యమైన విషయాలున్నాయి. కానీ, వాటిని ట్రైలర్లో చూపించలేదు. మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడు? అనే అంశమే ‘డెకాయిట్’లో ప్రధానంగా ఉంటుంది. ఇది యూనివర్సల్ కథ’’ అని పేర్కొన్నారు. ‘‘డెకాయిట్’లో నేను చేసిన సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది’’ అని మృణాల్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఈ తరహా పాత్రలో నేను ఇంతవరకు నటించలేదు’’ అని చెప్పారు అనురాగ్ కశ్యప్. ‘‘మంచి లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్ ఫిల్మ్ ఇది’’అని చె΄్పారు షానియల్ డియో. ‘‘మహేశ్ బాబు, ఎన్టీఆర్గార్లు మా సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత సుప్రియ. -
శేష్-మృణాల్ 'డకాయిట్' ట్రైలర్ రిలీజ్
అడివి శేష్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'డకాయిట్' సినిమా.. వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేస్తున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇది ఆకట్టుకునేలా ఉంది. మూవీపై అంచనాలు పెంచేస్తోంది. -
కాలితో తన్నా.. నావల్ల అనుష్క నొప్పితో బాధపడింది!
ఏదో హడావుడిగా కాకుండా తాపీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అడివి శేష్. ఈయన కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం హిట్:ద సెకండ్ కేస్. ఈ సినిమా వచ్చి నాలుగేళ్లవుతోంది. ఇంతకాలం గ్యాప్ తర్వాత అతడు డెకాయిట్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.బాహుబలి జ్ఞాపకాలుఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'బాహుబలి' సినిమాలో అనుష్కను హీనంగా చూసే ఓ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. అనుష్క చాలా మంచి వ్యక్తి. స్వీటీ.. ఆ పేరులోనే తెలిసిపోతోంది. ఖైదీగా పడి ఉన్న అనుష్కను కట్టెతో తడుతూ నిద్రలేపాలి. ఆ సన్నివేశం చిత్రీకరణ అయిపోగానే నీకు ఏం తగల్లేదు కదా? అని అడిగాను.బలంగా తన్నడంతో..ఎందుకంటే అప్పటికే నావల్ల ఒకసారి తనకు దెబ్బ తగిలింది. నేను కాలితో తన్నడం వల్ల ఆమె మెడ నొప్పితో బాధపడింది. నిజానికి ముందు నేను సున్నితంగానే తన్నాను. కానీ రాజమౌళి సర్ అది సరిపోదన్నాడు. దాంతో నేను బలంగా తన్నాల్సి వచ్చింది. దానివల్ల ఆమెకు దెబ్బ తగిలింది. అప్పుడే తొలిసారి తనతో మాట్లాడాను అని అడివి శేష్ తెలిపాడు. కాగా బాహుబలి మొదటి భాగంలో భళ్లాల దేవ (రానా దగ్గుబాటి) కొడుకు భద్రుడిగా శేష్ నటించాడు.చదవండి: ధురంధర్లో విలన్ రోల్.. ముగ్గురు రిజెక్ట్ చేశారు: కాస్టింగ్ డైరెక్టర్ -
ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్
అనిరుధ్‌తో పలు పాటలు పాడిన గ్లామరస్ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు ఐటమ్ సాంగ్‌లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'డకాయిట్' కోసం తొలిసారి కాలు కదిపింది. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ పాటని లెక్క ప్రకారం ఈ సాయంత్రమే రిలీజ్ చేయాలి. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే)ఇప్పటివరకు సింగర్‌గానే అందరికీ తెలిసిన జోనితా.. ఇప్పుడు అందంతో ఐటమ్ సాంగ్‌లోనూ ఆకట్టుకోవడం విశేషం. ఇకపోతే ఏప్రిల్ 10న 'డకాయిట్'.. తెలుగు, హిందీలో థియేటర్లలోకి రాబోతుంది. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత శేష్ నుంచి వస్తున్న మూవీ ఇది. చూడాలి మరి ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటాడో?(ఇదీ చదవండి: 'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్) -
మేనకోడలికి ఆమిర్ ఖాన్ శుభాకాంక్షలు
బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. జైన్ మేరీ ఖాన్ బర్త్ డే (మార్చి 20) సందర్భంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఆమె ఫస్ట్ లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు ఆమిర్ ఖాన్. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ‘‘లవ్, యాక్షన్, హార్ట్‌బ్రేక్ వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ–నిర్మాత: సునీల్ నారంగ్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నేపథ్య సంగీతం: గ్యాని. -
అడివి శేష్ 'డెకాయిట్' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మృణాల్ (ఫొటోలు)
-
తిరుపతి ఐఐటీలో ఉత్సాహంగా తిరుత్సవ్–2026 (ఫొటోలు)
-
డెకాయిట్ నుంచి లవ్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. కెమెరామెన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ యాక్షన్ లవ్‌స్టోరీ నుంచి తాజాగా రుబరూ.. అంటూ సాగే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.లవ్ సాంగ్మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని.. అంటున్నది మనసే.. కాసేపు నువ్వు,నేను కలిసి.. క్షణంలో లోకమంత తెలిసే.. అన్న లిరిక్స్‌తో పాట మొదలైంది. 'మోసం అంటే ఏందో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే.. మోసం చేస్తావని తెలీదు కదా జూలియట్.. ఎందుకు నమ్మించినావే..' అంటూ హీరో లవ్‌స్టోరీని పాటలో చూపించారు. అలాగే చివర్లో బ్రేకప్ బాధను కూడా చూపించారు.సినిమాఇదివరకు రిలీజైన టీజర్లో యాక్షన్‌ను ఎక్కువ హైలైట్ చేయగా ఈ పాటలో మాత్రం లవ్ టచ్ ఎక్కువ జోడించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
రుబరూ రెడీ
అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ జోడీగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’. ఈ యాక్షన్ లవ్‌స్టోరీతో కెమెరామెన్ షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలోని ‘రుబరూ...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఈ నెల 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.‘‘డెకాయిట్’ మూవీ కథాంశం ప్రధానంగా యాక్షన్ చుట్టూ తిరిగినప్పటికీ ‘రుబారూ..’ సాంగ్ మాత్రం మంచి ఎమోషనల్ టచ్‌తో కొత్త ఫీల్‌ని ఇస్తుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీని హైలెట్ చేస్తూ, వారి జర్నీని ప్రజెంట్ చేసే పాట ఇది’’ అని యూనిట్ పేర్కొంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించి ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. -
డేట్ ఛేంజ్
ఎస్... ఫలానా డేట్‌కి థియేటర్స్‌కి వచ్చేస్తాం అంటూ యూనిట్ ఒక డేట్ ఫిక్స్ చేసి, ప్రకటిస్తుంది. అయితే కొన్నిసార్లు సెట్ చేసిన డేట్‌కి ఆ సినిమా రాదు... వాయిదా పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాయిదా వేస్తుంటారు. కొన్ని సినిమాల షూటింగ్ పూర్తి కాదు... కొన్ని పూర్తయినా గ్రాఫిక్స్ పూర్తి కావు... కొన్నయితే అన్నీ పూర్తయినా వేరే సినిమాలతో క్లాష్ అయ్యే పరిస్థితిలో తప్పక వాయిదా పడతాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ మధ్య కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ చిత్రాల పోస్ట్‌పోన్ స్టోరీ తెలుసుకుందాం.వేసవిలో విశ్వంభర చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.ఇందుకు కారణం... చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా. తనయుడి ‘గేమ్ చేంజర్’ కోసం తన ‘విశ్వంభర’ మూవీ విడుదలని చిరంజీవి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ 2025 జనవరి 10న రిలీజ్ అయింది. 2025 సంక్రాంతికి వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని భావించినప్పటికీ కాలేదు. ఇందుకు కారణం వీఎఫ్ఎక్స్ పనులు. ఈ కారణంగా చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలైంది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర పోషించారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి... విడుదల తేదీపై స్పష్టత రావాలి. మార్చి టు ఏప్రిల్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీని రామ్‌చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ‘‘రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా ‘పెద్ది’. హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం రామ్‌చరణ్ ఫుల్æమాస్ లుక్‌లోకి మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. అయితే వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చాం. మా సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి...’ పాట అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ముందుకు వచ్చి, మార్చి 26న రిలీజ్ కానుంది. మార్చి నుంచి ఆగస్టుకి... ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ‘ది ప్యారడైజ్’లో భాగమయ్యారు. ఓ కీలక పాత్రను సంపూర్ణేష్ బాబు చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. నానిపై ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మాస్ ట్యూన్ అందించారు. కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ భారీ విజువల్స్‌తో ఈ సాంగ్‌ని పూర్తి స్థాయి క్రౌడ్ ప్లీజర్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్‌పోస్ చేసి, ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ‘‘మ్యాసివ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ హాటెస్ట్ పాన్ ఇండియన్ రిలీజెస్‌లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. మా సినిమాని ముందుగా మార్చి 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే తాజాగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్ డేట్‌కి మా సినిమాకు వరుసగా మూడు వారాల పండగలు కలిసి రానున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాద్–ఉన్–నబీ పండగలు, రెండో వీకెండ్లో రాఖీ, మూడో వారంలో జన్మాష్టమి ఉండటం వల్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైస్’కి బాక్సాఫీస్ వద్ద బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్లానింగ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాని... ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కెటింగ్ సెన్స్‌ని చూపించారు’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి టు ఏప్రిల్... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఈ నెల 13న రిలీజ్ చేస్తామని యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే ఆ తేదీకి విడుదల వాయిదా పడి, ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ పనులు... ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న యూనిట్... కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు టాక్. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది.1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవాడు. అల్లరిగా తిరిగే అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ‘సలార్’ మూవీ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచింది. అదే విధంగా సెంథిల్ కుమార్ విజువల్స్ ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. మే 1న లెనిన్ వస్తాడా? అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ‘లెనిన్’ని మే 1న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే... ఆ తేదీకి రిలీజ్ కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా అని ఫిల్మ్‌నగర్ టాక్.మార్చి 27న ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ‘లెనిన్’ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి... ముందుగా అనుకున్నట్లు ‘లెనిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేదా? లేకుంటే మరో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘లెనిన్’ పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ మూవీ తప్పకుండా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మార్చి నుంచి ఏప్రిల్‌కి? అడివి శేష్ హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసి, ఉగాది కానుకగా ఈ ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్‌లో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీ మరోసారి విడుదల వాయిదా పడనుందని ఫిల్మ్‌నగర్ టాక్. మార్చి నెలలో యశ్ ‘టాక్సిక్’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తుండటంతో ‘డెకాయిట్’ విడుదల వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందనే చర్చ నడుస్తోంది. అయితే మార్చి 19న విడుదల వాయిదా గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.‘‘ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘డెకాయిట్’. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్‌లోని ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌కి పాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారు. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం మాదే. అంతర్జాతీయ స్థాయిలో తీసిన ‘డెకాయిట్’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... యూనిట్ ముందుగా ప్రకటించినట్లు మార్చి 19న ‘డెకాయిట్’ సినిమా విడుదలవుతుందా? లేదా అనేది వేచి చూడాలి. సంబరాలు ఎప్పుడు? సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). ఐశ్వర్యా లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ పోస్ట్‌పోన్ అయింది.అయితే ఆ తర్వాత విడుదల తేదీపై యూనిట్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మార్చి 14న థియేటర్లలోకి రానుందని టాక్. ‘‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందింది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ నిలుస్తుంది. మా సినిమాలోని సీజీ వర్క్ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వెట్రి పళనిసామి విజువల్స్, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని యూనిట్ తెలిపింది. నాయకుడు వచ్చేదెప్పుడు? తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా పొంగల్ కానుకగా ఈ ఏడాది జనవరి 9 విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు.విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ కారణంగా ఆయన సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారు. అందుకే విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల్లో ఉంది. మరి... అడ్డంకులు దాటుకుని ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు? అన్నది వేచి చూడాలి.– డేరంగుల జగన్ మోహన్ -
ఈ హీరోల టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!
టాలీవుడ్లో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. కమర్షియల్ సినిమాలు ఒకటో రెండు ఆడుతున్నాయి తప్పితే కంటెంట్ బేస్డ్ చిత్రాలకే ఎక్కువగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోలు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే రైటింగ్ లాంటి వాటిలో పాలుపంచుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ పేర్లు ప్రముఖమైనవి. వీళ్ల ప్రతిభని అందరూ మెచ్చుకుంటున్నారు. కాకపోతే నాణెనికి మరోవైపు చూస్తే పరిస్థితి చిత్రంగా ఉంటుంది.(ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ.. వీళ్లు డైరెక్ట్‌గా హీరోలు అయిపోలేదు. చాన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేశారు. గుర్తింపు రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ టైంలోనే కేవలం యాక్టింగ్‌ని నమ్ముకోకుండా రైటింగ్‌పై కూడా పట్టుసాధించారు. తమ సినిమాలకు కథలు, సీన్స్ విషయంలో వీళ్ల వైపు నుంచి అద్భుతమైన తోడ్పాటు అందించారు. ఇదే ఆయా చిత్రాల తీసే దర్శకులకు మైనస్ అవుతుందా అనే సందేహం కలుగుతోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.అడివి శేష్‌నే తీసుకుందాం. క్షణం, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తోనే తీసిన ఈ మూవీస్.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. వీటి సక్సెస్‌లో శేష్ సహకారం చాలానే ఉంది. కానీ ఈ చిత్రాలు తీసిన దర్శకులు రవికాంత్ పేరేపు, శశికిరణ్ తిక్క.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయా చిత్రాల రిలీజ్‌కి ముందు, తర్వాత కూడా శేష్‌కే చాలా పేరొచ్చింది తప్పితే దర్శకులని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. శేష్ ప్రస్తుతం చేస్తున్న డకాయిట్, గూఢచారి 2 సినిమాలకు దర్శకులు ఎవరని అడిగితే చాలామంది చెప్పలేరు. అది పరిస్థితి.(ఇదీ చదవండి: ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?)నవీన్ పొలిశెట్టి విషయానికొస్తే.. స్వతహాగా తెలుగు కుర్రాడే కానీ మొదట హిందీలో పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, వన్ నేనొక్కడినే, డీ ఫర్ దోపిడి లాంటి చిత్రాల్లో యాక్టింగ్ చేశాడు. కాకపోతే వాటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు! హీరోగా చేసిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ'.. నవీన్ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఈ మూవీ దర్శకుడు ఎవరని అడిగితే.. చాలామంది చెప్పలేరు. అంతెందుకు రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన 'అనగనగా ఒక రాజు' మూవీకి కూడా కర్త కర్మ క్రియ నవీనే.. దర్శకుడిగా మారి అనే కుర్రాడు ఉన్నప్పటికీ.. క్రెడిట్ అంతా నవీన్‌కే వచ్చింది.సిద్ధు జొన్నలగడ్డ.. కెరీర్ ప్రారంభంలో 'ఆరెంజ్'తో పాటు పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసినప్పటికీ 'డీజే టిల్లు' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు దక్కింది. 'టిల్లు స్కేర్'తో ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ రెండు మూవీస్‌కి దర్శకులు ఎవరంటే? చాలామంది చెప్పలేరు. ఎందుకంటే ఈ చిత్రాల రైటింగ్ విషయంలో సిద్ధు కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాల తర్వాత సదరు దర్శకులు కొత్తగా ఏం మూవీస్ చేస్తున్నారో? ఎక్కడున్నారో తెలీదు? ఇలా పైన చెప్పిన హీరోలు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నప్పటికీ.. వీళ్ల సినిమాలకు దర్శకులుగా చేస్తున్న వాళ్లు మాత్రం.. తర్వాత నుంచి పెద్దగా కనిపించకుండా పోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?) -
డెకాయిట్కి బై బై
డెకాయిట్కి బై బై చెప్పేశారు మృణాల్ ఠాకూర్. ఆమెకు వీడ్కోలు చెప్పింది డెకాయిట్ యూనిట్. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా తెలుగు, హిందీ భాషల్లో రానున్న చిత్రం ‘డెకాయిట్’. ఛాయాగ్రాహకుడు షానియల్ డియోను దర్శకుడిగా పరిచయం చేస్తూ, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలోని తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేశారు మృణాల్ ఠాకూర్. అందుకే బై బై చెప్పిన ఆమెకు వీడ్కోలు పలికింది యూనిట్. ‘‘తెలుగు, హిందీ భాషల్లో తన పాత్రకు మృణాల్ డబ్బింగ్ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఉగాది సందర్భంగా మార్చి 19న తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రం టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
'కన్నెపిట్టరో..' సాంగ్‌తో డెకాయిట్ టీజర్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డెకాయిట్. ఒక ప్రేమ కథ అనేది క్యాప్షన్. అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారి సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానిల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.టీజర్ రిలీజ్నాగార్జున నటించిన 'హలో బ్రదర్' మూవీలోని కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో పాటతోనే టీజర్ మొత్తం సాగుతుంది. చివర్లో ఓ చిన్నారి డాక్టర్‌వా..? అని హీరోను అడిగితే అందుకతడు దొంగ అని బదులిస్తాడు. మొత్తానికి టీజర్ అయితే అదిరిపోయింది. టీజర్ డిఫరెంట్‌గా బాగుందంటున్నారు అభిమానులు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. డెకాయిట్ ఉగాది కానుకగా మార్చి 19న విడుదల అవుతోంది. -
అడివి శేష్ డకాయిట్.. ఒకే రోజు రెండు భాషల్లో రిలీజ్..!
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం 'డకాయిట్'. ఈ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అడివి శేష్ చిత్రాలైన క్షణం, గూఢచారి లాంటి సినిమాలకు కెమెరామెన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. డకాయిట్ టీజర్‌ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓకేసారి రెండు భాషల్లో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండు భాషలు, రెండు నగరాలు, రెండు టీజర్స్ అంటూ ప్రత్యేక పోస్టర్స్‌ను పంచుకుంది.ఈనెల 18న గురువారం ఉదయం 11 గంటలకు ముంబయిలో జరిగే ఈవెంట్లో హిందీ టీజర్ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగే ఈవెంట్లో టీజర్ లాంఛ్ చేయనున్నట్వు ప్రకటించారు. కాగా.. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19, 2026న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. 2 LANGUAGES. 2 TEASERS.2 CITIES.Gear up for the #DacoitTeaser on December 18th ❤🔥Grand launch event at Gaiety Galaxy, Mumbai from 11 AM onwards on Dec 18th 🤩Media Meet & Greet event at AAA Cinemas, Hyderabad from 6.30 PM onwards on Dec 18th 💥#DACOIT GRAND RELEASE… pic.twitter.com/KuHsIamvIs— Annapurna Studios (@AnnapurnaStdios) December 15, 2025 -
17 ఏళ్ల వయసులో ప్రేమలో.. అడివి శేష్ లవ్‌స్టోరీ
టాలీవుడ్లో పెళ్లీడుకొచ్చిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ, వాళ్లంతా పెళ్లి అనే పదాన్ని డిక్షనరీలో నుంచి తీసేసినట్లుగా దాని గురించే ఆలోచించడం లేదు. ప్రభాస్, అడివి శేష్, సాయిదుర్గ తేజ్.. ఇలా కొందరు హీరోలు సినిమాల వెంట పడుతున్నారు తప్పితే పర్సనల్ లైఫ్‌పై కాస్తయినా శ్రద్ధ చూపించడం లేదు.అడివి శేష్ లవ్ స్టోరీఇంట్లోవాళ్లు ఎంత ఒత్తిడి చేసినా అవేమీ పట్టనట్లు తమ పనేదో తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా అడివి శేష్ (Adivi Sesh).. రాజు వెడ్స్ రాంబాయి సినిమా ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన లవ్‌స్టోరీ వెల్లడించాడు. నేను చిన్నప్పుడు అమెరికాలోనే పెరిగాను. 17 ఏళ్ల వయసున్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించాను. ఆమె పెళ్లయిపోయిందితనకోసం నా పేరెంట్స్‌కు చెప్పకుండా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వేరే దేశానికి వెళ్లిపోయాను. కట్ చేస్తే.. నా పుట్టినరోజునాడే ఆ అమ్మాయి పెళ్లయిపోయింది. తనకిప్పుడు పెద్ద పిల్లలున్నారు అంటూ నవ్వుతూ చెప్పాడు. గతంలో కూడా శేష్ ఈ ప్రేమకథను బయటపెట్టాడు. ఇప్పటికీ అదే చెప్తున్నాడు. ఈ గ్యాప్‌లో శేష్ మళ్లీ ఎవర్నీ ప్రేమించలేదా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. అడివిశేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ క్రిస్మస్కు విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు అనివార్య కారణాల వల్ల ఈ మూవీ పోస్ట్‌పోన్ అయింది. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిట్ మూవీ గూఢచారికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న గూఢచారి 2 మే 1న విడుదల కానుంది.చదవండి: నా కొడుకు నా ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా? -
'ఈ సారి మామూలుగా ఉండదు'.. డకాయిట్ కొత్త రిలీజ్ డేట్
టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ ప్రేమకథా చిత్రం డకాయిట్(Dacoit). ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి కోలీవుడ్ భామ శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకుంది. ఇది కూడా సినిమా ఆలస్యానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.కానీ వారు అనుకున్న తేదీ ప్రకారం కుదరకపోవడంతో తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు డకాయిట్ మేకర్స్. వచ్చే ఏడాది ఉగాది కానుకగా డకాయిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 'ఈ సారి మామూలుగా ఉండదు.. వెనక్కి తిరిగి చూసేదే లేదు' అంటూ అడివి శేష్ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో డకాయిట్ సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)ఈ మూవీని షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. Ee Saari Mamulga undadhu ❤️🔥There’s NO LOOKING BACK#DACOIT This UGADI MARCH 19th 2026in Theaters WORLDWIDE pic.twitter.com/KaxruBidTN— Adivi Sesh (@AdiviSesh) October 28, 2025 -
అడివి శేష్ ఎక్కడ.. కొత్త సినిమాల సంగతేంటి?
