ఆ తపన ఎప్పుడూ ఉంటుంది | Adivi Sesh Hit 2 to release on 2 December 2022 | Sakshi
Sakshi News home page

ఆ తపన ఎప్పుడూ ఉంటుంది

Nov 4 2022 4:42 AM | Updated on Nov 4 2022 4:42 AM

Adivi Sesh Hit 2 to release on 2 December 2022 - Sakshi

‘‘మంచి సినిమా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. కోవిడ్‌ సమయంలో ‘హిట