అడివి శేష్.. ఈ పేరు వినిపించి, స్క్రీన్‌పై ఇతడిని చూసి చాలా ఏళ్లయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ హిట్టో ఫ్లాఫో సంగతి పక్కనబెడితే ఎప్పటికప్పుడు ఏదో ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. ఇతడు మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి ఒక్క మూవీని కూడా తీసుకురావట్లేదు. ఈ ఏడాదైనా వస్తాడనుకుంటే ఈసారి కూడా పలు కారణాల వల్ల హ్యాండిచ్చేసినట్లు తెలుస్తోంది.క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2.. ఇలా వరస సినిమాలతో శేష్.. సక్సెస్ అందుకున్నాడు. మరి కారణాలేంటో తెలీదు గానీ 2022 డిసెంబరులో హిట్ 2 రిలీజైంది. తర్వాత గూఢచారి, డకాయిట్ అనే చిత్రాల్ని ప్రకటించాడు. అప్పటినుంచి అవి సెట్స్‌పైనే ఉన్నాయి. లెక్క ప్రకారం 'డకాయిట్' మూవీ ఈపాటికే రిలీజైపోవాలి. తొలుత శ్రుతిహాసన్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఎక్కడ తేడా కొట్టిందో గానీ శ్రుతి ప్లేసులోకి మృణాల్ ఠాకుర్ వచ్చింది. ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్ అని పోస్టర్ కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడిది వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?)శేష్ గతంలో ఓసారి గాయపడ్డాడు. అయితే అది ఇంకా తగ్గే దశలో ఉందని, దీంతో షూటింగ్స్ పూర్తవక 'డకాయిట్' వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. త్వరలో కొత్త విడుదల తేదీని కూడా టీమ్ ప్రకటించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కావాల్సిన 'గూఢచారి 2' కూడా కచ్చితంగా వాయిదా పడే అవకాశముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?శేష్ మంచి నటుడే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఒకటి అరా సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. లేదంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ. మళ్లీ రిలీజ్ టైంలో ప్రమోషన్లలో హడావుడి చేసినా సరే ఎవరా హీరో అని అనుకోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చి శేష్.. హిట్ కొట్టాల్సిన అవసరముంది!(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?) -
ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చిన గూఢచారి
అడివి శేష్.. క్షణం, గూఢచారి, మేజర్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ 2022లో వచ్చిన 'హిట్ 2' తర్వాత హీరోగా మరో సినిమా చేయలేదు. దాదాపు మూడేళ్లుగా కనిపించలేదు. కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' మూవీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది క్రిస్మస్కి థియేటర్లలోకి రానుంది. మరోవైపు చాన్నాళ్లుగా సెట్స్‌పై ఉన్న 'గూఢచారి 2' గురించి కూడా అప్డేట్ ఇచ్చారు.(ఇదీ చదవండి: హీరోకి మెల్లకన్ను ఉంటే.. 'శ్రీ చిదంబరం' గ్లింప్స్ రిలీజ్)2018లో రిలీజైన 'గూఢచారి' సూపర్ హిట్ అయింది. దానికి కొనసాగింపుగా తీస్తున్న సీక్వెల్ మాత్రం చాలా కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తోంది. తొలుత బనిత సంధు అనే హీరోయిన్ అనుకున్నారు. ఏమైందో గానీ ఆమెని తీసేసి బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బిని పెట్టుకున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూడు పోస్టర్స్ రిలీజ్ చేశారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. వినయ్ కుమార్ దర్శకుడు. 'గూఢచారి' కథ మొత్తం భారతదేశంలోనే జరగ్గా.. ఈ రెండో భాగం అంతర్జాతీయంగా ఉండనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ రెండో భాగంలో పరిచయం కానున్నాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు) -
టాలీవుడ్ మూవీ షూటింగ్లో ప్రమాదం.. అడివి శేష్, మృణాల్‌కు గాయాలు!
టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా జరుగుతున్న షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హీరోతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం. అయినప్పటికీ ఈ రోజు షూట్‌ను యథాతథంగా కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అడివి శేష్‌కు కాలు బాగా వాపు రావడంతో ఆస్పత్రికి వెళ్లనున్నట్లు టాక్.కాగా.. ఇప్పటికే డకాయిట్ మూవీ నుంచి ఫైర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డకాయిట్‌ను ప్రేక్షకులమ ముందుకు తీసుకొస్తున్నారు. -
డెకాయిట్ కోసం..
‘డెకాయిట్’ కోసం హైదరాబాద్ చేరుకున్నారు మృణాల్ ఠాకూర్. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ లవ్‌స్టోరీ చిత్రం ‘డెకాయిట్’. ‘ఏక్ ప్రేమ్ కథ’ అనేది ట్యాగ్‌లైన్. షనీల్ డియో డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు మృణాల్ ఠాకూర్. ‘డెకాయిట్’ సినిమా సెట్స్‌లోకి జాయిన్ అయినట్లుగా తన ఇన్‌స్టా అకౌంట్లో కన్ఫార్మ్ చేశారీ బ్యూటీ. ఈ కీలక షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంటుందట.ఇద్దరు మాజీ ప్రేమికులు తమకు ఇష్టం లేకపోయినా ఓ క్రైమ్‌ను కలిసి చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథాంశమనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలోని కొంత భాగం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని, మదనపల్లె యాసలో అడివి శేష్ క్యారెక్టర్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. -
డకాయిట్ నుంచి శృతి హాసన్ అవుట్.. కారణం అదేనన్న అడివి శేష్!
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న తాజా డగాయిట్. క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేసిన షానీల్ డియో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్ సరసన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఆమె తప్పుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్‌ను ఎంచుకున్నారు. తాజాగా శృతి హాసన్ మూవీ తప్పుకోవడంపై అడివి శేష్ స్పందించారు. శృతిహాసన్‌తో తనకు విభేదాలు తలెత్తాయని వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)డకాయిట్ నుంచి శృతిహాసన్ తప్పుకోవడంపై ఎలాంటి వివాదం లేదని అడివి శేష్ అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాల వల్లే తాను తప్పుకుందని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇక్కడ ప్రధానంగా వర్కింగ్ స్టైల్ కుదరక పోవడం వల్లే తాను తప్పుకుందని తెలిపారు. అంతేకాకుండా శృతిహాసన్ కూలీ మూవీతో బిజీగా ఉన్నారని శేష్ తెలిపారు.అడివి శేష్ మాట్లాడుతూ..'కూలీతో ఆమె బిజీగా ఉన్నారు. సినిమా చేయడానికి నాకు చాలా టైమ్ పడుతుంది. ఆ ప్రాసెస్‌లో నాకు సింక్ అవ్వాలి. అంతే తప్ప ఇందులో ఎలాంటి వివాదం లేదు. మృణాల్ స్క్రిప్ట్ వినగానే ఓకే చెప్పారు. పది గంటలకు కథ చెప్పగానే.. మధ్యాహ్నం ఒంటిగంటకే ఓకే చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అరవై శాతం పూర్తయింది' అని పంచుకున్నారు. కాగా.. డకాయిట్ మూవీని తెలుగు, హిందీలో ఓకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్.. అవాక్కైన హీరో
అశ్విని శ్రీ (Ashwini Sree).. పలు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసినా రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్న ఈమె షోకు గ్లామర్ అద్దింది. ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో అశ్విని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ డ్యాన్స్ షోలో హీరో అడివి శేష్ గెస్టుగా రావడాన్ని చూసి ఈ బిగ్‌బాస్ బ్యూటీ సర్ప్రైజ్ అయింది. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని శేష్‌కు చెప్పింది. అక్కను పెళ్లి చేసుకుంటే..అందుకా హీరో.. నాక్కూడా మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని బదులిచ్చాడు. అప్పుడు అశ్విని.. మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది. అంటే అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను అనేసరికి శేష్ నోరెళ్లబెట్టాడు. అయితే ఎలా వస్తాననేది కూడా చెప్తాననేసరికి హీరో నవ్వుతూనే సరేనని బదులిచ్చాడు. సదరు డ్యాన్స్ షో ప్రోమోలో ఇంతవరకే చూపించారు. ఏదేమైనా అశ్విని మాట్లాడిన తీరుకు అక్కడున్న జనం నవ్వాపుకోలేకపోయారు. ఇలా ట్విస్టులు ఇచ్చుకుంటూ మాట్లాడేబదులు అసలు విషయమేంటో డైరెక్ట్‌గా చెప్పొచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. రెండో జన్మ ఎత్తిన సింగర్! -
అడివి శేష్ పాన్ ఇండియా మూవీ .. ఫైర్ థీమ్ రిలీజ్
అడివి శేష్ నటిస్తోన్న తాజా చిత్రం ' డకాయిట్'. ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ఇందులో అడివి శేష్ సరసన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి ఫైర్ థీమ్(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) రిలీజ్ చేశారు. ఈ ఫైర్ థీమ్‌ను భీమ్స్ సిసిరోలియో పవర్‌ఫుల్‌గా కంపోజ్ చేశారు. ఇక ఆడియన్స్‌కి ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది. అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఈ క్రిస్మస్ కానుకాగ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. Put on your headphones and enjoy the musical fire 🔥🎧#DACOITFire Glimpse OST now streaming on all platforms ❤🔥▶️ https://t.co/cEqYoQldqu#DACOIT IN CINEMAS WORLDWIDE ON DECEMBER 25th 💥#DacoitFromDec25th@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 @Deonidas… pic.twitter.com/8DaP6zD1WH— Annapurna Studios (@AnnapurnaStdios) June 3, 2025 -
అడివి శేష్ గ్యాప్ కి కారణం ఇదేనా..!
-
'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల
అడివి శేష్ కొత్త సినిమా ' డకాయిట్' నుంచి ఫైర్ గ్లింప్స్‌ను (Dacoit Fire Glimpse) మేకర్స్ విడుదల చేశారు. షానీల్ డియో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తుంది. ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది..? అన్నది ఆసక్తిగా ఉంటుంది. -
ఇది సినిమా కాదు... ఒక జీవితం: అడివి శేష్
‘‘అనగనగా’ చిత్రంలో వ్యాస్పాత్రను సుమంత్‌గారు అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ అలానే ఉంటారు. సన్నీ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఓటీటీలో ఈ సినిమా చూస్తున్నంత సేపూ థియేటర్లో చూడాల్సిన సినిమా కదా అనిపించింది’’ అన్నారు అడివి శేష్. సుమంత్ కుమార్, కాజల్ చౌదరి జంటగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా’. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ నెల 15న విడుదలైంది.ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కి అతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో రామ్‌పాత్ర కంటతడి పెట్టించింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది. ఇది సినిమా కాదు..ఒక జీవితం’’ అన్నారు. సుమంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మేము అనుకున్న దానికంటే అద్భుతమైన ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమాకి వస్తున్న స్పందన చూసి ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినీ ప్రపంచానికి నన్ను, మా టీమ్‌ను పరిచయం చేసిన చిత్రం ఇది’’ అన్నారు సన్నీ సంజయ్. ‘‘ఇంత పెద్ద సక్సెస్ సుమంత్‌గారి వల్లే సాధ్యమైంది’’ అని రాకేశ్ రెడ్డి గడ్డం తెలిపారు. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడారు. -
HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సీక్వెల్స్ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే అదే లైన్‌తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్‌తో కొత్త ట్రెండ్‌ని సెట్ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్.నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.నిజానికి హిట్ ‘హిట్ 2’లో నాని కనిపించినట్టే హిట్ 3లో హీరో అడివి శేష్, విశ్వక్సేన్ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్ మాత్రం స్పెషల్ రోల్ చేస్తున్నాడు కానీ, విశ్వక్సేన్ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్ సేన్ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్ 2లో చేసినట్టే... క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్ చేసే విధంగా ‘హిట్ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సీక్రెసీ మెయిన్టైన్ చేస్తుందా? చూడాలి. -
సాహసంలో భాగస్వామికి స్వాగతం
అడివి శేష్ స్పై మిషన్‌లో చేరారు వామికా గబ్బి. అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘జీ2’. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా, ‘జీ2’ రూపొందుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్గా వామికా గబ్బి నటిస్తున్నట్లు వెల్లడించారు. ‘వెల్కమ్ టు ది మిషన్. మైపార్ట్నర్ ఇన్ అడ్వెంచర్ (మిషన్కి స్వాగతం... సాహసంలో నా భాగస్వామి)’’ అని వామికా గబ్బిని ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు అడివి శేష్. ‘‘జీ2’ ప్రయాణంలో భాగం కావడం హ్యాపీగా ఉంది’’ అని వామికా పేర్కొన్నారు. ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు షాలిని తదితరులు నటిస్తున్న ‘జీ2’ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది విడుదల కానుంది. -
టాలీవుడ్ హీరో అడివిశేష్ ఇంట్లో చండీ హోమం (ఫోటోలు)
-
డకాయిట్ మిస్టరీ.. శృతి పోయి మృణాల్ ఎలా వచ్చింది?
-
శృతి హాసన్ కాదు.. 'డెకాయిట్'లో మృణాల్
అంతా ఫిక్స్ అయిన తర్వాత సినిమాల విషయంలో కొన్నిసార్లు చేర్పులు మార్పులు జరుగుతుంటాయి. అయితే హీరో లేదా హీరోయిన్ని మాత్రం ఎప్పడో ఓసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా నుంచి హీరోయిన్గా శృతి హాసన్‌ని తీసేసి మృణాల్ ఠాకుర్‌ని ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్)2022లో 'మేజర్' సినిమా వచ్చింది. దీని తర్వాత అడివి శేష్ ఏ సినిమాలు చేస్తున్నాడో కనీసం చిన్న అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మధ్యలో 'గూఢచారి 2' గురించి చెప్పారు గానీ. అది ఏ స్టేజీలో ఉందనేది క్లారిటీ లేదు. మరోవైపు కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' అనే సినిమాను ప్రకటించిన శేష్.. శృతి హాసన్‌తో కనిపించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు.కట్ చేస్తే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ మారిపోయింది. శృతి ప్లేసులోకి మృణాల్ వచ్చి చేరింది. మరి కావాలనే తప్పించారా? లేదా శృతి హాసన్ తప్పుకొందా అనేది తెలియాల్సి ఉంది. మూవీ పోస్టర్‌తో పాటు 'అవును వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అని మృణాల్ క్యాప్షన్ పెట్టింది. మరోవైపు శేష్ కూడా ఈ పోస్టర్స్ షేర్ చేస్తూ.. 'అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు..! ఇడిచిపెట్టను...తేల్చాల్సిందే' అని క్యాప్షన్ పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అవును వదిలేసాను..కానీ మనస్పూర్తిగా ప్రేమించానుHappy Birthday, @AdiviSesh ✨Let's kill it - #DACOIT pic.twitter.com/tH4trCr0Fe— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024 -
టాలీవుడ్ మూవీ నుంచి తప్పుకున్న శృతి హాసన్!
కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గతేడాది సలార్ మూవీ అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం రజినీకాంత్ చిత్రం కూలీలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.అయితే శృతిహాసన్ ఇప్పటికే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. అందులో టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న డెకాయిట్:ఎ లవ్ స్టోరీ ఒకటి. అంతే కాకుండా చెన్నై స్టోరీ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాల నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే కొన్ని విభేదాల కారణంగానే ఆమె గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితుల్లో ఒకరు మీడియాకు వెల్లడించారు. డెకాయిట్‌తో పాటు చెన్నై స్టోరీ కూడా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్ .. వీడియో వైరల్)కాగా.. గతేడాది డిసెంబర్లో అడివి శేష్, శృతి హాసన్ జంటగా డెకాయిట్ మూవీని ప్రకటించారు. అదే రోజున అనౌన్స్మెంట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు చెన్నై స్టోరీలో శ్రుతి హాసన్ డిటెక్టివ్ పాత్రను పోషించాల్సి ఉంది. అంతకు ముందు సమంత రూత్ ప్రభుని ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్నారు. ఆ తర్వాత శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. తాజాగా శృతి కూడా సినిమా నుంచి తప్పుకుంది. -
క్యాన్సర్‌తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
క్యాన్సర్‌తో పోరాటం.. చిన్నారిని ఆడించిన అడివి శేష్
టాలీవుడ్ హీరో అడివి శేష్ మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి కీర్తిని కలిసి తనతో సరదాగా కాలక్షేపం చేశాడు. ఆ చిన్నారిని ఎత్తుకుని ఆటలాడాడు. ఈ సందర్భంగా తనకు బొమ్మలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్సలో భాగం కీమోథెరపీ చేసినప్పుడు తలపై వెంట్రుకలు తీసేస్తారు. అలా వెంట్రుకలు పోగొట్టుకున్న కీర్తి.. తను వేసిన డ్రాయింగ్‌లోనూ పాపకు జుట్టు తీసేసింది.వీడియో వైరల్అడివి శేష్.. ఆ చిన్నారిని ఆడిస్తూ, నవ్విస్తూ చాలాసేపు కబుర్లు చెప్పాడు. కాసేపు తన బాధనంతా మర్చిపోయి సంతోషంగా నవ్వేలా చేశాడు. పాపకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు మిగిల్చి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శేష్ మంచితనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. బిజీ టైంలోనూ పాప కోసం సమయం కేటాయించడాన్ని కొనియాడుతున్నారు.డెకాయిట్ఇక సినిమాల విషయానికి వస్తే అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. క్షణం, గూఢచారి వంటి పలు చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానీల్ డియో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీలో ఈ మూవీ చిత్రీకరిస్తున్నారు. #AdiviSesh's Heartwarming Act of Kindness ❤️In an inspiring and touching gesture, Hit Machine @AdiviSesh recently reached out to surprise a little girl battling cancer, bringing joy to her.His genuinly loving heart has left a lasting impact in both the little girl and her… pic.twitter.com/g8K5KTsyIu— Shreyas Sriniwaas (@shreyasmedia) July 20, 2024చదవండి: ఆ హీరోయిన్‌కు యాక్టింగ్ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్ -
సన్నీ చంద్ర నుంచి అడివి శేష్ గా పేరు మార్చుకోవడానికి కారణం తెలిస్తే
-
అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్
గూఢచారి, హిట్ 2, ఎవరు? మేజర్ సినిమాలతో అడివి శేష్ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ హీరో గూఢచారి 2, డెకాయిట్ సినిమాలు చేస్తున్నాడు. అందులో హీరోగా నటించడమే కాకుండా ఈ రెండు చిత్రాలకు రచయితగానూ వ్యవహరిస్తున్నాడు. డెకాయిట్‌లో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలోని ప్రతి సీన్, డైలాగ్‌ను హిందీతోపాటు తెలుగులోనూ చిత్రీకరిస్తున్నారు.అసలు పేరు ఇదీ!ఈ సినిమాలతో బిజీగా ఉన్న అడివి శేష్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన అసలు పేరును బయటపెట్టాడు. తన ఒరిజినల్ నేమ్ సన్నీ చంద్ర అని చెప్పాడు. అమెరికాలో ఉన్నప్పుడు నా పేరు చూసి అందరూ ఏడిపించేవారు. అక్కడ ఆరెంజ్ ఫ్లేవర్‌లో సన్నీ డిలైట్ అని ఓ జ్యూస్ ఉండేది. అలాగే అప్పట్లో సన్నీలియోన్ చాలా పాపులర్.ఏడిపించారునా పేరులో సన్నీ ఉండటంతో అందరూ టీజ్ చేసేవారు. ఇదే విషయం నాన్నకు చెప్పాను. అయితే శేష్ అనే పేరు వాడుకో అని సూచించాడు. నాకర్థం కాలేదు. సునీల్ గవాస్కర్ అభిమానిని కాబట్టి సన్నీ అని పెట్టాను. పూజారి శ అక్షరంతో పేరుండాలని చెప్పారు. అలా నీకు శేషు అనే పేరు కూడా ఉందన్నాడు. అప్పటి నుంచి నా పేరు అడివి శేష్‌గా మారింది.చదవండి: ఆఫీస్‌లో చోరీ.. వీడియో రిలీజ్ చేసిన నటుడు -
మాజీ ప్రేమికుల కథ
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్నపాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ‘డెకాయిట్’తో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్‌కి జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఈ విషయాన్ని తెలియజేస్తూ... శేష్, శ్రుతి సరదాగా దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారు
‘‘హరోం హర’ ట్రైలర్ చాలా నచ్చింది. సుధీర్‌బాబు మంచి సినిమా చేశాడని తెలిసి, ఈ వేడుకకి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్స్‌ని పిలిచి షో వేశారంటే సినిమాపై యూనిట్‌కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌పై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ (టీజర్, ట్రైలర్, ΄ాటలు...) ్ర΄ామిసింగ్గా ఉంది. సుబ్రహ్మణ్యం, సుమంత్ లాంటి ΄్యాషన్ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ‘హరోం హర’ లాంటి నేపథ్యంలో సినిమా రాలేదు. నాతో ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్కి థ్యాంక్స్. ఈ సినిమా చూశాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం’’ అన్నారు నిర్మాత సుమంత్. ‘‘హరోం హర’లోని తండ్రీ కొడుకుల ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగో΄ాల్, డైరెక్టర్ మారుతి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. -
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
‘‘నా తొలి సినిమా ఆడియో లాంచ్‌కి నరేశ్‌గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నేను రావడం హ్యాపీగా ఉంది. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాని మనమంతా థియేటర్లో చూసి హాయిగా నవ్వుకుందాం’’ అని హీరో అడివి శేష్ అన్నారు.‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చిలకప్రోడక్షన్స్పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘నేను ఇన్నేళ్ల పాటు పరిశ్రమలో ఉండటానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం మా నాన్న ఈవీవీ సత్యనారాయణగారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ డైరెక్టర్ మల్లి అంకంతో కలిపి ఇప్పటివరకూ దాదాపు 30 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను.ఈ మండు వేసవిలో మీ బాధలు మర్చిపోయి రెండు గంటలు హాయిగా మా సినిమాతో ఎంజాయ్ చేయండి’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్లి అంకం. ‘‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి మంచి మూవీ చేయడం మా అదృష్టం’’ అన్నారు రాజీవ్ చిలక. ఈ వేడుకలో సహ నిర్మాత భరత్, దర్శకులు విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవా కట్టా, రచయితలు బీవీఎస్ రవి, అబ్బూరి రవి, నటి జామి లివర్ మాట్లాడారు. -
నెక్స్ట్ 100 కోట్ల స్టార్ హీరో అతడే!
కంటెంట్ ఉంటే హీరో కటౌట్‌తో పనిలేకుండా సెంచరీలు కొట్టేస్తున్న రోజులివి. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్లో కొత్త ఆటగాళ్లు ఎలా దంచికొడుతున్నారో.. సినిమాల్లోకి కొత్తగా వచ్చిన హీరోలు కూడా అలాగే వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ చిత్రం విజయం సాధించడంతో సిద్దు జొన్నలగడ్డ 100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. సిద్దు సెంచరీ కొట్టడంతో టిల్లు క్యూబ్ అంటూ తన తదుపరి చిత్రంపై కూడా మరింత అంచనాలను పెంచగలిగాడు. ఆ రకంగా సిద్దు ఇండస్ట్రీలో తనని తానే సెంచరీ స్టార్‌గా తీర్చిదిద్దుకున్నాడు. టిల్లుతో తనలో ఉన్న రైటింగ్ స్కిల్స్ అతన్ని 100 కోట్ల హీరోగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాయి అన్నది వాస్తవం. అయితే ఇతడి కంటే ముందు తేజ సజ్జ హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాడు. అలాగే హీరో నాని దసరా చిత్రంతో 100 కోట్ల క్లబ్లో చేరాడు.గీతగోవిందంతో విజయ్ దేవరకొండ, ఎఫ్-2 తో వరుణ్ తేజ్, 100 కోట్ల క్లబ్లో చేరగా.. కార్తికేయ-2 తో నిఖల్ వంద కోట్లు సాధించడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇక తన తొలి సినిమా ఉప్పెన చిత్రంతోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా వందకోట్ల క్లబ్లో చేరిన వాడే. మరి ఈ రేసులో తదుపరి సెంచరీ కొట్టే స్టార్ ఎవరు? అంటే ఆ ఛాన్స్ అడివి శేష్‌కు ఉందని చెప్పొచ్చు. గతంలో శేష్ నటించిన గుఢచారి, హిట్-2, ఎవరు, మేజర్ లాంటి సినిమాలతో అడవి శేష్ పేరు సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు 50-60 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. మేజర్ పాన్ ఇండియా స్థాయిలో హిట్‌గా నిలిచి 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం శేష్ గుఢచారి-2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాలతో నటనతో పాటు రైటింగ్‌లో కూడా శేష్‌కు అపార అనుభవం ఉంది. తనని స్టార్‌గా మార్చుకోవడంలో రైటింగ్ స్కిల్ అతడికి ఎంతో ఉపయోగపడుతోందని చెప్పాలి. గుఢచారి-2 తో అడివి శేష్ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడతాడు అనే అంచనాలున్నాయి. ట్రేడ్ సైతం ఈ సినిమాతో సాధ్యమని భావిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. -
Banita Sandhu: ‘గూఢచారి’తో యాక్షన్‌కి సిద్ధమైన బనితా సంధు!
‘అక్టోబర్, సర్దార్ ఉదమ్’ వంటి హిందీ చిత్రాలతో, తమిళ చిత్రం ‘ఆదిత్య వర్మ’తో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బనితా సంధు. ఈ బ్యూటీ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అడివి శేష్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ ఫిల్మ్ (2018) ‘గూఢచారి’కి సీక్వెల్‌గా పాన్ ఇండియా స్థాయిలో ‘జీ 2’ తెరకెక్కుతోంది. గూఢచారిగా హీరో అడివి శేష్ నటిస్తున్నారు. ఈ స్పై సరసన బనితా సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గుజరాత్‌లోని భుజ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో బనితా జాయిన్ అయిన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘శేష్, బనితాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. తెరపై ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. హై ఆక్టేన్ యాక్షన్ మూవీగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘‘ఈ చిత్రంలో నటించడం క్రియేటివ్‌గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకూ చేయని పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను’’ అని బనితా సంధు అన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేస్తున్నారు. View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) -
రేపు బ్యాండు మోగించాలి : హీరో అడివి శేష్
‘‘చాయ్ బిస్కట్ సంస్థలో సుహాస్ వీడియోలు చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి ప్రతిభ ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారు. తను ఏ స్థాయికి వెళతాడో ఊహించలేను. ఏదో ఒక రోజు తను నా వేడుకకి అతిథిగా రావాలి. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ట్రైలర్ నచ్చడంతో పది సార్లు చూశా. రేపు (శుక్రవారం) మనమంతా ఈ సినిమా బ్యాండ్ మోగించాలి’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుహాస్, శివానీ నాగరం జంటగా దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుష్యంత్ కటికనేని మాట్లాడుతూ– ‘‘సుహాస్ లేకుంటే డైరెక్టర్‌గా ఈ వేదికపైకి వచ్చేందుకు ఇంకా ఎన్నేళ్లు పట్టేదో తెలియదు’’ అన్నారు. ‘‘నేను నిర్మాతగా ఈ వేదికపై నిలబడటానికి అల్లు అరవింద్, అల్లు శిరీష్, ‘బన్నీ’ వాసుగార్లే కారణం. సుహాస్ లేకుంటే ఈ చిత్రం లేదు’’ అన్నారు ధీరజ్ మొగలినేని. -
చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు: మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్‌ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్‌కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్‌ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్‌కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్‌కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్ ట్విటర్ ద్వారా మెగాస్టార్‌కు కంగ్రాట్స్ తెలియజేశారు. Congratulations to #Megastar @KChiruTweets on being honoured with the #PadmaVibhushan , a great honour bringing great pride to #TeluguCinema and to his people who love him. Hard work never fails🙏 pic.twitter.com/2l4SEPFIII — Radikaa Sarathkumar (@realradikaa) January 25, 2024 Hearty congratulations, Dear Chiru Bhai, for being conferred with the Padma Vibhushan.@KChiruTweets — Mammootty (@mammukka) January 25, 2024 Congratulations sir ❤️❤️ You are always an Inspiration 😊#PadmaVibhushanChiranjeevi #Megastar https://t.co/41qCnAkw2K — Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2024 Many congratulations to you, Sir @KChiruTweets Gaaru, on the honor bestowed upon you. You rightly deserve it. Your contribution to cinema, the world of art, your philanthropic lifestyle, your good work for the public and the blessings of your elders brings you this. As a friend,… https://t.co/DXKj4RgZw7 — KhushbuSundar (@khushsundar) January 26, 2024 Good morning Padma Vibhushan Chiranjeevi gaaru :) ♥️@KChiruTweets 🙏🏼 — Hi Nani (@NameisNani) January 26, 2024 Telugu vadi Garva Karanam Mega 🌟 Padma Vibhushan@KChiruTweets garu #MegastarChiranjeevi Garu — Teja Sajja (@tejasajja123) January 25, 2024 Congratulations Annaya @KChiruTweets on being recipient to the second highest civilian award #PadmaVibhushan Much Deserving Honour for your inspiring legacy & contribution. Thank you for holding cinema high at every instance. ❤️ pic.twitter.com/SvqDpnCBfI — Satya Dev (@ActorSatyaDev) January 25, 2024 My favorite picture I have of us sir @KChiruTweets ❤️ Thank you for always being kind and warm to me. Thank you for the amazing films. Thank you for the brilliant performances. Thank you for being our MEGASTAR. You are now a #PadmaVibhushan Sir. A proud moment for us, for TFI… pic.twitter.com/Wa7Q9x6V4P — Adivi Sesh (@AdiviSesh) January 26, 2024 Congratulations to our BOSS @KChiruTweets Garu on being felicitated with the honorary award #PadmaVibhushan ❤️ Thank you for making us all proud yet again and again. pic.twitter.com/pW5LEbVtuo — Vassishta (@DirVassishta) January 25, 2024 -
చిరంజీవితో పోటీకి సిద్ధమైన అడివి శేష్
-
అడివిశేష్‌తో జోడీ కట్టనున్న శృతి హాసన్
అడివి శేష్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రధారులుగా ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే షార్ట్ ఫిల్మ్‌కు షాన్ దర్శకత్వం వహించారు. శేష్, శ్రుతి కాంబినేషన్లో ఆయన దర్శకత్వం వహించనున్న తాజా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి సీన్, డైలాగ్‌లను హిందీతో పాటు తెలుగులో కూడా చిత్రీకరించనున్నాం. ప్రతి భాషకు ఉన్న ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ సినిమాను విభిన్నంగా చేస్తున్నాం. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
గూఢచారితో జోడీ
అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి 2’ (జీ 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరో యిన్‌గా బనితా సంధుని ఫిక్స్ చేసినట్లు యూనిట్ పేర్కొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అక్టోబర్, సర్దార్ ఉదమ్’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న బనితా. ‘జీ 2’లో సరికొత్త పాత్రలో కనిపిస్తారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘నా తొలి పాన్ ఇండియా చిత్రమిది’’ అన్నారు బనితా సంధు. -
అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!
యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన అనసూయ.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ మారిపోయింది. ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనసూయ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను అనుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు చాలా ఉద్యోగాలు కూడా చేసినట్లు వెల్లడించింది. ఎంబీఏ చదివిన అనసూయ హెచ్ఆర్గా పనిచేశానని పేర్కొంది. అయితే ఇండస్ట్రీలో హీరోలపై చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. అనసూయ మాట్లాడుతూ.. ' నేను యాక్సిడెంటల్‌గానే ఇండస్ట్రీలోకి వచ్చా. క్షణం సినిమాలో నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా. కానీ సోగ్గాడే మూవీ ముందే రిలీజైంది. కేవలం రెండు వారాల గ్యాప్‌లోనే రెండు ఛాన్సులు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఛానెల్ షోలో పనిచేసేదాన్ని. ఆ సమయంలో అక్కడే సడన్‌గా షూట్లోనే నన్ను అడిగారు. నాగార్జున సార్ సినిమా అనగానే ఒప్పేసుకున్నా. నాకు హలో బ్రదర్ అంటే చాలా ఇష్టం.' అంటూ చెప్పుకొచ్చింది. క్షణం సినిమాలో ఛాన్స్ రావడం పట్ల మాట్లాడుతూ..'నేను దేవిశ్రీ ప్రసాద్‌తో 2013లో పనిచేశా. ఆ టైంలో అడివి శేష్ కలిశాడు. అప్పుడు నేను అనుకునేదాన్ని. ఈ హీరోలంతా లైన్ వేయడానికే అప్రోచ్ అవుతారని అనిపించింది. అందుకే అప్పుడు అడివి శేష్‌ను బాగా అవాయిడ్ చేశా. ఓ మూడు నెలల తర్వాత ఒక కాఫీ షాప్‌లో అనుకోకుండా మేం కలిశాం. అక్కడ కూర్చోబెట్టి మీరు దొరకట్లేదని నేరేషన్ ఇచ్చారు. అప్పుడే నాకు అర్థమైంది. వాళ్ల సినిమాకు నా అవసరం ఉందనే విషయం. జబర్దస్త్‌లో నేను సీరియస్‌గా కనిపించడం అడివి శేష్ చూశారట. అందుకే ఆ పాత్రకు నేనే సెట్ అవుతారని అనుకున్నారు.' అని అన్నారు. కాగా.. అనసూయ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పుష్ప-2లో నటిస్తోంది. రవికాంత్‌లో దర్శకత్వంలో తెరకెక్కించిన క్షణం మూవీలో అడివి శేష్, అదా శర్మ జంటగా నటించగా.. అనసూయ కీలక పాత్రలో కనిపించింది. హీరో లు అందరు లైన్ వెయ్యడానికి అప్రోచ్ అవుతారు అనుకోని నేను తెగ avoid చేసేదాన్ని : — #AnasuyaBharadwaj Video Credit @rajeshmanne1 pic.twitter.com/ManFtpwRii — Milagro Movies (@MilagroMovies) November 5, 2023 -
క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో అడివి శేష్ (ఫొటోలు)
-
మా ఊరి పొలిమేర 2 నా సినిమా లాంటిది
‘‘నా ‘క్షణం’ సినిమాకి పని చేసిన టీమ్ అంతా ‘‘మా ఊరి పొలిమేర 2’ టీమ్‌లో ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ నాకు మంచి స్నేహితుడు. ‘మా ఊరి పొలిమేర ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసి, దానికి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ తీయడం ఆనందంగా ఉంది. ఇది నా సొంత సినిమా లాంటింది. తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. ‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర–2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథులుగా అడివి శేష్, నిర్మాత ఎస్కేఎన్ హాజరయ్యారు. ఎస్కేఎన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏదైనా అదే కష్టమే. ప్రేక్షకులకు మంచి సినిమా కావాలి.. అంతే. ‘మా ఊరి పొలిమేర–2’కి హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ఇంత గ్రాండ్‌గా విడుదల కావడానికి కారణం వంశీ నందిపాటిగారు. మా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్ విశ్వనాథ్. ఈ వేడుకలో కామాక్షీ భాస్కర్ల, గాయకుడు పెంచల్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాకు అహంకారం ఉంది అనుకుంటారు..!
-
నా గర్ల్ ఫ్రెండ్స్ గురించి ? : అడివి శేష్
-
నా లైఫ్ ను నేనే రాసుకుంటున్న: అడివి శేష్
-
నా ఒరిజినల్ పేరు శేష్ కాదు..!
-
నేడు సైమా అవార్డ్స్ ప్రకటన.. పోటీ పడుతున్న తెలుగు స్టార్స్ వీళ్లే
సినిమా ఇండస్ట్రీలో సైమా పండుగ మొదలైపోయింది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 పండుగకు సర్వం సిద్ధమైంది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డుగా సైమాకు గుర్తింపు ఉంది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుక మరికొన్న గంటల్లో దుబాయ్‌లో జరగనుంది. ఇప్పటికే అక్కడకు జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరుకున్నారు. గతేడాది రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాలను.. అందులో మంచి నటనను కనపరిచిన నటీనటులకు, ప్రేక్షకులు మెచ్చిన సినిమాలను వెలికి తీసి వారిని అవార్డులతో గౌరవించడం అనేది పరిపాటి అని తెలిసిందే. ఈ పోటీలో ఎవరెవరున్నారో ఆ లిస్ట్‌ను సైమా ఇప్పటికే విడుదల చేసింది. ఉత్తమ నటుడు, చిత్రం – తెలుగు (2023) ♦ అడవి శేష్ (మేజర్) ♦ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ (RRR) ♦ దుల్కర్ సల్మాన్ (సీతారామం) ♦ నిఖిల్ సిద్దార్ద్ (కార్తికేయ) ♦ సిద్దు జొన్నలగడ్డ (DJ టిల్లు) ఉత్తమ దర్శకుడు – తెలుగు (2023) ♦ రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ♦ హను రాఘవపూడి (సీతారామం) ♦ చందూ మొండేటి (కార్తికేయ 2) ♦ శశికిరణ్ తిక్కా (మేజర్) ♦ విమల్ కృష్ణ (డీజే టిల్లు) ఉత్తమ గేయ రచయిత ♦ RRR సినిమా నుంచి నాటు నాటు (చంద్రబోస్) ♦ సీతారామం నుంచి 'ఇంతందం' సాంగ్ (కృష్ణకాంత్) ♦ ఆచార్య సినిమా నుంచి 'లాహె.. లాహె' సాంగ్ (రామజోగయ్య) ♦ RRR నుంచి 'కొమురం భీముడో' సాంగ్ (సుద్దాల అశోక్ తేజ) ఉత్తమ సహాయ నటి ♦ అక్కినేని అమల (ఒకే ఒక జీవితం) ♦ ప్రియమణి (విరాట పర్వం) ♦ సంయుక్త మీనన్ (భీమ్లా నాయక్) ♦ సంగీత (మాసూద) ♦ శోభిత ధూళిపాళ (మేజర్) ఉత్తమ విలన్ ♦ సత్యదేవ్ (గాడ్ ఫాదర్) ♦ జయరామ్ (ధమాకా) ♦ సముద్రఖని (సర్కారు వారి పాట) ♦ సుహాస్ (హిట్-2) ► పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు గెలుచున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..సైమా 2023లో కనీసం నామినేషన్ కాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. A glimpse of the star-studded moments. SIIMA 2023 pre-event press meet highlights!#NEXASIIMA #DanubeProperties #A23Rummy #HonerSignatis #Flipkart #ParleHideAndSeek #LotMobiles #SouthIndiaShoppingMall #TruckersUAE #SIIMA2023 #A23SIIMAWeekend #SouthIndianAwards #Docile… pic.twitter.com/hlVL9fI050 — SIIMA (@siima) September 14, 2023 (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) -
'మహావీరుడు'ని తెలుగువారు ఇష్టపడతారు: అడివి శేష్
'మహావీరుడు’ సినిమా ట్రైలర్, విజువల్స్ గొప్పగా ఉన్నాయి. ఈ మూవీలో గ్రేట్ వైబ్ కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. శివ కార్తికేయన్ హీరోగా ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మహావీరన్’. అదితీ శంకర్ హీరోయిన్. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ ఈ నెల 14న తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరో అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడివి శేష్ మాట్లాడుతూ–'నా గురువు శేఖర్ కమ్ముల ముందు మాట్లాడటం గౌరవంగా ఉంది. శివ కార్తికేయన్‌తో పని చేయాలని ఉంది' అన్నారు. 'రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్’ సినిమాల్లా ‘మహావీరుడు’ ని తెలుగువారు ఇష్టపడతారు' అన్నారు శివ కార్తికేయన్. ‘‘మహావీరుడు’ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మడోన్ అశ్విన్. ‘‘మా అమ్మగారి పేరుతో ఈ సంస్థ మొదలుపెట్టి, శివ కార్తికేయన్‌తో తొలి మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు అరుణ్ విశ్వ. -
అడివి శేష్‌కు ఛాలెంజ్ విసిరిన హైదరాబాద్ సీపీ
జూన్ 23న ఒలింపిక్‌డే సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పలువురి సెలబ్రిటీలకు ఇలా ఛాలెంజ్ విసిరారు. 'మన జీవితాలు ఎప్పుడూ ఆందోళనకరమైనవిగానే కొనసాగుతాయి. మునుపెన్నడూ లేనంత వేగంగా కదులుతున్న ఈ ప్రపంచంలో, ప్రజలు మాత్రం శారిరక వ్యాయామం లేకుండా ఉండటం చూస్తుంటే కలవరపెడుతుంది. అంతేకాకుండా చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పిల్లలు, యువకులు తమ సెల్ ఫోన్లతో పాటు ఇతర డిజిటల్ గాడ్జెట్లకు అంకితమవుతున్నారు. అవి వారిని కట్టిపడేశాయి. దాంతో వారు అస్సలు కదలరు.' అని తెలిపారు. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) ఈ ఒలింపిక్‌డే నుంచి అయినా వారిని మేలుకొల్పాలని తను వ్యాయామం చేసిన వీడియోను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్,పీవీ సింధు, యాక్టర్ అడివి శేష్, నిఖల్‌కు ట్యాగ్ చేసి, ఇలాంటి వర్కౌట్స్ చేయాలని వారికి ఛాలెంజ్ విసిరారు. తాజాగా సినీ నటుడు అడివి శేష్ చేసిన వ్యాయామం వీడియోను సీపీ ఆనంద్‌కు షేర్ చేశాడు. త్వరలో మరింత ఫిట్నెస్తో తమను రీచ్ అవుతానని ఆయన అన్నాడు. (ఇదీ చదవండి: రానా నాయుడులో దుమ్ములేపిన భామ గురించి ఈ విషయాలు తెలుసా?) అందుకు తిరిగి సీపీ ఆనంద్ ఇలా అన్నారు. 'ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు ధన్యవాదాలు అడివి శేష్ ! మీ నిమాల్లో స్మార్ట్ లుక్‌తో ఉంటారు. నేను పోటీ పడలేను, అంతే కాదు కష్టం కూడా' అని సీపీ ఆనంద్ అన్నారు. Hi @VVSLaxman281 @pvsindhu1 @AdiviSesh @actor_Nikhil Pl do share your workout videos as it’ll inspire everyone to do some physical activity. https://t.co/4GhSD3mvaT— CV Anand IPS (@CVAnandIPS) June 24, 2023 Taking up your offer @CVAnandIPS sir🫡 Heres one of my home workout videos 🙏🏼I believe in natural training and a healthy lifestyle, just like you. Hopefully, I can match your fitness soon! ❤️ https://t.co/Jcui8Vv5Ig pic.twitter.com/7wLZ4vSIc2— Adivi Sesh (@AdiviSesh) June 24, 2023 -
సీక్వెల్.. మార్పుల్...
కథ పెద్దదైతే సినిమా రెండు భాగాలవుతుంది.. ఒక్కోసారి మూడు కూడా అవుతుంది. ఇప్పుడలాంటి కథలతో రూపొం దుతున్న సీక్వెల్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకటో భాగంలో నటించిన నటీనటులు, తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో కంటిన్యూ కావడంలేదు. ఒకటీ హీరో మారుతున్నారు.. లేదా డైరెక్టర్ మారుతున్నారు... లేదా హీరోయిన్ మారుతున్నారు... ఇక మార్పుల్తో రూపొందుతున్న సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. హిట్: ది థర్డ్ కేస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హిట్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. కాగా తొలి రెండు భాగాలు నిర్మించిన నాని థర్డ్పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించనుండటం విశేషం. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ చిత్రంలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌ను (హిట్) లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ రుద్రరాజుపాత్రలో నటుడిగా విశ్వక్ సేన్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. కాగా హిట్ ఫ్రాంచైజీలో రెండో భాగం ‘హిట్: ది సెకండ్ కేస్’లో హీరోగా అడివి శేష్‌ని తీసుకున్నారు శైలేష్. ఎస్పీ కృష్ణదేవ్పాత్రలో అడివి శేష్ తనదైన శైలిలో నటించి, మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్. ఇక మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరో నాని నటించనున్నట్లు ‘హిట్: ది సెకండ్ కేస్’ చివర్లో రివీల్ చేశారు. పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నాని నటిస్తారు. కాగా హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలుంటాయని శైలేష్ కొలను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చంద్రముఖి–2 ‘చంద్రముఖి’ (2005)లో ‘లక లక లక..’ అంటూ హీరో రజనీకాంత్ రాజు గెటప్‌లో విలనిజమ్ పండించి, డాక్టర్ ఈశ్వర్‌గా మంచితనం కనబరిస్తే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు చేశారు. ‘చంద్రముఖి’ విడుదలైన 18 ఏళ్లకు సీక్వెల్‌కి శ్రీకారం చుట్టారు పి. వాసు. ‘చంద్రముఖి 2’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ ప్లేస్‌లోకి లారెన్స్ వచ్చారు. అలాగే కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక తదితరులు నటించారు. ఇటీవల మైసూర్లో జరిగిన షెడ్యూల్‌తో ఈ మూవీ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త. యుగానికి ఒక్కడు–2 వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో యుగానికి ఒక్కడు –2010) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. కార్తీ హీరోగా, ఆండ్రియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ (యుగానికి ఒక్కడు 2) తెరకెక్కించనున్నారు సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో తన సోదరుడు, హీరో ధనుష్‌ని లీడ్ రోల్‌కి తీసుకున్నారాయన. కార్తీ స్థానంలో ధనుష్ కనిపిస్తారని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు.. కార్తీ కూడా ఉంటారు.. సీక్వెల్లో ధనుష్పాత్ర యాడ్ అయిందని మరికొందరు అంటున్నారు. మరి ‘యుగానికి ఒక్కడు 2’లో కార్తీపాత్ర ఉంటుందా? లేదా? అనేది చూడాలి. జెంటిల్మన్–2 అర్జున్, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్‌మేన్’ (1993) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు ముప్పైఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ‘జెంటిల్మన్ 2’ని నిర్మిస్తున్నారు కుంజుమోన్. అయితే రెండో భాగంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ముగ్గురూ మారడం విశేషం. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో ‘మంత్ర–2, రాజుగారి గది, పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్ చీను హీరోగా నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దనున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ కానుంది. టిల్లు స్క్వేర్ ‘డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు..’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పెప్పులేస్తే ప్రేక్షకులు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే సీక్వెల్‌కి అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ ఇద్దరూ మారడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించి గ్లామర్‌తో మెప్పించారు. అయితే సీక్వెల్లో మాత్రం అనుపమా పరమేశ్వరన్‌ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. జిగర్తండా–2 సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కీలకపాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగర్తండా’ (2014) తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా ‘జిగర్తండా’ విడుదలైన దాదాపు తొమ్మిదేళ్లకు ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ పేరుతో కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ తీశారు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్‌లో నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం యంగ్ హీరోకు సంబంధించి సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అడివి శేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అయితే ఇంతకీ అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు. సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (ఇది చదవండి: మంచి జోడీ కోసం వెతుకుతున్నా: సమంత) కాగా.. అడివి శేష్, సుప్రియ గతంలో కూడా రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరీ ఈ రూమర్స్‌పై అడివి శేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ) కాగా.. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటున్న సుప్రియ హీరోయిన్‌గానూ నటించింది. అడివి శేష్, సుప్రియ గూఢచారి చిత్రంలో నటించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్గా నటించింది. -
బిచ్చగాడు-2 కోసం ప్రాణం పెట్టారు : అడివి శేష్
‘‘సినిమా కోసం ప్రాణం పెట్టి చేశామని అందరూ చెబుతుంటారు. కానీ, ‘బిచ్చగాడు 2’ కోసం విజయ్, ఫాతిమాగార్లు నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు. వారికోసమైనా ‘బిచ్చగాడు 2’ హిట్టవ్వాలి’’ అన్నారు హీరో అడివి శేష్. విజయ్ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించడంతో పాటు సంగీతమందింన త్రం ‘బిచ్చగాడు 2’. కావ్యా థాపర్ హీరోయిన్. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మింన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. కాగా తెలుగులో ఈ చిత్రాన్ని ఉషా పిక్చర్స్‌పై విజయ్ కుమార్, వీరనాయుడు రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు అడివి శేష్, ఆకాశ్ పూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ– ‘‘విజయ్ ఆంటోనిగారిని ఇంతవరకు ప్రేమిస్తూ వచ్చాను.. కానీ ఆయన్ను కలిశాక గౌరవం మొదలైంది. ‘బిచ్చగాడు 2’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ తొలి భాగం నచ్చినవారికి రెండో భాగం కూడా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ సినిమాకు కేవలం నిర్మాతను మాత్రమే. అన్నీ మా ఆయన (విజయ్ ఆంటోని) చూసుకున్నారు. ఆయన ప్రమాదానికి గురైనా.. అభిమానుల ప్రేమ వల్లే కోలుకున్నారు’’ అన్నారు ఫాతిమా విజయ్ ఆంటోని. -
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
గుడ్ స్కూల్ యాప్‌ను ప్రారంభించిన అడివి శేషు
సైన్స్ అంటే ఎంత ఇష్టమో... గణితం అంటే అంతా భయమని సినీ నటుడు ఆడివి శేషు అన్నారు. చదవడం ఎంత ముఖ్యమో... చదివి దాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. పరీక్షల సయమంలో ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకుని గుర్తు పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్లో గుడ్ స్కూల్ యాప్‌ను అడివి శేషు ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లంలో యాప్‌ను రూపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆడివి శేషు అన్నారు. ప్రస్తుతం గుఢచారి-2 చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని... తర్వాత హాలీవుడ్ తరహా చిత్రంలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు నాణ్యత గల దృశ్యమాన కంటెంట్‌ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త-ఏజ్డ్-టెక్కో సిస్టమ్, గుడ్ స్కూల్ యాప్ అని ఛైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. శిక్షణతో పాటు, ఇది విశిష్టమైన విద్యా అనుభవాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సహకారం, సృజనాత్మకత, ఆట నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్ భాస్కర్, విద్యారంగ ప్రముఖులు పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వెనక్కి తగ్గిన స్టార్స్.. దూసుకెళ్తున్న యంగ్ హీరోలు
స్టార్ హీరోలే పాన్ ఇండియా సినిమాలు చేయటానికి వెనకడుగు వేస్తుంటే.. కుర్ర హీరోలు మాత్రం టాలీవుడ్ హద్దులు దాటుతున్నారు. పాన్ ఇండియా హీరోలం అనిపించుకోటానికి తహ తహ లాడిపోతున్నారు. ప్రయత్నిస్తే పోయేది ఏముంది చెప్పు..మహా అయితే మరో సారి ట్రై చేస్తాం అనుకుంటు..పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి తెలుగుతో పాటు..ఇతర భాషల్లో విజయం సాధించాలి అనుకుంటున్న ఈ హీరోలపై ఓ లుక్కేయండి మేజర్ మూవీతో పాన్ ఇండియా సినిమా చేసాడు అడివి శేష్. ఇక కార్తికేయా 2 తో నిఖిల్ కూడా పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. ఇప్పుడు మరికొందరు యువ హీరోలు కూడా ..పాన్ ఇండియా సినిమాలతో లక్ పరిక్షించుకోబోతున్నారు. సందీప్ కిషన్ మైఖేల్ సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీ తెలుగు,తమిళ్,హిందీ,కన్నడ,మలయాళ భాషలలో రిలీజ్ కాబోతుంది. నాని శ్యామ్ సింగరాయ్ సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఈ సారి ‘దసరా’తో మాత్రం పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా డెవిల్ సినిమా రాబోతుంది. విశ్వక్ సేన్ రెండో సారి మెగాఫోన్ పట్టుకొని దాస్ క ధమ్కీ మూవీ రూపొందించాడు. ఈ సారి తనను తాను దర్శకుడిగా,హీరోగా పాన్ ఇండియా రేంజ్లో ప్రమోట్ చేసుకుంటున్నాడు. కుర్ర హీరో తేజా సజ్జా,దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న హనుమాన్ కూడా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఇక్కడ సత్తా చాటుతున్నా.. పాన్ ఇండియాపై మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు..ఇప్పటి వరకు పాన్ ఇండియా హిట్ కోసం ట్రై చేయలేదు. త్రివిక్రమ్ కాంబో సినిమా కూడా..తెలుగులో మాత్రమే రిలీజ్ కాబోతుందట. అలాగే పలువురు సీనియర్ హీరోల సినిమాలు కూడా స్వచ్చంగా తెలుగులోనే విడుదల అవుతున్నాయి. అయితే యువ హీరోలు మాత్రం పాన్ ఇండియా రిలీజులపై జోరు చూపిస్తున్నారు. -
Pudami Sakshiga: వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ
Pudami Sakshiga 2023: రెడ్యూస్.. రీయూస్.. రీసైకిల్! వాడకం తగ్గించుకోవడం... వాడేసినవే మళ్లీ వాడటం... పడేసిన వాటితో కొత్తవి తయారు చేసుకుని వాడుకోవడం..! ఏమిటీ కర్మ! అవును కర్మే. మనిషి వల్ల పుడమికి పట్టిన కర్మ! అవసరం ఉన్నవీ లేనివి కొని, అవసరం తీరీ తీరకుండానే పడేస్తున్నాం. కొత్తవి కొంటున్నాం. కుండెడన్నం కోసం బండెడన్నం వండేస్తున్నాం. ఫ్రిజ్‌ని రైతుబజార్‌ని చేస్తున్నాం. వార్డ్రోబ్ పొట్ట పగిలేలా బట్టల్ని కుక్కేస్తున్నాం. భారీ ఫర్నీచర్‌తో ఇంటినంతా నింపేస్తున్నాం. బకెట్ల కొద్దీ నీళ్ల ట్యాంకుల్ని ఖాళీ చేస్తున్నాం! ఇ.ఎం.ఐ.ల కొద్దీ మన దగ్గర డబ్బుంటే ఉండొచ్చు. పుడమి దగ్గర ఇప్పుడు.. దాదాపుగా నో స్టాక్! పంచభూతాల షార్టేజ్!! తక్షణం మన వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ! ఈ కఠోర వాస్తవంపై ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్తో గత మూడేళ్లుగా సమాజానికి అవగాహన కల్పిస్తూ వస్తున్న.. ‘సాక్షి మీడియా గ్రూప్’ ఈ ఏడాది ‘రెడ్యూస్..రీయూజ్.. రీసైకిల్..’ అనే థీమ్‌తో ఈవెంట్‌ని నిర్వహించింది. వాడకం తగ్గించి, వృథాను నివారించి, వ్యర్థాలను తగ్గిస్తేనే పుడమి తిరిగి జవసత్వాలు పుంజుకుంటుందని ఈ టాకథాన్ ద్వారా పర్యావరణ వేత్తలు, రాజకీయ నేతలు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు, కళాకారులు, సినీ హీరోల చేత చెప్పించింది. హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది. ∙∙ మూడో ఎడిషన్‌లో ధరిత్రిని కాపాడుకోవాలి, భూమిని కాలుష్య కాసారం కానీయకుండా భవిష్యత్తరాలకు అందించాలి అనే లక్ష్యంతో సాక్షి మీడియా గ్రూపు చేపట్టిన ప్రచారోద్యమమే ‘పుడమి సాక్షిగా..’ ఇప్పటివరకు రెండు ఎడిషన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మొదటి ఎడిషన్‌లో... ప్రమాదం అంచుకు ఎలా చేరాం? పుడమికి మనం ఏం తిరిగి ఇవ్వాలి? పర్యావరణానికి ఏం అవసరం? అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెండో ఎడిషన్‌లో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సకల ప్రాణులకూ ఆవాసంగా నేల, తక్కువ కాలుష్యంతో విద్యుత్ ఉత్పాదన అనే అంశాలను ప్రధానంగా చర్చించింది. ఈ మూడో ఎడిషన్‌లో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ అనే థీమ్‌ను ఎంపిక చేసుకుంది. ప్రముఖుల సూచనలను, సలహాలను స్వీకరించింది. సాక్షి ‘ఫన్ డే’ ద్వారా వాటిని పాఠకులకు అందించింది. సాక్షి టీవీ ద్వారా గురువారం వీక్షకులకు అందిస్తోంది. నాకు నచ్చిన ప్రోగ్రాం సామాజిక బాధ్యతను కర్తవ్యంగా తీసుకుని సాక్షి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది, అందులో నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్.. పుడమి సాక్షిగా. భగవంతుడు మనకిచ్చిన వరం పర్యావరణం. ఈ వరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళి అందరిదీ. నేటి తరాలు బాధ్యతగా జీవిస్తేనే భావితరాలకూ ఈ వరం అందుతుంది. – రోజా, పర్యాటక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది సాక్షి తీసుకున్న ‘పుడమి సాక్షిగా..’ అనే ఈ గొప్ప ఇనీషియేటివ్‌లో అందరం భాగస్వాములం కావాలి. పుడమి అంటే తల్లి. తల్లిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మనిషిదీ. ఏపీ ప్రభుత్వం ఇటీవలే ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ అనే అమెరికన్ ఎన్జీవోతో ఎం.ఓ.యు. కుదుర్చుకుని విశాఖ బీచ్‌లో పోగయ్యే ప్లాస్టిక్‌ని రీయూజ్ చేయిస్తూ గొప్ప సంస్కరణకు నాంది పలికింది. పుడమి సంరక్షణకు ప్రజల్ని చైతన్యం చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీ రైతు.. భూమి.. పుడమి సాక్షి మీడియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తుచేస్తోంది. వ్యవసాయం విషయానికి వస్తే.. ప్రకృతి సాగు విధానాల వల్ల పుడమి కి ఎంతో మేలు జరుగుతోంది. ఏపీలో రైతు భరోసా కేంద్రాలు, రైతు సాధికార సంస్థల ఏర్పాటుతో రైతుకు, భూమికి, పుడమికి ప్రయోజనకరమైన ఫలితాలను సాధిస్తున్నాం. – కాకాని గోవర్ధన్, వ్యవసాయశాఖ మంత్రి, ఏపీ గ్రీన్ వెజిటేషన్కు ప్రాధాన్యం సాక్షి చేపట్టిన ‘పుడమి సాక్షిగా..’ ఒక మంచి ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా నేడు కలవరం కలిగిస్తున్న ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం. అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రత్యేకమైన పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. కోటీ యాభై ఎకరాల వ్యవసాయ భూమి సాగు అయ్యేలా నీటి అందించి, గ్రీన్ వెజిటేషన్ని సాధిస్తోంది. – నిరంజన్ రెడ్డి, సహకార శాఖ మంత్రి, తెలంగాణ పాఠశాల స్థాయి నుంచే కలెక్టివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యం అయ్యేది కాదు. అందరూ బాధ్యత తీసుకుని సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. పాఠశాల నుంచే పిల్లల్లో పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇన్సెంటివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది. ఉదా.. క్లాస్ రూమ్‌ని శుభ్రంగా ఉంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి. ఇప్పుడు మనం ప్రకృతి పట్ల శ్రద్ధ వహిస్తేనే భవిష్యత్ తరాలు పచ్చగా ఉంటాయి. – అడివి శేష్, సినీ హీరో ఎకో–ఫ్రెండ్లీ స్కూల్ క్యాంపస్ ‘పుడమిసాక్షిగా..’ టాకథాన్కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. వాతావరణ మార్పులు భూతాపానికి కారణం అవుతున్నాయనే అంశంపై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున ఈజిప్ట్‌లో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరై అధ్యయన పత్రం సమర్పించాను. మా స్కూల్ క్యాంపస్ లో కూడా ఎన్విరాన్మెంట్ పిట్స్, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గించుకున్నాం. – అంకిత్ సుహాస్, కాప్–27 డెలిగేట్ వస్తు వినియమం బాగా తగ్గాలి గత దశాబ్దంగా మన దగ్గర ఉన్న గణాంకాలని బట్టి చూస్తే అర్బన్‌కి, రూరల్‌కు మధ్య వస్తు వినియోగ సంస్కృతిలో ఏ విధమైన తేడా కనిపించని పరిస్థితి. గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు రెండిటినీ స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ హ్యాండిల్ చేస్తోంది. వీటిని కంపేర్ చేసినప్పుడు.. కొనే రాశిలో తేడా ఉందేమో కానీ, ఇంటింటి నుంచీ వచ్చే రోజువారీ వ్యర్థాలు దాదాపు ఒకే మొత్తంలో ఉంటున్నాయి. వ్యర్థాలు ఎక్కువైతే పుడమికి ముప్పు కనుక రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ మన తక్షణ అవసరం. – సంపత్ కుమార్, ఐ.ఎ.ఎస్. స్వచ్ఛాంధ్ర ఎండీ పిల్లలకు క్లీన్లీనెస్ నేర్పాలి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. ఇదే తెలుసు మనోళ్లకి. కానీ, రాబోయే తరానికి మనం ఏం ఇస్తున్నాం అనేది ఒక్కసారి మన మనస్సాక్షిని అడగాలి. పుడమిసాక్షిగా.. నేను ప్రతి మనిషికీ చెప్పేది ఒకటే.. మనం ఇవ్వాల్సింది మన పిల్లలకి విద్య. నేర్పాల్సింది క్లీన్లీనెస్. పర్యావరణాన్ని మనం శుభ్రంగా ఉంచితే మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. మన దేశం శుభ్రంగా ఉంటుంది. మనం అందరికీ ఇన్సిపిరేషన్ అవుతాం. – అలీ, మీడియా అడ్వైజర్, ఏపీ మెటీరియలిజం వల్లే ఇదంతా..! మన జీవన విధానం ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. పుడమికి హితంగా మన అలవాట్లు మార్చుకోవాలి. ఆర్టీసీలో మేము రీయూజ్ అనే కాన్సెప్ట్‌ని అవలంబిస్తున్నాం. మెటీరియలిజంకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం కోసం సాక్షి మీడియా గత మూడేళ్లుగా ‘పుడమి సాక్షిగా..’ అనే ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తూ, టాకథా¯Œ ని నిర్వహించడం అభినందనీయం. – వి.సి.సజ్జనార్, ఐపీఎస్, టి.ఎస్.ఆర్టీసీ ఎండీ త్రిబుల్ ‘ఆర్’ ప్రస్తుతావసరం ఇటువంటి ముఖ్య అంశంపై డిబేట్ ఏర్పాటు చేసిన సాక్షికి ధన్యవాదాలు. 25 ఏళ్ల క్రితం గూంజ్ సంస్థ ప్రారంభమైంది. తిండి, బట్ట, నివాసం అనే కనీస అవసరాలలో మేము దుస్తులపై దృష్టి పెట్టాం. దుస్తులను విరాళంగా సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు అందిస్తున్నాం. ఆ విధంగా సంపన్నుల దగ్గరి వేస్టేజ్‌ని రీయూజ్‌కు అందిస్తున్నాం. సంపన్నులను పరోక్షంగా రెడ్యూస్కు ప్రేరేపిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఆర్ ఆర్‌తోనే పుడమిని సంరక్షించుకోగలం. – మీనాక్షీ గుప్తా, ‘గూంజ్’ సంస్థ చదవండి: ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
కలర్ఫుల్గా అవార్డుల ఫంక్షన్.. తళుక్కున మెరిసిన తారలు (ఫోటోలు)
-
చెల్లి హల్దీ ఫంక్షన్లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. ఫోటోలు వైరల్
-
చెల్లి హల్దీ ఫంక్షన్లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల హిట్-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి -2’లో అడివి శేష్ కనిపించనున్నారు. (ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా చెల్లి హల్దీ వేడుకలో సందడి చేశారు యంగ్ హీరో. తన చెల్లెలు షిర్లీ అడివి హల్దీ వేడుకలో పాల్గొన్న అడివి శేష్ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. తన బేబీ చెల్లి హల్దీ ఫంక్షన్ ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌గా మారాయి. అడివి శేష్ తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ..'అమ్మ, నేను, సోదరి హల్దీ ఫంక్షన్లో సరదాగా కలిసి సందడి చేశాం. ఈ రోజు బావ డేవిన్‌ను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో అడివి శేష్‌ను చూసిన అభిమానులు అన్నా.. నీ పెళ్లేప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హీరో చెల్లెలికి శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
గురిపెట్టిన అడివి శేష్.. గూఢచారి-2 ప్రీ వెర్షన్ లుక్ వీడియో వచ్చేసింది
ఓ మిషన్ మీద ఒక గూఢచారి ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు వెళతాడు. ఆ మిషన్ ఏంటి? ఎలా విజయం సాధించాడు? అనేవి తెలియడానికి ఇంకా సమయం ఉంది. గూఢచారి పాత్రలో అడివి శేష్ హీరోగా రపొందనున్న చిత్రం ‘గఢచారి 2’. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ప్రీ విజన్ వీడియోను రిలీజ్ చేశారు. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ రూపొందనుంది. కాగా తొలి భాగం భారతదేశంలో జరిగితే రెండో భాగం కథ ఇండియా నుంచి ఆల్ఫ్స్ పర్వతాలకు ప్రయాణిస్తుంది. అడివి శేష్ కథ అందించిన ఈ చిత్రం ద్వారా ఎడిటర్ వినయ్ కువర్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. -
అప్పుడు కొట్టుకునేవాళ్లం.. ఇప్పుడేకంగా.. : అడివిశేష్ ఎమోషనల్
'మేజర్', 'హిట్ 2' సినిమాలతో గతేడాది రెండు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. తను ఎంచుకున్న సినిమాలకు, యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా మేజర్ సినిమాకు గానూ సంతోషం సినీ అవార్డు అందుకున్నాడీ హీరో. అయితే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో సంతోషంతో గాల్లో తేలుతున్నాడు శేష్. 'నా చిన్నతనంలో మీ సినిమా టికెట్ల కోసం కొట్టుకునేవాళ్లం. అలాంటిది మేజర్ సినిమా కోసం ఒకరోజు మధ్యాహ్నం అంతా మీతో గడపడం గౌరవంగా భావిస్తున్నా. ఏకంగా మీ చేతుల మీదుగా మేజర్ చిత్రానికి గానూ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు శేష్. దీనికి చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు నీ కష్టానికి గుర్తింపు లభించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) చదవండి: సీమంతం వేడుకలో లాస్య డ్యాన్స్ మాట్లాడినా, ఏడ్చినా అది తప్పదు: సమంత -
ఓటీటీలోకి వచ్చేసిన అడివి శేష్ హిట్-2.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'హిట్-2'. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్నా రూ. 129 చెల్లించాల్సి ఉంది. కానీ జనవరి 6 తర్వాత నుంచి మాత్రం ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత హిట్-2 స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, ఇందులో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సుహాస్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించారు. in the mood for some thrilling investigation!#HIT2onPrime, Jan 6@AdiviSesh @NameisNani @Kolanusailesh @Meenakshiioffl @tprashantii @walpostercinema pic.twitter.com/KRm2Va0gHk — prime video IN (@PrimeVideoIN) January 5, 2023 -
'గూఢచారి' మళ్లీ వస్తున్నాడు.. సీక్వెల్ అనౌన్స్ చేసిన అడివి శేష్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది 'మేజర్', 'హిట్'-2లతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న శేష్ తాజాగా తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు. శేష్ కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన గూఢచారి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌తో రాబోతున్నట్లు ప్రకటించాడు. వినయ్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి శేష్ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు. జీ2 టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జనవరి 9న ముంబై అండ్ ఢిల్లీలో మూవీ గ్రాండ్ లాంఛ్ ఉండనున్నట్లు శేష్ తెలిపాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనుంది. #G2 it is! Just a little taste for the New Year ❤️ An Epic Action Film visualized by our Brilliant Director @vinaykumar7121 You will know what I mean when you see our “Pre Vision” Video. We will Launch MASSIVE on Jan 9 in Mumbai & Delhi. #HappyNewYear guys 🔥#Goodachari2 pic.twitter.com/WkZ46elqJ2 — Adivi Sesh (@AdiviSesh) December 29, 2022 -
అక్కినేని ఫ్యామిలీలో అడివి శేష్.. వైరల్‌గా మారిన ఫోటో
క్రిస్మస్ పండగను సెలబ్రిటీలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఒకచోట చేరి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఆ ఫోటోలని అఖిల్ అక్కినేని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో కూడా క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహించారు. అఖిల్, సుమంత్‌లతో పాటు మరికొంత మంది కజిన్స్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. కానీ నాగచైతన్య మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. ఇక తమ సెలబ్రేషన్స్ ఫోటోలను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కాసేపట్లోనే ఆ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. హీరో అడివి శేష్ అక్కడ కనిపించడం హాట్‌టిపిక్‌గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీలో శేష్ ఎందుకు ఉన్నాడంటూ పలు రూమర్స్ తెరమీదకి వస్తున్నాయి. ఇక పార్టీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు 'థ్యాంక్స్ అఖిల్ బ్రో' అంటూ శేష్ కామెంట్ చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
ఆ సమయంలో కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేశా: అడివి శేష్
ఈ ఏడాది టాలీవుడ్ చిత్రాల్లో భారీ హిట్ చిత్రాల్లో యంగ్ హీరో అడివి శేష్ మూవీ 'మేజర్' ఒకటి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అడివి శేష్ మేజర్ సినిమాలోని క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం 'మేజర్' సెట్ తొలగించాలని చెప్పగానే చాలా బాధపడ్డానని చెప్పారు. అడివి శేష్ మాట్లాడుతూ.. 'మా సినిమా షూటింగ్ జరుగుతున్న స్టూడియోను ఓ బాలీవుడ్ చిత్రయూనిట్ బుక్ చేసుకుంది. మేజర్ సినిమాలో అగ్నిప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించడంతో నేను అస్వస్థతకు గురయ్యా. అందువల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైంది. స్టూడియో వాళ్లు మా సెట్‌ను కూల్చేయడానికి రెడీ అయ్యారు. వాళ్లని కాస్త టైం ఇవ్వాలని అడిగినా ఒప్పుకోలేదు. క్లైమాక్స్‌లో దాదాపు ఎనిమిది సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. కేవలం 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఏడ్చేశా.' అని అన్నారు. ఆ సమయంలో దర్శకుడు శశికిరణ్ నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు ఏ భావోద్వేగానికి లోనవుతున్నారో అదే కెమెరా ముందు చూపించమని సూచించారని తెలిపారు. రెండు కెమెరాలతో సన్నివేశాలను అనుకున్న సమయానికే పూర్తిచేశామని వెల్లడించారు. ఈ ఏడాది అడివి శేష్ నటించిన హిట్-2 సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించింది. -
హిట్ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
హిట్ యూనివర్స్‌లో వచ్చిన హిట్ 2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. కోమలీ ప్రసాద్, ఆదర్శ్, రావు రమేశ్, సుహాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 2న విడుదలైంది. పెట్టిన టైటిల్‌కు పూర్తి న్యాయం చేసి బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్‌గా నిలిచిందీ సినిమా. ఇక క్లైమాక్స్‌లోనే హిట్ 3 ఉంటుందని, అందులో నాని హీరోగా నటించనున్నాడని ప్రకటించిన విషయం తెలిసిందే! తాజాగా హిట్ 2 మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే! సరిగ్గా నెల రోజుల తర్వాత ప్రైమ్ దీన్ని ఓటీటీ ఆడియన్స్‌కు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందట. అదే కనుక జరిగితే హిట్ 2 జనవరి 2 నుంచి అందుబాటులోకి రానుంది. చదవండి: ఒకే ఫ్రేమ్‌లో అల్లు అర్జున్, చరణ్ ఫ్యామిలీ -
బాలీవుడ్ రమ్మంది...
మామూలుగా ఉత్తరాది తారలు దక్షిణాదికి ఎక్కువగా వస్తుంటారు. ఈసారి కూడా నార్త్ నుంచి చాలామంది వచ్చారు. అలాగే సౌత్ నుంచి కూడా నార్త్‌కి వెళ్లారు. మన స్టార్స్‌ని బాలీవుడ్ రమ్మంది. ఈ ఏడాది హిందీ తెరపై కనిపించిన కొందరు సౌత్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. కెరీర్లో ఇరవైకి పైగా సినిమాలు చేసిన నాగచైతన్య నటించిన తొలి హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నాగచైతన్యది కీ రోల్. ఈ హిందీ చిత్రంలో గుంటూరుకు చెందిన తెలుగు కుర్రాడు బాలరాజు పాత్రను చేశారు నాగచైతన్య. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలైంది. ఇక విజయ్ దేవరకొండ హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలైంది. మరో హీరో అడివి శేష్ ‘మేజర్’తో హిందీ తెరకు పరిచయం అయ్యారు. ‘గూఢచారి’ చిత్రం తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘మేజర్’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన అమరవీరుడు ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూర్టీ గార్డు) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. అలాగే ఏపీ (ఆంజనేయ పుష్పక్ కుమార్)గా హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పారు సత్యదేవ్. అక్టోబరు 25న రిలీజైన ‘రామసేతు’లోనే ఏపీగా సత్యదేవ్ కీ రోల్ చేశారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకుడు. అయితే బాలీవుడ్‌కు కీలక పాత్ర ద్వారా కాకుండా సత్యదేవ్ హీరోగా పరిచయం కావాల్సింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో జెన్నిఫర్ డైరెక్షన్లో ఆరంభమైన ఓ హిందీ చిత్రంలో సత్యదేవ్ హీరోగా కమిట్ అయ్యారు. కొంత షూటింగ్ జరిగాక ఈ సినిమా ఆగిపోయింది. దీంతో ‘రామసేతు’ సత్యదేవ్‌కి తొలి హిందీ చిత్రంగా నమోదైంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... రష్మికామందన్నా బాలీవుడ్ ఎంట్రీ ‘గుడ్ బై’ చిత్రంతో కుదిరింది. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబరు 7న విడుదలైంది. ఆసక్తికర విషయం ఏంటంటే... రష్మిక కెరీర్లో రిలీజైన తొలి హిందీ చిత్రం ‘గుడ్ బై’ అయినప్పటికీ ఆమె సైన్ చేసిన తొలి హిందీ చిత్రం మాత్రం ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక హీరో హీరోయిన్లుగా శాంతను భాగ్చీ తెరకెక్కించిన ‘మిషన్ మజ్ను’ డైరెక్టర్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే ఓ లీడ్ యాక్ట్రస్‌గా హిందీ తెరకు పరిచయమైంది కూడా ఈ ఏడాదే. రణ్వీర్ సింగ్ హీరోగా దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో ఈ ఏడాది మేలో రిలీజైన ‘జాయేష్ భాయ్ జోర్ధార్’లో నటించారు షాలిని. 2023లో... ఇక కొందరు తారల బాలీవుడ్ జర్నీ కూడా ఈ ఏడాది ఆరంభమైంది. కానీ వచ్చే ఏడాదే వారు హిందీ తెరపై కనిపించనున్నారు. కెరీర్లో డెబ్బై చిత్రాలు చేశాక బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు నయనతార. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జవాన్’ హిందీలో నయనతారకు తొలి చిత్రం. ఇటు అట్లీ చేస్తున్న తొలి హిందీ ఫిల్మ్ కూడా ‘జవాన్’ కావడం విశేషం. ఈ సినిమా వచ్చే జూన్ 2న రిలీజ్ కానుంది. ఇక 2005లో వచ్చిన తెలుగు ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరోవైపు హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ ప్రయాణం ఈ ఏడాది నవంబరులో మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు వరుణ్‌తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడు. మరికొందరు స్టార్స్ కూడా వచ్చే ఏడాది హిందీ తెరపై కనిపించనున్నారు. -
ఇదేందయ్యా.. నా నరాలు కట్ అయిపోయాయి.. అడివి శేష్ అభిమాని షాక్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘హిట్ 2’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకులను పలకరించింది.నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ పార్ట్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. (ఇది చదవండి: HIT 2 Review: ‘హిట్ 2’ రివ్యూ) అయితే తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అడివి శేష్ రెమ్యునరేషన్‌పై నెటిజన్ ఆశ్చర్యానికి గురయ్యారు. గూగుల్‌లో అడివి శేష్ రెమ్యునరేషన్ అని సెర్చ్ చేస్తే 450 మిలియన్ డాలర్లు చూపిస్తోందని నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి హీరో అడివి శేష్ సైతం రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి చూద్దాం. నెటిజన్ ట్వీట్ చేస్తూ..' అన్నా ఎందన్నా ఇది? గూగుల్‌లో తప్పుడు సమాచారం వస్తోందని నాకు తెలుసు. అయినా ఉత్సాహంతో అడివి శేష్ రెమ్యునరేషన్ అని సెర్చ్ చేశా. అందులో 450 మిలియన్ డాలర్లు అని వచ్చింది. ఒక్కసారిగా నా నరాలు కట్ అయిపోయాయి అన్నా.' అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన హీరో అడివి శేష్ అభిమానికి రిప్లై ఇచ్చారు. మాకు కూడా ఆ 450 మిలియన్ డాలర్లు ఎక్కడుందో చెప్తే సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా.' అంటూ ట్వీట్ చేశారు. Maaku kooda aa $450M ekkadundho chepthe break ivvadaaniki ready ga unnaam. 🐶 https://t.co/27YvTzR1yx — Adivi Sesh (@AdiviSesh) December 7, 2022 -
అడివి శేష్ సక్సెస్ కు కారణం అదే ..!
-
అర్జున్ సర్కార్ సైనింగ్ ఆఫ్..మళ్లీ కలుద్దాం: నాని
‘‘కష్టపడి ప్రిపేర్ అయ్యే బ్యాచ్‌లో శేష్ ఉంటాడు. నేను కాపీ కొట్టి పాస్ అయ్యే బ్యాచ్‌లో ఉంటాను. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను. శేష్ లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా హిట్స్ సాధిస్తున్నాడు. మంచి చిత్రాలు తీస్తే చూస్తాం అని ప్రేక్షకులు మరోసారి నిరూపించినందుకు థ్యాంక్స్. అర్జున్ సర్కార్ సైనింగ్ ఆఫ్ (హిట్ 3ని ఉద్దేశించి).. మళ్లీ కలుద్దాం.. గట్టిగా కలుద్దాం’’ అని హీరో నాని అన్నారు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న రిలీజైంది. ఈ సందర్భంగా విజయోత్సవంలో అడివి శేష్ మాట్లాడుతూ – ‘‘హిట్ 2’ రిలీజ్ తర్వాత మహేశ్‌బాబుగారు ఫోన్ చేసి, ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను.. అన్నలా అండగా ఉంటాను’ అంటే కంట్లో నీళ్లు తిరిగాయి’’ అన్నారు. ‘‘మల్టీప్లెక్స్‌ల్లోనే కాదు.. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లోనూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు శైలేష్ కొలను. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ, నటి కోమలీ ప్రసాద్ మాట్లాడారు. -
డేట్‌కు ఎప్పుడు వెళదాం? యంగ్ హీరోకు ఫ్యాన్ ప్రపోజల్
యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం హిట్-2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. శైలేస్ కొలను దర్శకత్వంలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజు నుంచే మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం శేష్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.సీక్వెల్‌పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం, పెద్ద సినిమాలు లేకుండా సోలోగా రిలీజ్ కావడంతో హిట్-2 కలెక్షన్ల పరంగానూ సూపర్ హిట్టయ్యింది. ఇక ఈ సక్సెస్‌లో భాగంగా శేష్ అభిమానులతో ట్విట్టర్లో చిట్‌చాట్ సెషన్ నిర్వహించారు. ఆస్క్‌మి ఎనీథింగ్ అంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అయితే ఓ లేడీ ఫ్యాన్ మాత్రం డైరెక్ట్‌గా డేటింగ్ ప్రపోజల్ చేసింది. మనం ఎప్పుడు డేట్‌కు వెళదాం అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేయగా అడివి శేష్ స్పందించాడు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా.. మనం ఇద్దరం కలిసి హిట్ 2 సినిమా చూద్దామా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. డేట్‌కి అడగ్గానే ఏమాత్రం తడబాటులేకుండా శేష్ ఇచ్చిన రిప్లై ఆసక్తిగా మారింది. Idhigo occhestunna. Do you want to watch #HIT2 ? 🙃#AskSesh https://t.co/2LCxbtlIAa — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 -
యంగ్ హీరో అడవి శేష్ చేతుల మీదుగా ‘ఎంతవారుగాని’ టీజర్
సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ‘ఎంతవారు గాని’. ఈ మూవీతో ఎన్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను బయటకు వచ్చింది. యంగ్ అడవి శేష్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. అనంతరం అడవి శేష్ మాట్లాడుతూ.. ఈ టీజర్ తనకు నచ్చిందని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా మంచి విజయం సాధించాలని సాధించాలని ఆకాంక్షిస్తూ మూవీ టీంకు అభినందనలు తెలిపాడు. కాగా ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పింది మూవీ టీం. తమ సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉంటుందని ఈ సందర్భంగా చిత్ర బృందం పేర్కొంది. -
ఫైమా ఎలిమినేట్, ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున
Bigg Boss Telugu 6, Episode 92: బిగ్‌బాస్ ఆరో సీజన్లో మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఫన్ అండ్ గేమ్ రెండూ కలిపి కొట్టే ఫైమా ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. ఈరోజు హౌస్‌లో హిట్ 2 చిత్రయూనిట్ స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసి ఎంటర్టైన్ చేశారు. మరి నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. జీవితాంతం ఎవరు ఫ్రెండ్‌గా ఉంలనుకుంటున్నారు? ఎవరిని జీవితంలో అసలు ఫ్రెండ్‌గా వద్దనుకుంటున్నారో చెప్పాలంటూ చిన్న టాస్క్ ఇచ్చాడు నాగార్జున. దీనికి ఆది.. ఫైమాను ఫ్రెండ్ అని, ఇనయతో అంత ఫ్రెండ్షిప్ ఉండదంటూ ఆమె ఫోటోను డస్ట్‌బిన్‌లో వేశాడు. ఇనయ.. కీర్తిని ఫ్రెండ్‌గా, శ్రీహాన్‌తో ఫ్రెండ్షిప్ డౌటేనంటూ అతడి ఫోటోను చించేసింది. శ్రీహాన్ వంతు రాగా రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆదిరెడ్డి నెల్లూరులో ఉంటాడు కాబట్టి ఎక్కువగా కలిసే ఛాన్స్ ఉండదని అతడి ఫోటోను చించేశాడు. రోహిత్.. రేవంత్ ఫ్రెండ్ అని, ఫైమాతో స్నేహం కట్ అవుతుందేమోనన్నాడు. ఫైమా.. ఆదిరెడ్డి తన జీవితాంతం ఫ్రెండ్ అని రోహిత్‌తో ఎక్కువ కనెక్షన్ లేదని చెప్పింది. కీర్తి.. ఇనయ ఫ్రెండ్ అంటూ శ్రీహాన్‌కు కటీఫ్ చెప్పింది. రేవంత్.. శ్రీసత్యతో దోస్తానా చేస్తానని, కీర్తి తనను తక్కువ అర్థం చేసుకుంటుందంటూ సైడ్ చేశాడు. శ్రీసత్య.. ఎక్కువ గొడవపడేది, ఎక్కువ క్లోజ్ అయింది రేవంత్‌తోనే అంటూ అతడే లైఫ్‌టైమ్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇంట్లో అందరికన్నా రోహిత్‌తో తక్కువ కనెక్షన్ ఉందని తన ఫొటోను చెత్తబుట్టలో పడేసింది. తర్వాత హిట్ 2 హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. ఇక అడివిశేష్‌కు ఓ కేసు అప్పజెప్పాడు నాగ్. బిగ్‌బాస్ హౌస్‌లో అద్దంపై కోడిబుర్ర అని రాసిందెవరో కనిపెట్టమన్నాడు. శేష్ ఎంతో ఈజీగా ఆ బొమ్మ గీసింది రేవంతేనని కనిపెట్టాడు. తర్వాత ఇంటిసభ్యులతో మూవీ డంబ్ షేర్ ఆర్ట్స్ ఆడిస్తూ వారికోసం కొన్ని సినిమా పోస్టర్లను అంకితమిచ్చాడు. అనంతరం ఫైమా ఎలిమినేట్ కావడంతో ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. స్టేజీమీదకు వచ్చిన ఫైమాతో ఎవరితో ఫన్? ఎవరితో ఫ్రస్టేషన్? చెప్పాలన్నాడు నాగ్. దీనికి ఫైమా ఫన్ కేటగిరీలో ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయ, రోహిత్‌లను చేర్చింది. రేవంత్‌ను ఫ్రస్టేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంది. ఇక ఫైమాకు చేతిని ముద్దుపెట్టుకుంటే చక్కిలిగిలి పుడుతుందని తెలియడంతో నాగార్జున ఆమె చేతిని ముద్దాడాడు. ఆమెకు వీడ్కోలు పలికిన అనంతరం నాగ్ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్ విన్నర్ రూ.25 లక్షల విలువైన 605 గజాల ప్లాట్ కూడా సొంతం చేసుకుంటారని చెప్పాడు. చదవండి: సెలూన్ అమ్మేసి పాత ఇల్లు కొన్న జబర్దస్త్ కమెడియన్ తండ్రి మాట వినకపోతే బన్నీలా తయారవుతారు: బండ్ల గణేశ్ -
హీరో అడివి శేష్‌కు ఆదిరెడ్డి కౌంటర్.. పగలబడి నవ్విన నాగ్
బిగ్‌బాస్ స్టేజీపైకి హిట్ 2 హీరో అడివి శేష్ వచ్చాడు. వచ్చీరాగానే అతడికో కేస్ అప్పజెప్పాడు నాగార్జున. అతడు వచ్చేముందే ఇంటిసభ్యుల్లో ఎవరైనా అద్దంపై కోడి బుర్ర అని రాసి దానిపై హారర్ బొమ్మ వేయమని సూచించాడు. తర్వాత అడివి శేష్‌ను పిలిచి ఆ బొమ్మ గీసిన నేరస్తుడిని పట్టుకోమని సవాలు విసిరాడు. ఆ బొమ్మ చూసిన అడివి శేష్ నన్ను కోడిబుర్ర అంటున్నారా? అని అడగడంతో అందరూ ఫక్కుమని నవ్వేశారు. ఇక శేష్ తనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి బొమ్మ గీసిందెవరో కనుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, నువ్వే గీశావా? అని అడగ్గా కనుక్కోవాల్సింది మీరు కదా సర్ అంటూ కౌంటరిచ్చాడు ఉడాల్ మామ. దీంతో నాగార్జున పగలబడి నవ్వాడు. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఫన్ గేమ్స్ ఆడించాడు. మరి అడివి శేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఈ వారం ఆమె ఎలిమినేట్, సీజన్ బెస్ట్ కెప్టెన్ ఎవరంటే? కాబోయే భర్తను పరిచయం చేసిన బాహుబలి సింగర్ -
మహేశ్‌బాబుతో మాట్లాడా.. అలా అనగానే కన్నీళ్లొచ్చాయి
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో హిట్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అడివి శేష్ ట్విటర్లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అమ్మాయి మనం డేట్కెప్పుడు వెళ్దాం అని అడగ్గా ఇదిగో వచ్చేస్తున్నా. కలిసి హిట్ 2 చూసేద్దామా? అని సరదాగా బదులిచ్చాడు. 'హిట్ యూనివర్స్‌లోకి మహేశ్‌బాబులాంటి పెద్ద స్టార్‌ను ఇన్వాల్వ్ చేయండి అన్న.. నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోద్ది. ఎప్పటినుంచో నువ్వు ఎంచుకునే థ్రిల్లింగ్ స్టోరీలలో మహేశ్‌బాబుని చూడాలని కోరిక.. సస్పెన్స్ థ్రిల్లర్ లైన్ రాసి మహేశ్ అన్నతో చేయండి అన్న..' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీనికి శేష్ స్పందిస్తూ.. 'ఈరోజు ఉదయమే ఆయన ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. నా విషయంలో గర్వంగా ఉన్నట్లు చెప్పారు. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సోదరుడిగా తన వెన్నంటే ఉంటానని మాటిచ్చాను. ఆయనకు హిట్ 2 ఎప్పుడెప్పుడు చూపించాలా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను' అని ట్వీట్ చేశాడు. Don’t know. Suit avuthundho ledho Aalochinchaali. But Mahesh sir called me this morning and spoke for a long time about how PROUD he is of me. I got tears in my eyes. And l promised I will always be there as his brother. Can’t wait to show him #HIT2 #AskSesh https://t.co/9KWUUPs0S8 — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 Don’t know but us Telugu Heroes have love from Kashmir to Kanyakumari all the way to Kansas. So what’s the problem? #HIT2 #AskSesh https://t.co/fj77zCaKQE — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 Idhigo occhestunna. Do you want to watch #HIT2 ? 🙃#AskSesh https://t.co/2LCxbtlIAa — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 చదవండి: బాలయ్య వీరసింహారెడ్డి వచ్చేది ఆరోజే! ఆ అమ్మాయి భార్యగా రావాలనుకుంటాడు, చివరికి -
Hit 2: అప్పుడే ఓటీటీలోకి హిట్-2.. భారీ ధరకు స్ట్రీమింగ్ రైట్స్
అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం హిట్-2 శుక్రవారం(నిన్న)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శైలేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. హిట్‌కి సీక్వెల్‌గా వస్తుండటంతో ముందుగానే ఈ సినిమాపై మాంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ట్రైలర్, పాటలు సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. దీనికి తగ్గట్లే తొలిరోజే వసూల్ల పరంగా దూసుకెళ్తుందీ చిత్రం. ఓటీటీలో హిట్ 2 చిత్రానికి భారీగా బిజెనెస్ జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా తీవ్రంగా పోటీ పడగా.. చివరకు ప్రైమ్ వీడియోకే భారీ ధరకు స్ట్రీమింగ్ రైట్స్ దక్కాయట. వచ్చే నెలలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. -
హిట్ యూనివర్స్‌లో సమంత.. వైరల్ అవుతున్న ట్వీట్
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్ 2. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 2న) థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే హిట్ సిరీస్‌ను మొత్తం ఎనిమిది భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హిట్ 2లోనే మూడో పార్ట్ గురించి చెప్పేశారు. మూడో భాగంలో నాని హీరోగా అడివి శేష్ కీలక పాత్రలో నటిస్తాడని వెల్లడించారు. ఇకపోతే హిట్ సిరీస్‌లో సమంతను మెయిన్ లీడ్‌గా తీసుకుంటే ఎలా ఉంటుంది? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దీనికి అడివి శేష్ స్పందిస్తూ.. ఐడియా అదిరిపోయింది, మరి ఏమంటావ్ సామ్ అంటూ సమంతను ట్యాగ్ చేశాడు. దీనికి సామ్ స్పందిస్తూ.. ఓ రౌడీ పోలీస్.. ఆలోచన బాగుంది. ముందుగా సూపర్ హిట్ అందుకున్నందుకు అడివి శేష్‌కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆలోచన బాగుందన్న సామ్ మరి హిట్ యూనివర్స్‌లో భాగమవుతుందా? లేదా? చూడాలి! A badass cop … sounds like fun 😈 Congratulations on your super HIT🫶🏻 @AdiviSesh .. always cheering for you 🤗 https://t.co/qugCUzPGrb — Samantha (@Samanthaprabhu2) December 2, 2022 చదవండి: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాలు? టికెట్ టు ఫినాలే విజేత అతడే -
HIT 2 Review: ‘హిట్ 2’ రివ్యూ
టైటిల్: హిట్ 2: ద సెకండ్ కేసు నటీనటులు: అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి తదితరులు నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపిర్నేని దర్శకత్వం: శైలేష్ కొలను నేపథ్య సంగీతం: జాన్ స్టీవార్ట్ ఏడూరి స్వరాలు : ఎం.ఎం. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్ ఎడిటర్: . గ్యారీ బి.హెచ్ విడుదల తేది: డిసెంబర్ 2, 2022 నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఆ ఫ్రాంచైజీలో వరుస సినిమాలు తీయాలని నాని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు హిట్ సెకండ్ కేస్ పార్ట్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘హిట్ 2’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. హిట్-2 కథేంటంటే.. కేడీ అలియాస్ కృష్ణదేవ్ వైజాగ్ ఎస్పీ. మర్డర్ కేసులను ఈజీగా సాల్వ్ చేస్తుంటాడు. ఆర్య(మీనాక్షి చౌదరి) అతని ప్రియురాలు. వీరిద్దరు సహజీవనం కొనసాగిస్తుంటారు. ఓ రోజు నగరంలో సంజన అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. తల, మొండెం, కాళ్లు, చేతులు వేరు వేరుగా చేసి అతి కిరాతంగా చంపేస్తాడు ఓ సీరియల్ కిల్లర్. అయితే అక్కడ ఉన్న వాటిలో తల మాత్రమే సంజనాది అని, మిగతా భాగాలన్ని మరో ముగ్గురు అమ్మాయిలవి అని ఫోరెన్సిక్ టెస్ట్‌లో తెలుస్తుంది. ఈ కేసును కేడీ ఎలా చేధించాడు? ఆయనకు ఎదురైన సమస్యలేంటి? సీరియల్ కిల్లర్ ఆర్యని కూడా చంపేందుకు ఎందుకు ప్రయత్నించాడు? వరుసగా యువతులనే చంపడానికి కారణమేంటి? విచారణ క్రమంలో రామ్‌దాస్ (హర్షవర్థన్) గురించి తెలుసుకున్నది ఏంటి? చివరకు ఆ సిరియల్ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం కత్తిమీద సాము లాంటింది. ఒక్కసారి ట్విస్ట్ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్ చెప్పకుండా ఉంటే ఎంగేజ్ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉండాలి. అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. హిట్ విషయంలో దర్శకుడు కైలాష్ అదే పని చేశాడు. హత్య చేసింది ఎవరనేది చివరివరకు చెప్పకుండా సస్పెన్స్ కొనసాగించాడు. కానీ హిట్ 2లో హత్య చేసింది సీరియల్ కిల్లర్ అనే ముందే చెప్పారు. అతను ఎవరు? ఎందుకు అమ్మాయిలనే చంపుతున్నారనేది సస్పెన్స్‌గా పెట్టారు. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా కొనసాగుతుంది. కేడీ, ఆర్యల రొమాన్స్.. మధ్యలో కేసు విచారణ.. ఈక్రమంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్ నుంచి కథ పరుగులు తీస్తుంది. సీరియల్ కిల్లర్ గురించి ఆరా తీయడం.. ఈ క్రమంలో అతని ఫ్లాష్‌బ్యాక్ తెలియడం.. చివరకు మంచి వాడు అనుకున్న వ్యక్తే కిల్లర్ అని తెలియడం..ఇలా సెకండాఫ్ సాగుతుంది. ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు వెబ్ సీరీస్లు కూడా ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లోనే తెరకెక్కుతున్నాయి. అందుకే హిట్-2 ప్రేక్షకులను పెద్దగా సస్పెన్స్‌కు గురి చేయదు. కేడీ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడు. ఆయనకు థ్రిల్లర్ జానర్స్ కొట్టిన పిండి కాబట్టి.. ఈజీగా నటించేశాడు. రొమాన్స్ సీన్లలో కూడా బాగా నటించాడు. ఇక ఆర్య పాత్రకి మీనాక్షి చౌదరి న్యాయం చేసింది. మిగితా పాత్రల విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనాథ్ మాగంటి మరో మంచి పాత్రలో ఆకట్టుకొన్నాడు. పాత్ర నిడివి తక్కువైనా కీలక సన్నివేశాల్లో తన ప్రజెన్స్‌ను చూపించుకొన్నాడు. వర్షగా కోమలి ప్రసాద్ సినిమా చివరి వరకు మెప్పిస్తుంది. ప్రత్యేక పాత్రలో కలర్ ఫోటో హీరో సుహాన్ సర్ప్రైజ్ చేశాడు., శ్రీకాంత్ అయ్యంగార్, తణికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. నేపథ్య సంగీతం బాగుంది. కెమెరామెన్, ఎడిటర్ల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
అప్పుడు నేను బోల్తా పడలేదు
‘‘నువ్వు అలాంటి పాత్రలు చేయొద్దు, ఇలాంటి కథలు ఎంచుకోవద్దు.. అంటూ కొందరు చెప్పిన సలహాలు పాటించి బోల్తా పడ్డాను (ఫ్లాప్ సినిమాలను ఉద్దేశిస్తూ). కానీ, నన్ను నేను నమ్ముకుని స్వతహాగా కథలు ఎంచుకుని చేస్తున్నప్పుడు బోల్తా పడలేదు (హిట్ సినిమాలను ఉద్దేశిస్తూ)’’ అని హీరో అడివి శేష్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అడివి శేష్ చెప్పిన విశేషాలు. ► నేను కథ వినేటప్పుడు ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తాను. ఎక్కడైనా బోర్ కొడుతుంటే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ‘హిట్ ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ నటించాడు. ‘హిట్ ది సెకండ్ కేస్’లో నన్ను చేయమని శైలేష్ అడిగినప్పుడు.. ‘నేనే ఎందుకు చేయాలి’ అన్నాను. కృష్ణదాస్ అనే పోలీసాఫీసర్ పాత్రకి మీరు కరెక్టుగా సరిపోతారని చెప్పాడు. ‘ఈ విషయం విశ్వక్ సేన్‌కి తెలుసా?’ అని శైలేష్‌ని అడిగితే.. ‘తెలుసు’ అన్నాడు. అప్పుడు ‘హిట్ 2’ కథ వినేందుకు ఒప్పుకున్నాను. పైగా నానీగారు కూడా ఫోన్ చేసి కథ వినమన్నారు. స్క్రిప్ట్ వినగానే నచ్చింది. నా గత ఐదు చిత్రాల్లో నాలుగింటి స్క్రిప్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యాను. కానీ, ‘హిట్ ది సెకండ్ కేస్’ స్క్రిప్ట్‌లో మాత్రం ఇన్వాల్వ్ కాలేదు. శైలేష్ బాగా రాశాడు. నేను ఒక నటుడిగా మాత్రమే పని చేశాను. ► సమాజంలోని చాలా ముఖ్యమైన అంశాలను, కొందరు కిల్లర్స్‌గా ఎందుకు మారుతున్నారు? అనే విషయాలను ఈ సినిమాలో చర్చించాం. ‘మేజర్’ సినిమా బయోపిక్ కావడం, పైగా ఆర్మీ నేపథ్యంలో ఉండటంతో చాలా ఒత్తిడి ఉండేది. కానీ, ‘హిట్ 2’కి ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రీమియర్ చూసినవారందరూ చాలా బాగుందని చెప్పడం హ్యాపీ. ఈ చిత్రాన్ని హిందీ, కన్నడలో డబ్ చేస్తున్నాం. ఈ నెల 13న హిందీలో విడుదలవుతుంది. ► థ్రిల్లర్ నేపథ్యంలో నేను నటించిన ‘క్షణం’ చిత్రంతో నాకు మంచి పేరు వచ్చింది. అలాగే ‘గూఢచారి’ కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. నా ఫేవరెట్ టాప్ టెన్ చిత్రాల్లో చిరంజీవిగారి ‘ఖైదీ’, కార్తీగారి ‘ఖైదీ’ ఉన్నాయి. ‘హిట్ 2’ చిత్రం కమల్‌హాసన్‌గారి ‘విక్రమ్’లా హిట్ కావాలనుంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో లాస్ట్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. నేను ముద్దు సన్నివేశాల్లో నటించినప్పుడు అమ్మ తిట్టింది. ఫైట్స్, డ్యాన్స్‌లా అది కూడా నటనలో భాగమని అమ్మకి చెప్పాను. నాకు ఓ మంచి కామెడీ సినిమా చేయాలనుంది. ‘హిట్ 3’లో నేను కూడా ఉంటాను. ఆస్కార్ అవార్డు పొందిన ఓ హాలీవుడ్ మూవీని రీమేక్ చేయనున్నాం. అందులో నా పాత్ర రఫ్‌గా ఉంటుంది. ► నేను అమెరికాలో ఉన్నప్పుడు గంటన్నర ప్రయాణం చేసి మరీ వెళ్లి మహేశ్‌బాబుగారి ‘మురారి’ సినిమా చూశాను. నేను అభిమానించిన హీరోలు మహేశ్‌బాబు (‘మేజర్’ సినిమా నిర్మాత), నానీ (హిట్ 2) గార్లతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నాలోని నిజాయతీ, నా ప్యాషన్‌ని మహేశ్, నానీగార్లు నమ్మారు కాబట్టే నాతో సినిమాలు నిర్మించారు. -
అలా అయితే ఏడాదికో హిట్ సినిమానే తీయాలి!
‘‘హిట్ 2’ చిత్రం థ్రిల్లర్ జానర్ అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా కథ రెడీ చేశాను. ఇందులో ప్రేమకథ కూడా కావాలని పెట్టింది కాదు. ఓ కేసును పోలీసాఫీసర్ టేకప్ చేస్తే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అనేది చూపించాం’’ అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పిన విశేషాలు. ► నేను సిడ్నీ నుంచి వచ్చినప్పుడు నానీగారితో సినిమా తీయాలనుకున్నాను. ఆయనకు ‘హిట్’ కథ చెబితే, ‘నేను నటించను కానీ నిర్మిస్తా’ అన్నారు. అలా విశ్వక్ సేన్‌తో ‘హిట్ ది ఫస్ట్ కేస్’ తీశాం. ‘హిట్ ది సెకండ్ కేస్’కి అడివి శేష్ అయితే బాగుంటుందనుకున్నాను. నానీగారికి చెప్పగానే ఓకే అన్నారు. సినిమా గురించి మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. అడివి శేష్‌కి ‘హిట్ ది సెకండ్ కేస్’ కథ చెప్పినప్పుడు స్వతహాగా తను కూడా రైటర్ కావడంతో ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఐదారు సిట్టింగ్స్ తర్వాతే ఓకే చెప్పారు. ∙‘హిట్’ ఫ్రాంచైజీని కొత్తగా ప్లాన్ చేశాం. ఒక్కో భాగంలో ఒక ఆఫీసర్‌ను పరిచయం చేస్తూ.. చివరకు అందరు ఆఫీసర్లను కలిపి ఓ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ► నా సినిమాలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఇందుకు ఎంతో పరిశోధన చేస్తాను. ‘హిట్ ఫస్ట్ కేస్’ సమయంలో దిశ ఘటన జరిగింది. సెకండ్ కేస్ సమయంలో మళ్లీ ఇలాంటి (శ్రద్ధా వాకర్) ఘటన జరిగింది. అలాంటి క్రిమినల్స్ సమాజంలో ఉన్నారు. క్రిమినల్స్ ఎందుకు ఇలా మారతారు? అనే చర్చ మా సినిమాలో ఉంటుంది. ‘హిట్’ సీజన్ క్రియేట్ చేయమని రాజమౌళిగారు ఇచ్చిన సలహా మాకు నచ్చింది. ఇందుకు నానీగారు, ప్రశాంతిగారు ఓకే అంటే నేను ప్రతి ఏడాది ఇక హిట్ సినిమానే తీయాల్సి వస్తుంది(నవ్వుతూ). ► ‘హిట్ సెకండ్ కేస్’ తెలుగులో రిలీజయ్యాక హిందీలో డబ్ చేస్తాం. హిట్ ఫ్రాంచైజీ కాకుండా నా దగ్గర మూడు బౌండ్ స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి. -
‘హిట్ 2’ ప్రీ రిలీజ్ వేడుక: ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘హిట్ 2’ ట్రైలర్ బాగా నచ్చింది. అందులోని నేపథ్య సంగీతం ఇంకా బాగుంది.. మంచి ఎనర్జీ ఇచ్చింది. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనే ఉత్సుకత కలిగింది’’ అని ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ–‘‘హిట్’ అనే అద్భుతమైన ఫ్రాంచైజీని సృష్టించిన నాని, ప్రశాంతి, శైలేష్‌లను అభినందిస్తున్నాను. థ్రిల్లర్ జానర్లో శైలేష్ బాగా తీశాడు.. ఈ చిత్రం హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ‘హిట్ 3, 4, 5’ సినిమాలు వస్తాయి.. అయితే ప్రతి ఏడాది ఒక సీజన్లో ‘హిట్’ ఫ్రాంచైజీ రావాలి.. ఈ సీజన్ ‘హిట్’ది అని జనాలకు అర్థం కావాలి. ప్రతి ఏడాది ఒకే నెల ఒకే తేదీన ఈ చిత్రాలు విడుదలవుతుండాలి. సాంకేతిక విలువలు బాగున్నాయి. నటీనటులు ఫెంటాస్టిక్‌గా చేశారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న మంచి ప్రొడక్ట్ ఇది.. మేమంతా గర్వపడుతున్నాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ–‘‘హిట్’ ఫ్రాంచైజీలో 3,4,5,6,7 సినిమాలు ఉంటాయి. 7వ పార్ట్‌లో యూనివర్సల్‌గా అందరి హీరోలను కలుపుతానని, ఓ పెద్ద సమస్య పరిష్కారం కోసం వాళ్లని తీసుకొస్తానని శైలేష్ చెప్పాడు. ఓ నిర్మాతగా కంటే ప్రేక్షకునిగా ఆ మూవీ చూసేందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నాను’’ అన్నారు. ఈ వేడుకలో హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్, నిర్మాత శోభు యార్లగడ్డ, మీనాక్షి చౌదరి, సంగీత దర్శకులు ఎంఎం శ్రీలేఖ, సురేశ్ బొబ్బిలి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తదితరులు మాట్లాడారు. -
హిట్ 2 మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్
-
పాన్ ఇండియా సినిమాలపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
పాన్ ఇండియా సినిమాలపై యంగ్ హీరో అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా సినిమా అనేది కథలో ఉండాలి కానీ.. ఇమేజ్ ఉంది కదా అని పాన్ ఇండియా మూవీ చేయకూడదన్నారు. తాను ఎప్పటికీ ఇక్కడే (తెలుగు) నుంచే ఇండియన్ సినిమా చేస్తానని చెప్పారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్’కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘హిట్’ సిరీస్‌లో రెండో పార్ట్ చాలా కీలకం. ‘హిట్ 3’లోనూ నేను ఉన్నాను. ‘హిట్ 2’ని పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయాలని ఉత్తరాది ప్రేక్షకులు అడుగుతున్నారు.. నానీగారితో మాట్లాడి పాన్ ఇండియన్ రేంజ్లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. అన్నపూర్ణ బ్యానర్లో నేను చేయబోతున్న రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఉంటాయి. ‘హిట్ 2’ హిందీ వెర్షన్ కాస్త ఆలస్యంగా రిలీజవుతుంది’’ అన్నారు. ‘‘చెడు మీద మంచి ఎలా గెలుస్తుందనేది ఈ సినిమాలో చూపించాం. ‘హిట్ 3’ని భారీగా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. నటీనటులు మీనాక్షి చౌదరి, పావని, శ్రీనాథ్ మాగంటి తదితరులు మాట్లాడారు. -
థ్రిల్లింగ్ ఎలిమేంట్స్‌తో ఉత్కంఠభరితంగా హిట్-2 ట్రైలర్
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్-2. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి ఇందులో అడివి శేష్ జోడీగా నటించింది. డిసెంబర్2న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘సాధారణంగా ఈ క్రిమినల్స్ తెలివి తక్కువ వాళ్లు. కోడి బుర్రలు. ఐదు నిమిషాలు చాలు వీళ్లని పట్టుకోవడానికి’’ అంటూ శేష్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సంజన అనే ఒక యువతి హత్య కేసు పోలీస్ ఆఫీసర్ రోల్లో శేష్ ఎలా పరిష్కరించాడన్నది ట్రైలర్‌లోని ప్రతి సీన్ ఉత్కంఠకు గురి చేసేలా ఉంది. రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
హిట్ పార్ట్ 2లో విశ్వక్ సేన్ ఎందుకు లేడంటే..?
-
హీరోయిన్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేసి నానికి దొరికిపోయిన హీరో
నేచురల్ స్టార్ నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ దొరికేశాడు హీరో అడివి శేష్. నానికి తెలియకుండా ఆయన ఆఫీస్‌లో షూట్ చేసిన ఈ వీడియోను శేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నాని ట్విట్టర్ వేదికగా.. నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడుకుంటారా అంటూ అడివిశేష్‌ను ప్రశ్నించాడు. ఇంతకీ ఆ డ్యాన్స్ వీడియో ఎందుకంటే.. అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా హిట్-2 అనే చిత్రంలో నటించారు. నాని ప్రారంభించిన ‘వాల్ పోస్టర్ సినిమాస్’ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో,హీరోయిన్లు ‘ఉరికే’ అనే పాటకు నాని ఆఫీస్‌లో డ్యాన్స్ చేశారు. 'ఇలా డ్యాన్స్ చేయడం సిగ్గుగానే ఉంది. కానీ మీకోసం ఏదైనా చేస్తా' అంటూ శేష్ వీడియోను షేర్ చేశాడు. ఈ డ్యాన్స్‌లో వారి కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది. అందుకే నాని.. 'నా ఆఫీస్‌ని ఇలా కూడా వాడొచ్చా' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. Naa office ni ila kooda vaadocha 🧐@AdiviSesh @Meenakshiioffl https://t.co/PVdIc5UrXn — Nani (@NameisNani) November 12, 2022 -
యూట్యూబ్ నుంచి ‘హిట్ 2’ టీజర్ డిలీట్.. వివరణ ఇచ్చిన అడివి శేష్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్ 2’. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని సమర్పకుడిగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల టీజర్‌ని విడుదల చేయగా.. ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. అతి తక్కువ వ్యవధిలోనే యూ ట్యూబ్ సహా అన్నీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ‘హిట్ 2’ టీజర్ హల్ చల్ చేస్తూ ట్రెండ్ అయ్యింది. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే యూ ట్యూబ్ ‘హిట్ 2’ టీజర్‌ను తొలగించి అందరికీ షాకిచ్చింది. ట్రెండింగ్ లిస్టు నుంచి తొలగించింది. టీజర్ చూడటానికి వయోపరిమితి ఉండాలంటూ ఆంక్షలు విధించింది. టీజర్‌పై యూ ట్యూబ్ యాక్షన్ తీసుకునే లోపు 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనిపై హీరో అడివి శేష్ వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అసలేం జరిగిందనే విషయాన్ని వివరిస్తూనే టీజర్‌ను చూడాలనుకుంటే ఏం చేయాలో కూడా చెప్పారు. ఇలాంటిది ముందే జరుగుతుందని టీమ్ ముందుగానే ఊహించింది. అయితే అంతా సవ్యంగానే జరుగుతుందని యూనిట్ భావిస్తోంది. యూ ట్యూబ్ నిర్ణయాన్ని చిత్ర యూనిట్ స్వాగతించింది. అదే సమయంలో అడివి శేష్ తన వీడియోలో రేపు విడుదలవుతున్న ఉరికే ఉరికే సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. #HIT2 Teaser got REMOVED from YouTube Trending 😑 But no worries #UrikeUrike Song out tomorrow ❤️ 😡@KolanuSailesh pic.twitter.com/vCYRu3HIHu — Adivi Sesh (@AdiviSesh) November 9, 2022 -
Hit 2: 'ఉరికే ఉరికే' ప్రోమో సాంగ్ .. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్
అడివి శేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ఈ చిత్రంలో ఆయన కూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. శైలేష్ కొలను ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈయన డైరెక్షన్లో ఇంతకు ముందు రూపొంది ఘన విజయాన్ని సాధించిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ చిత్రానికి ఇది ఫ్రాంచైజీగా రూపొందింది. అడివి శేష్ ఇందులో కె.డి అనే పాత్రలో కనిపిస్తుంటే ఆయనకు జోడీగా ఆర్య అనే పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ భారీ రేంజ్లో విడుదలవుతుంది. గత వారం విడుదలైన ‘హిట్ 2’ టీజర్‌కి టెరిఫిక్ రెస్పాన్ష్ వచ్చింది. ఇప్పుడు ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ సాంగ్‌తో ఆడియెన్స్‌ని అలరించబోతున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో అడివి శేష్, మీనాక్షి చౌదరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కచ్చితంగా ఫుల్ సాంగ్ ట్రీట్‌లా ఉండబోతుందని తెలుస్తుంది. బ్యూటీఫుల్ విజుల్స్, దానికి తగ్గ ట్యూన్ మ్యాజిక్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణ కాంత్ సాహిత్యాన్ని అందించారు. ఇప్పుడు సిద్ శ్రీరామ్ శ్రావ్యమైన గొంతు వినటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి సాంగ్ ఈ నెల న 10న విడుదల కానుంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యారీ బి.హెచ్ ఎడిటర్, ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. -
ముంబై హీరోయిన్స్‌పై కామెంట్స్ చేసిన అడివి శేష్
-
ముంబై హీరోయిన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్
విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. మేజర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన హిట్-2 అనే స్పై థ్రిల్లర్ తరహా కాన్సెప్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టీజర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్ ముంబై హీరోయిన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హిట్-2లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేసింది. సాధారణంగా ముంబై వాళ్లు ఉంటారు కదా.. ప్రెట్టి గర్ల్స్.. వస్తారు హాయ్ అని చెప్పి వన్ టూ త్రీ అంటారు. తర్వాత క్యారవాన్ ఎక్కి వెళ్లిపోతారు. అందరికీ నమస్కారం అంటారు. కానీ మీనాక్షి అలా కాదు. అందరికీ నమస్కారం చెప్పిన తర్వాత కూడా తెలుగులోనే మాట్లాడింది. టీజర్ లాంచ్‌లోనే ఇంత ప్రిపేర్ అయ్యిందంటే సినిమాలో ఎంత కష్టపడి ఉండొచ్చో మీరే అర్థం చేసుకోండి అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు. అయితే ఈ సందర్భంగా ముంబై హీరోయిన్స్‌పై శేష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
ఆ తపన ఎప్పుడూ ఉంటుంది
‘‘మంచి సినిమా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్ సమయంలో ‘హిట్ 2’ చేయటానికి టీమ్ ఎంతో కష్టపడింది. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని అడివి శేష్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మించారు. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని గురువారం విడుదల చేశారు. అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారు ‘మేజర్’, నాని ‘హిట్ 2’ సినిమాలు నాతో నిర్మించడం హ్యాపీ. ‘హిట్ 2’ రిలీజ్ కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘హిట్’తో హిట్ సాధించాం. ‘హిట్ 2’ని స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ప్రశాంతి త్రిపిరనేని. ‘‘క్రైౖమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిట్ 2’. అడివి శేష్ పర్ఫెక్ట్ జెంటిల్‌మేన్.. సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. నేను ఇక్కడ ఉండటానికి కారణం నానీగారే.. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు శైలేష్ కొలను. సినిమాటోగ్రాఫర్ మణికందన్ .ఎస్, ఎడిటర్ గ్యారీ బి.హెచ్, హీరోయి¯Œ కోమలీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ∙మీనాక్షీ చౌదరి, అడివి శేష్, ప్రశాంతి, శైలేష్ -
అడివిశేష్ ‘హిట్-2’ మూవీ టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
Hit 2 Teaser: అంచనాలు పెంచేస్తున్న హిట్-2 మూవీ టీజర్
విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో అడివి శేష్. మేజర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన మరో స్పై థ్రిల్లర్ తరహా కాన్సెప్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం హిట్-2. ది సెకండ్ కేస్ అనేది ట్యాగ్ లైన్.శైలేష్ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా మూవీ టీజర్‌ను విడుదల చేశారు. పోలీస్ ఆఫీసర్ లుక్‌లో అడివి శేష్ ఆకట్టుకుంటుంది. ఇందులో మీనాక్షి చౌదరి అడివి శేష్‌కు జోడీగా నటించింది. ఈ సినిమా డిసెంబర్2న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) What do YOU know about FEAR? You. will. find. out. The #HIT2 Teaser is Here. 🔥 HIT 2 Teaser | Adivi Sesh | Nani | Sailesh Kolanu | https://t.co/1SmX9m46EB via @YouTube ⚠️ WARNING : Not for Children #HIT2onDec2 @NameisNani @KolanuSailesh @tprashantii @Meenakshiioffl pic.twitter.com/ZPSErSbFNT — Adivi Sesh (@AdiviSesh) November 3, 2022 -
సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టిన హీరో ఎవరు?..బాలయ్య ప్రశ్నకు శేష్, శర్వా షాక్!
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో కొత్త ప్రోమో తాజాగా విడుదలైంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్‌ని విజయవంతంగా ముగించుకున్న ‘అన్ స్టాపబుల్-2’ మూడో ఎపిసోడ్‌కు యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ హాజయ్యారు. బాలయ్య పంచులు.. శర్వా, శేష్‌లు జోకులతో ప్రోమో నవ్వులు పూయిస్తోంది. శర్వా వచ్చి రావడంతోనే బాలయ్యను పొగడ్తలతో ముంచేశాడు. ‘ఆయన పేరు బాలయ్య.. ఆయన ఎప్పటికే బాలుడే’అంటూ బాలకృష్ణను ఇంప్రెస్ చేశాడు. అలాగే తనకు క్రష్ అని చెప్పిన రష్మికతో వీడియో కాల్ మాట్లాడించాడు. ఇక షోకి వచ్చిన అడవి శేష్‌ని పెళ్లి ఎప్పుడు? అని బాలకృష్ణ ప్రశ్నించగా..ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని చాలా ప్రెజర్.. నాకేమో ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోలేని పెద్దలు చాలా మంది ఉన్నారు. ప్రభాస్, శర్వానంద్ లాంటి వాళ్లు ఇంకా పెళ్లి చేసుకోలేదని చెబుతూ తప్పించుకుంటున్నాను అన్నారు. అప్పుడు శర్వా.. ‘నేను ఆయన(ప్రభాస్) పేరు చెప్పుకొని తిరుగుతున్నా.. నువ్వేమో నా పేరు చెప్పుకొని తిరుగుతున్నావా? అని అనడంతో బాలకృష్ణతో సహా అందరూ గట్టిగా నవ్వారు. షోలో భాగంగా చివర్లో చిన్న గేమ్ ఆడదాం బ్రదర్స్ అంటూ.. ట్రూత్ అయితే దుస్తులు విప్పేయాలని కండీషన్ పెట్టాడు. మొదటి ప్రశ్నగా ‘సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టిన హీరో? ’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పేందుకు ఇద్దరు హీరోలు భయపడ్డారు. ఆ హీరో బాలయ్యనే అని చెప్పే సాహసం చేయలేకపోయారు. చివరకు శర్వా.. మీ ఆన్సర్ అయినా కూడా మేమే విప్పాలా సర్? అని ప్రశ్నించగా.. ‘స్టూడియో దాటి బయటికి వెళ్లగలరా?’అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ఈ యంగ్ హీరోలతో బాలయ్య ఎలా ఆడుకున్నారో శుక్రవారం(నవంబర్ 4) ప్రసారం అయ్యే ఫుల్ ఎపిసోడ్లో చూడాలి. -
'హసీనా' టీజర్‌ను విడుదల చేసిన అడివి శేష్
‘‘హీరోయిన్ ఓరియంటెడ్‌గా రూపొందిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రంలో 84 మంది కొత్తవారు నటించడం విశేషం. టీజర్ చాలా బాగుంది.. సినిమా ఘనవిజయం సాధించాలి’’ అని హీరో అడివి శేష్ అన్నారు. ప్రియాంక డే టైటిల్ రోల్లో సాయి తేజ గంజి, తన్నీవర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హసీనా’. నవీన్ ఇరగాని దర్శకత్వం వహించారు. ఎస్. రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం టీజర్‌ని అడివి శేష్ విడుదల చేశారు. ‘ఎవడైనా బాగుపడాలన్నా సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్ అయి ఉంటారు’ అనే డైలాగ్‌తో ఆరంభమై, ‘నా పేరు హసీనా.. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తాగి ఉండాలి.. లేక మేధావి అయినా అయ్యుండాలి’ డైలాగ్‌తో ముగుస్తుంది. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ కందా, సంగీతం: షారుక్ షేక్, నేపథ్య సంగీతం: నవనీత్ చారి, లైన్ ప్రొడ్యూసర్: సాయితేజ గంజి. -
నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్
మూడు విభిన్న పాత్రలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ జోడిగా నటించిన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. 'నాటకం' వంటి సినిమాను తెరకెక్కించిన కల్యాణ్ జి గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ.. ''అడగ్గానే వచ్చిన మా మేజర్ (అడివి శేష్)కు సెల్యూట్. మా డీజే (సిద్దు జొన్నలగడ్డ) ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రీ కొడుకుల్లా నటించబోతోన్నాం. మా అబ్బాయి నటించిన ప్రేమ కావాలి అంటూ వచ్చాడు. ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ ముందుకు రాబోతోన్నాడు. ఈ టీం అందరికీ థాంక్స్. ఇంత మంది మంచి మనుషులు కలిసి ఈ సినిమాను తీశారు. ఈ ఏడాదితో నాకు నటుడిగా 50 ఏళ్లు వస్తాయి. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మన సినిమా కూడా ఉండాలి. మీ ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా విజయం సాధించాలి'' అని తెలిపారు. ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థాంక్స్. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కల్యాణ్‌కు థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మా సినిమాను నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థాంక్స్. సాయి కార్తిక్ మంచి బీజీఎం ఇచ్చారు. మా కెమెరామెన్ బాలిరెడ్డి, ఫైట్ మాస్టర్ ఇలా పని చేసిన అందరికీ థాంక్స్. సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’ అని పేర్కొన్నాడు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు ! ''నన్ను ఇక్కడకు పిలిచిన సాయి కుమార్ గారికి థాంక్స్. ఇది వరకు ఆది చేసిన సినిమాలు అన్నింట్లో కెల్లా ఈ చిత్రంలో కొత్తగా అనిపిస్తున్నాడు. కారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ కల్యాణ్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. స్క్రీన్ మీద ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తుంది'' అని సిద్ధు జొన్నల గడ్డ తెలిపాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ‘తీస్ మార్ ఖాన్ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా అమ్మ బర్త్ డే ఆగస్ట్ 19. ఈ చిత్రం సక్సెస్‌తో మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్లో ఆది కుమ్మేశాడు. సినిమాలోనూ కుమ్మేస్తాడు. పాయల్‌ను ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు. చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''తీస్ మార్ ఖాన్ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. పర్ఫెక్ట్ కమర్షియల్ టైటిల్. నేను ఆది కలిసి శమంతకమణి సినిమాను చేశాం. ఆయన అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఆదికి పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. సాయి కుమార్ గారితో నేను భలే మంచిరోజు చిత్రాన్ని చేశాను. నాకు ఆయన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో తండ్రిలాంటి వారు'' అని తెలిపాడు. ‘నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో కాస్త నెర్వస్‌గా ఉంటాను. అది అందరికీ సహజంగానే ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికి విశేషమైన స్పందన వచ్చింది. మా సినిమాకు మీ ప్రేమ దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది. నేనేం స్టార్ కిడ్‌ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ సినిమా నాకెంతో స్పెషల్. మూడేళ్ల తరువాత నా సినిమా థియేటర్లోకి వస్తోంది. ఈ చిత్రంలో ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి’ అని హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. -
బాక్సాఫీస్ కళ కళ.. సంతోషంలో స్టార్ హీరోలు..ట్వీట్స్ వైరల్
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కలకళలాడుతోంది. ఈ శుక్రవారం(ఆగస్ట్ 5) విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలు తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకున్నాయి. దీంతో ఈ విజయాన్ని టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్ వచ్చేలా చేసిన సీతారామం, బింబిసార చిత్ర బృందానికి తెలుగు హీరోలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఈ రెండు చిత్రాల మేకర్స్‌కి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ‘సీతారామం’ మరియు ‘బింబిసార’ చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనఃపూర్వక శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశాడు. ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు హిట్ టాక్ని సంపాదించుకోవడం సంతోషంగా ఉందని విజయదేవరకొండ ట్వీట్ చేశాడు. Extremely happy to hear that 2 films on the same day have turned into hits :)) What a good day! Congratulations to @VyjayanthiFilms @dulQuer @mrunal0801 @iamRashmika, @iSumanth anna, @hanurpudi and team on #SitaRamam. Hearing the most amazing beautiful things about the film ❤️ — Vijay Deverakonda (@TheDeverakonda) August 6, 2022 సీతారామం, బింబిసార చిత్రాల విజయంపై యంగ్ హీరో అడివి శేష్ కూడా స్పందించాడు. తనకు కొవిడ్ రావడంతో ఐసొలేషన్‌లో ఉన్నానని... తన కోసం ఉదయం ఒక సినిమా, తర్వాత మరో సినిమా చూడమని అడివి శేష్ ట్వీట్ చేశాడు. Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳 — Adivi Sesh (@AdiviSesh) August 5, 2022 -
అడివి శేష్‌కు కరోనా.. తనకోసం ఆ పని చేయాలంటూ పోస్ట్
కల్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. నేడు(శుక్రవారం)విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం పట్ల హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'ఈ రెండు సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుండటం సంతోషంగా ఉంది. ఇది కదా కావల్సింది. ప్రస్తుతం తనకు కరోనా రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నా. అందుకే థియేటర్స్‌కి వెళ్లలేకపోతున్నా. నా కోసం ఓ మార్నింగ్ షో, మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి' అంటూ అడివి శేష్ ట్వీట్ చేశారు. అయితే ఆయనకు కరోనా అని తెలియడంతో పలువురు అభిమానులు గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳 — Adivi Sesh (@AdiviSesh) August 5, 2022 -
'మేజర్' అరుదైన రికార్డు.. పాక్‌తో సహా 14 దేశాల్లో ట్రెండింగ్
Major Trends At Top 10 On Netflix Across 14 Countries: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా సత్తా చాటుతోంది. అడవి శేష్ నటన, యాక్షన్ సీక్వెన్స్, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వివిధ దేశాల్లోని ప్రజలను ఆకట్టుకుంటోంది. 'మేజర్' చిత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 14 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు, హిందీ భాషలతోపాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉండగా.. బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, మలేషియా, ఒమన్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, ఖతార్, సింగపూర్ సహా 14 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్ టాప్-10లో నిలిచింది. ఇండియా, మారిషస్, నైజీరియాలో టాప్-1లో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ విషయంపై హీరో అడవి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాపై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే' అని తెలిపాడు. India's hero is being celebrated worldwide 💥💥#MajorTheFilm is trending in Top 10 films on @NetflixIndia across 14 countries ❤️🔥❤️🔥@AdiviSesh #SobhitaDhulipala @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @sonypicsindia pic.twitter.com/sKv0jQ3IGr — Major (@MajorTheFilm) July 14, 2022 -
పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన ‘మేజర్’
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. (చదవండి: మేజర్ మూవీ రివ్యూ) తాజాగా ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులను సృష్టిస్తోంది. జులై 3 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ టాప్ 1, 2 పొజిషన్లలో మేజర్ కొనసాగుతుంది. ‘మేజర్’ హిందీ వెర్షన్ టాప్ 1లో ట్రెండ్ అవుతుండగా, తెలుగు వెర్షన్ రెండో స్థానంలో ఉంది. (చదవండి: చిరంజీవి కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా రికార్డులు బద్దలే!) ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్లో కూడా ‘మేజర్’ చరిత్ర సృష్టిస్తున్నాడు. అక్కడ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో మేజర్ మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా ఈ చిత్రం టాప్ 1లో ఉండడం గమనార్షం. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. #India #Pakistan #Bangladesh #SriLanka NUMBER 1 #MAJOR 🇮🇳❤️ pic.twitter.com/R1G6tIWPTG — Adivi Sesh (@AdiviSesh) July 8, 2022 -
ఓటీటీలో మేజర్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే?
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మేజర్. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మేజర్ సందీప్ తల్లిదండ్రులుగా ప్రకాశ్ రాశ్, సీనియర్ నటి రేవతిలు కనిపించారు. శోభితా ధూళిపాళ, సయూ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. జూన్ 3న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి మేజర్ అందుబాటులోకి రానుంది. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రసారం కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. The untold story of a son. The untold story of a father. The untold story of a SOLDIER. 🇮🇳🪖 Major is coming to Netflix on 3rd July in Telugu, Hindi and Malayalam! #MajorOnNetflix pic.twitter.com/1ngxcOciuQ — Netflix India South (@Netflix_INSouth) June 30, 2022 చదవండి: మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలిగిన శివానీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ వచ్చేసింది! -
మాట నిలబెట్టుకున్నాను: అడివి శేష్ ఆసక్తికర ట్వీట్
యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం మేజర్ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మేజర్ సందీప్ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయి ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించాడు. ఇక ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు జల్లు కురిపించాడు. ఇక ఈ మూవీ విడుదలై నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. చదవండి: ఫిలిం జర్నలిస్ట్‌తో స్టార్ డైరెక్టర్ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్ ఇప్పటికీ మేజర్ చిత్రం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అడివి శేష్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘మేజర్ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకువస్తానని కరోనా సంక్షోభంలో మాట ఇచ్చాను. నా మాట నిలబెట్టుకున్నాను కూడా. మేజర్ సినిమా రిలీజై ఇది నాలుగవ వారం. ఈ నాలుగో వారం కూడా మేజర్ థియేటర్లో సందడి చేస్తుంది’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ సాయి ముంజ్రేకర్ నటించగా మేజర్ సందీప్ తల్లిదండ్రులుగా ప్రకాశ్ రాశ్, సీనియర్ నటి రేవతిలు కనిపించారు. ఇక శోభితా ధూలిపాళ్ల, మురళీ వర్మ, అనీస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లా?, ఫొటో వైరల్ In the Pandemic, I promised #Major is a big screen experience. I kept my promise. FOURTH week in theaters ! Let’s do this 🇮🇳 #JaiHind #MajorTheFilm pic.twitter.com/9Wo0EZf1hO — Adivi Sesh (@AdiviSesh) June 24, 2022 -
‘మేజర్’ పై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. (చదవండి: 'మేజర్' టీమ్‌కు వెండి నాణేన్ని బహుకరించిన సీఎం) తాజాగా ఈచిత్రంపై టీమిండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఇప్పుడే మేజర్ సినిమాను చూశాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజమైన స్ఫూర్తిదాయకమైన కథ ఇది. మీకు బాగా నచ్చుతుంది. అడివి శేష్ అద్భుతంగా నటించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది’అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. Just finished watching #Major and I have to say it's not just a film but an emotion. A really inspiring story of Major Sandeep Unnikrishnan that hits you right in the feels. Great job by @AdiviSesh to take it to another level. A must-watch! 👌🏻 pic.twitter.com/0nOxIwJCvL — VVS Laxman (@VVSLaxman281) June 21, 2022 -
‘మేజర్’ నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్, ఆకట్టుకుంటున్న అమ్మ పాట
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. చదవండి: పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట! మేజర్‌కు వస్తున్న విశేష స్పందనకు కానుకగా తాజాగా చిత్రం బృందం ఈ మూవీ నుంచి ఓ ఎమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘కన్నా కన్నా’ అంటూ సాగే ఈ పాటలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం నుంచి సైన్యంలో చేరేందుకు బయలుదేరే పలు సన్నివేశాలను చూపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటకు శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకుర్చగా.. ప్రముఖ గాయనీ చిత్ర ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటోంది. -
'మేజర్' టీమ్‌కు వెండి నాణేన్ని బహుకరించిన సీఎం
UP CM Yogi Adityanath Meets And Blesses Team Major: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. తాజాగా ఇలాంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు చిత్రబృందాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ అభినందించారు. 'మేజర్' మంచి విజయం సాధించిన సందర్భంగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు మూవీ యూనిట్‌ను కలిసి ప్రశంసించారు. తర్వాత సినిమాలో 10 నిమిషాలను సీఎంకు చూపించి పూర్తి చిత్రాన్ని వీక్షించాలని వారు కోరారు. చిత్ర విశేషాలను సుధీర్ఘంగా చర్చించిన తర్వాత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తాని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం చిత్రబృందానికి, మేజర్ సందీప్ తల్లిదండ్రులకు శాలువ కప్పి, వెండి నాణేన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు హీరో అడవి శేష్, నిర్మాత శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ) ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అడవి శేష్ పంచుకున్నారు. కాగా ఇటీవల మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఫండ్‌కు సంబంధించిన విషయం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చిత్ర యూనిట్ సమావేశమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సీడీఎస్, ఎన్డీఏ ఆశావహులకు శిక్షణ కోసం ఉపయోగిస్తామని తెలిపింది. దీంతో దేశానికి సేవ చేయాలనే వారి కలలు సాకారం అవుతాయని చిత్రబృందం పేర్కొంది. చదవండి:కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్‌షాట్స్ వైరల్ స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్
Sadha Cried In Theater While Watching Major Movie: 'జయం' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయింది ముద్దుగుమ్మ సదా. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుని వెళ్లవయ్యా వెళ్లు అంటూ యూత్ హృదయాలను కొల్లగొట్టింది. తర్వాత దొంగ దొంగది, అవునన్నా కాదన్నా, అపరిచితుడు, ప్రియసఖి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ థియేటర్లో కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసుకు ఆ సినిమా ఎంతగానో చేరువైందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకి ఆ సినిమా ఏంటంటే ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన 'మేజర్'. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఈ విధంగానే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సదా ఎమోషనల్ అయింది. ఫస్ట్ ఆఫ్‌లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబయిలోనే ఉన్నాని, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొంది. శశి కిరణ్ కథను తెరకెక్కించిన విధానం, అడవి శేష్ నటన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిచింది. View this post on Instagram A post shared by Major (@majorthefilm) -
ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్
Major Actor Adivi Sesh Reveals His Love In Latest Interview: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడవి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు అడవి శేష్. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ఎఫైర్స్ వంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శేష్. 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో అనట్లేదా' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో ఒకే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కు వచ్చేసింది. పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతుంటాను.' అని చెప్పాడు శేష్. తర్వాత 'మరి ఆయనకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అలా ఉన్నాయా' అని అడిగిన ప్రశ్నకు 'ఆయనలా నాకు మాత్రం ఎవరితో ఎఫైర్స్ లేవు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నా. నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయింది.' అంటూ తదితర ఆసక్తికర విషయాలను అడవి శేష్ పంచుకున్నాడు. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. ఇంకా ఆ ఇంటర్వ్యూలో 'మా తెలుగు వాడు హిందీకి వెళ్లి సాధించాడని అంతా అంటుంటే చాలా గర్వంగా ఉంది. ఓవర్‌నైట్ సక్సెస్ రావడానికి పదేళ్లు పట్టింది. చిరంజీవి, మహేశ్‌బాబుకు అభిమానులు ఎలా ఉంటారో నేను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌కు అభిమానిని. అక్కడ చెడుల ఉంది అంటే.. ఆ పరిసరాల్లో నేను కనిపించను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకు ఏదైనా నచ్చిందంటే దానిని ఎక్కువగా చేసేందుకు ఇష్టపడతాను. తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం' అంటూ పేర్కొన్నాడు అడవి శేష్. చదవండి: బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్ -
రచయితలుగా హీరోలు.. అట్లుంటది వీళ్లతోని!
కెమెరా ముందు నటులుగా విజృంభిస్తున్నారు... కెమెరా వెనకాల రచయితలుగా కలం పడుతున్నారు. యువహీరోలు అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి, కిరణ్ అబ్బవరం, విశ్వక్ సేన్ రచయితలుగా కథలు.. డైలాగులు రాస్తున్నారు.. నాయకులుగా నటిస్తున్నారు. ఈ ‘కథా’నాయకుల కథ తెలుసుకుందాం. ‘మేజర్’ సినిమాతో తాజాగా మరో హిట్ అందుకున్నారు అడివి శేష్. తాను హీరోగా నటించిన ‘క్షణం, గూడఛారి’ వంటి సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందించారు శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’ మంచి విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మేజర్’. ఈ చిత్రానికి శేష్ అద్భుతమైన కథ అందించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయవంతంగా సాగుతోంది. ఇలా శేష్ కథలు అందించిన ‘క్షణం, గూఢచారి, మేజర్’ సినిమాలు హిట్స్‌గా నిలవడం విశేషం. ఇటు రైటింగ్.. అటు యాక్టింగ్‌లో శేష్ మేజర్ హిట్స్ చూశారు. అట్లుంటది మనతోని ‘అట్లుంటది మనతోని...’ అంటూ ‘డీజే టిల్లు’లో హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన సందడికి యూత్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రానికి కథ, మాటలు అందించి రైటర్‌గానూ సూపర్ హిట్ అందుకున్నారు సిద్ధు. ‘డీజే టిల్లు’ ఇచ్చిన హిట్‌తో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రెడీ చేస్తున్నారు సిద్ధు. కాగా సిద్ధు హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం 2020 జూన్‌లో ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లే అందించారు సిద్ధు. ఈ యువహీరో కథ ఇచ్చిన రెండు సినిమాలూ హిట్ కావడం విశేషం. ఆత్రేయ కథ అదిరింది ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు నవీన్ పొలిశెట్టి. ఈ రెండు చిత్రాల్లో హీరోగా నటించగా, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు కథ, స్క్రీన్ ప్లే అందించారు నవీన్. ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. మాస్ కా దాస్ ‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల్లో హీరోగా నటించి, మూడో చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’తో దర్శకుడిగా మారారు విశ్వక్ సేన్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా అందించారు. ‘ఫలక్‌నుమా దాస్’తో హీరోగా మాస్ కా దాస్ అంటూ మంచి మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోవడంతో పాటు రైటర్‌గానూ మార్కులు కొట్టేశారు విశ్వక్. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దాస్‌కి ధమ్కీ’ చేయడానికి విశ్వక్ కథ సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తారు విశ్వక్. కిరణ్ అబ్బురం తొలి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో హీరోగా హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. తన ద్వితీయ చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’కి కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసుకున్నారు కిరణ్. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. హీరోగా.. రైటర్‌గా కిరణ్ ‘అబ్బురం’ అనిపించుకున్నారు. టాలెంట్‌ని ఎవరూ ఆపలేరు. బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఆ ప్రతిభే మంచి నిచ్చెన అవుతుంది. ఈ విషయంలో ఈ ‘కథా’నాయకులు మరికొందరికి ఆదర్శం అనొచ్చు. చదవండి: ముడతలు కనిపిస్తున్నాయ్.. గ్లో తగ్గింది.. అనసూయపై కామెంట్లు ‘డీజే టిల్లు’ పిల్లతో కిరణ్ అబ్బవరం రొమాన్స్! -
పాఠశాలలకు ‘మేజర్’ మూవీ టీం స్పెషల్ ఆఫర్!
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. చదవండి: అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం: డైరెక్టర్ ఇక ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సైతం మేజర్ సినిమా మాత్రమే కాదని.. ఒక ఎమోషనల్ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మేజర్ చిత్ర బృందం పాఠశాలకు ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. మేజర్ సందీప్ ఉన్నిఒకృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలల యాజమాన్యాలకు టీకెట్ ధరపై 50 శాతం రాయితి ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పాఠశాలల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా షో వేస్తామని, ఇందుకోసం majorscreening@gmail.comకి మెయిల్ చేసి అవకాశాన్ని పొందాలని మేజర్ టీం తెలిపింది. చదవండి: ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే: సాయి పల్లవి ఇదిలా ఉంటే దీనిపై మేజర్ హీరో అడివి శేష్ తన ట్వీటర్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘మేజర్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. చాలామంది చిన్నారులు నాకు ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని చెబుతున్నారు. చిన్నారుల నుంచి వస్తున్న స్పందన చూసి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వారి కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించాం. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నాం. ‘మేజర్’ గురించి రేపటి తరానికి తెలియాలనేదే మా లక్ష్యం’ అని అడవి శేష్ అన్నారు. Team #MajorTheFilm 🇮🇳 has some exciting news for all the children and schools ❤️ Witness the Life of Major Sandeep Unnikrishnan on Big Screens with 50% discount on tickets 💥💥 School management can write to majorscreening@gmail.com and register yourself for the special show. pic.twitter.com/VOmKYhgZXd — GMB Entertainment - MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 14, 2022 -
ఆర్జేగా అక్కినేని హీరో.. 'అహం రీబూట్' ఫస్ట్ గ్లిట్చ్ రిలీజ్
Sumanth Aham Reboot First Glitch Released: ఇటీవల మళ్లీ మొదలైంది సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు హీరో సుమంత్. తాజాగా సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లిట్చ్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ గ్లిట్చ్‌ను యంగ్ హీరో అడవి శేష్ ట్విటర్ వేదికగా రిలీజ్ చేస్తూ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. ఈ ఫస్ట్ గ్లిట్చ్లో హీరో సుమంత్ ఆర్జే నిలయ్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి ఒక అమ్మాయి కిడ్నాప్ అయినట్లు కాల్ చేస్తుంది. తనను ఒక డార్క్ రూమ్‌లో బంధించి ఉంచారని, త్వరలో తను చనిపోతున్నట్లు చెప్పుకొస్తుంది. ఆ యువతిని ఆర్జే నిలయ్ రక్షించాడా ? లేదా ? అనే కథాంశంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్సింగ్ చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తంగా ఈ ఫస్ట్ గ్లిట్చ్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. చదవండి: హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా Here is the mighty Interesting peek into the world of #AhamReboot starting my dear bro @iSumanth In recent years, love his novel attempts Aham Reboot First Glitch | Sumanth | Prashanth Sagar Atluri | Sri Ram Ma... https://t.co/heZi6yZTjJ via @YouTube pic.twitter.com/hqdgPICXGs — Adivi Sesh (@AdiviSesh) June 14, 2022 -
'మేజర్' సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్: చిరంజీవి
Chiranjeevi Appreciates Adivi Sesh Major Movie Team: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. అడివి శేష్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. అనురాగ్, శరత్ నిర్మించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. మేజర్ మూవీ అద్భుతంగా తీశారంటూ చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు జనాలు. తాజాగా ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన చిరంజీవి 'మేజర్' చిత్రబృందాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మేజర్ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక నిజమైన ఎమోషన్. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని హత్తుకునేలా సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీని మహేశ్‌బాబు నిర్మించినందుకు గర్వంగా ఉంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు. అని ట్వీట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మంచి సినిమాల గురించి చిరంజీవి ఎప్పుడూ మాట్లాడుతుంటారని, మేకర్స్‌ను ప్రోత్సహిస్తారని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల 'విక్రమ్' మూవీ విజయం సందర్భంగా కమల్ హాసన్‌ను చిరంజీవి సత్కరించిన విషయం తెలిసిందే. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్.. #Major is not a film.Its truly an Emotion Story of a great Hero & Martyr#MajorSandeepUnnikrishnan told in the most poignant way.A must-watch Proud of @urstrulyMahesh for backing such a purposeful film HeartyCongrats to @AdiviSesh @saieemmanjrekar #Sobhita @SashiTikka & Team pic.twitter.com/1lW1m3xmFO — Chiranjeevi Konidela (@KChiruTweets) June 13, 2022 -
మేజర్ సినిమాపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రశంసలు
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. అడివి శేష్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. అనురాగ్, శరత్ నిర్మించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. మేజర్ మూవీ అద్భుతంగా తీశారంటూ చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు జనాలు. తాజాగా మేజర్ యూనిట్ సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే మేజర్ సినిమాను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. మేజర్ ఒక మామూలు సినిమా కాదన్నారు. ఉగ్రదాడుల్లో ప్రజలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డేసిన మేజర్ జీవిత కథను వెండితెరపై తెరకెక్కించిన విధానానికి చప్పట్లు కొట్టాల్సిందేనన్నారు. We will be showing the film to the entire family in the next few days. Was an absolute delight to meet Shri @AUThackeray as well. Thank you #MaheshManjrekar ji for being the bridge for our efforts :) @CMOMaharashtra #MajorTheFilm🇮🇳❤️ — Adivi Sesh (@AdiviSesh) June 13, 2022 చదవండి: మాజీ భర్త మోసం చేస్తే సల్మాన్ సాయం చేశాడు హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా? -
మేజర్.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డేసిన హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఈ రియల్ హీరో జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. యువ కథానాయకుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. అనురాగ్, శరత్ నిర్మించిన ఈ మూవీ జూన్ 3న విడుదలవగా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. తొలి రోజే రూ.13.10 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.50.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసిన అడివి శేష్.. ఇది తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని రాసుకొచ్చాడు. తన గత సినిమాల కంటే మేజర్ మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందని సంతోషం వ్యక్తం చేశాడు. Our film inspired by #MajorSandeepUnnikrishnan has touched so many hearts. #Major has become the biggest blockbuster of my career x 3. And the journey to touch more hearts has just begun ❤️🇮🇳#IndiaLovesMAJOR My gratitude to god, the audience, the team and my producers. pic.twitter.com/blsYrmBBvx — Adivi Sesh (@AdiviSesh) June 10, 2022 A heartfelt note penned by the colleague of the great man 'Major Sandeep Unnikrishnan' after watching #MajorTheFilm 🇮🇳#IndiaLovesMAJOR 🇮🇳❤️@AdiviSesh @SashiTikka @urstrulyMahesh @sonypicsfilmsin @AplusSMovies @ZeeMusicCompany pic.twitter.com/ljWmoKd5nu — GMB Entertainment - MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 10, 2022 చదవండి: కిన్నెరసాని రివ్యూ సీక్రెట్‌గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన భర్త -
అవన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలు: ‘మేజర్’ దర్శకుడు శశికిరణ్ తిక్క
‘‘మేజర్’కి తెలుగులో అద్భుతమైన ఆదరణ వస్తోంది. బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. కమల్‌గారి ‘విక్రమ్, అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్విరాజ్’ చిత్రాలతో పోలిస్తే మాది చిన్న చిత్రం.. అయినా వాటితో పాటే ఆదరణ పొందడం హ్యాపీ. ‘మేజర్’కి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తి ఇచ్చింది’అని అన్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఆయన దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్. అనురాగ్, శరత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శశికిరణ్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ►మేజర్ సినిమా వాస్తవానికి 2020 లోనే విడుదల అవ్వాలి. 40 పర్సెంట్ షూటింగ్ కేవలం 3 నెలల్లో పూర్తి చేశాం. అదే వేగంతో చేసుకుంటూ వెళ్తే సినిమా వేగంగా ఫినిష్ అయ్యేది. ఇంతలో లాక్ డౌన్ వచ్చి పడటం వల్ల సినిమా ఆపేయాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్ మొదలుపెట్టే టైమ్ కు ప్రకాష్ రాజ్, రేవతి వంటి పెద్ద ఆర్టిస్టుల డేట్స్ దొరకలేదు. డబ్బింగ్ సహా మొత్తం పనులన్నీ అలా స్ట్రగుల్ పడి కంప్లీట్ చేశాం. ►ఈ చిత్రాన్ని మేము నిజాయితీగా తెరకెక్కించాం. కమర్షియాలిటీ కోసం కావాలంటే పాటలు, ఫైట్స్ పెట్టొచ్చు. కానీ మేము ఎక్కడా ఆ లైన్ క్రాస్ కాలేదు. కథను ఎంత హుందాగా, సహజంగా తెరకెక్కించాలో అదే పద్ధతిలో రూపొందిస్తూ వెళ్లాం. ►నాకు పేరు కంటే సంతృప్తి, గొప్ప సినిమా చేశామనే సంతోషం ముఖ్యం. ‘మేజర్’తో ఆ రెండూ నాకు దక్కాయి. నాకే పేరు రావాలనుకోను. నా సినిమాకు మంచి పేరొస్తే నాకు వచ్చినట్లే. ‘మేజర్’ చిత్రాన్ని నిజాయితీగా తెరకెక్కించాం. ►మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే సంతోషం మిగిలింది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్, రానా వంటి హీరోలు ఫోన్స్ చేసి సినిమా చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. మేజర్ సినిమా ప్రివ్యూ చూశాక సందీప్ వాళ్ల మదర్ నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. మేము ఎంత నిజాయితీగా పనిచేశామో ఆమె స్పందన ద్వారా తెలిసింది. ►ఇవాళ కొత్త దర్శకులకు ఇండస్ట్రీలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. సినిమా మీద ప్యాషన్ ఉండి, ఏదైనా మంచి కథ ఉంటే ఓటీటీల నుంచి, ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీ దగ్గరకు అవకాశాలు రావు మీరే సృష్టించుకోవాలి. యంగ్ ఫిలింమేకర్స్ కు నేను ఇదే చెప్పాలనకుంటున్నా. మా టైమ్ లో ఇంత టెక్నాలజీ లేదు, ఓటీటీ వేదికలు లేవు, స్క్రిప్టు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఇప్పటి వారికి ఎన్నో వేదికలు వస్తున్నాయి. ► ‘మేజర్’కు వచ్చిన పేరు, నాకు వచ్చిన గుర్తింపుతో ఇక నేను చేయబోయే సినిమాలు కూడా ఇంతే జాగ్రత్తగా చేయా లనుకుంటున్నాను. బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా తీయాలని ఉంది. నా తర్వాతి సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్లో ఉంటుంది. నా వద్ద అసిస్టెంట్‌గా చేసిన ఒకర్ని ‘గూఢచారి 2’ ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. అయితే ‘గూఢచారి’ ఫ్రాంచైజీలో ఓ సినిమాకు నేను దర్శకత్వం వహిస్తాను. (చదవండి: బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు) -
అలా అన్నందుకు సందీప్ తండ్రి చాలా సీరియస్ అయ్యారు : ‘మేజర్’ నిర్మాతలు
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. (చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్) అయితే ఇది సందీప్ బయోపిక్ కాబట్టి.. ఆయన తల్లిదండ్రులు రాయల్టీ కింద డబ్బులు తీసుకొవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై తాజాగా చిత్ర నిర్మాతలు అనురాగ్, శరత్ క్లారిటీ ఇచ్చారు. రాయల్టీ ఇస్తామని అంటే.. తన కొడుకు జీవితాన్ని వెలకట్టుకునే దీనస్థితిలో లేమని వారు చెప్పారన్నారు. ‘సాధారణంగా ఇలాంటి బయోపిక్‌లు తీస్తే..రాయల్టీ ఇవ్వాల్సి వస్తుంది. మేము కూడా సందీప్ పేరెంట్స్‌కు రాయల్టీ ఇస్తామని ముందుగానే చెప్పాం.అది వినగానే ‘గెటౌట్ ఫ్రమ్ మై హౌస్’ అంటూ సందీప్ తండ్రి మాపై ఫైర్ అయ్యారు. కొడుకు జీవితానికి వెలకట్టుకునే దీనస్థితిలో లేమని చెప్పారు. సందీప్ తల్లిదండ్రులు చాలా నిజాయితీ మనుషులు.సందీప్ చనిపోయాక..వచ్చిన ఎల్ఐసీ డబ్బులను కూడా వారు తీసుకోలేదు. సన్నిహితులకు ఆ డబ్బును పంచేశారు. అంత నిజాయితీపరులు వాళ్లు. అందుకే వారితో ఓ విషయం చెప్పాం. సైన్యంలో చేరాలనుకునే యువతకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పౌండేషన్ ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే మేం సందీప్ తల్లిదండ్రుకు ఇచ్చే రాయల్టీ’అని నిర్మాతలు చెప్పుకొచ్చారు. -
రియల్ హీరో ఉన్ని కృష్ణన్ పక్కన "రీల్ మేజర్" ను చూశారా? (ఫొటోలు)
-
మేజర్ తీసినందుకు గర్వంగా ఉంది: నిర్మాతలు అనురాగ్, శరత్
‘‘మేజర్’లాంటి గౌరవప్రదమైన సినిమా తీశాం. దేశమంతా మంచి పేరు వచి్చంది. ఈ సినిమాకు టైటిల్స్ చివర్లో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు కూర్చొని ఉన్నారంటేనే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క’’ అన్నారు నిర్మాతలు అనురాగ్, శరత్. అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్, శరత్ మాట్లాడుతూ– ‘‘మాకు ఛాయ్ బిస్కట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ అనే నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఫస్ట్ షో మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా 200 సినిమాలు మార్కెటింగ్ చేశాం. ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడివి శేష్ చెప్పాడు. నమ్రతగారికి కూడా ఈ కథ నచ్చడంతో మాతో భాగమయ్యారు. ‘మేజర్’ని తెలుగు, హిందీలోనే తీద్దామనుకున్నాం. కేరళలో ఉండే సందీప్ తల్లిదండ్రులను కలిశాక మలయాళంలోనూ డబ్ చేశాం. సందీప్ తల్లిదండ్రులకు రాయల్టీ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నా వారు తిరస్కరించారు. ఆర్మీలో చేరాలనుకున్నవారికి తగిన సపోర్ట్‌గా నిలిచేలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫౌండేషన్ అనే సోషల్ మీడియా వేదిక నెలకొల్పాలనుకున్నాం. అదే మేం వారి తల్లిదండ్రులకు ఇచ్చే రాయలీ్ట. ‘రైటర్ పద్మభూషణ్, మేం ఫేమస్’ సినిమాలు నిర్మించాం. తొట్టెంపూడి వేణు లీడ్ రోల్లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు.


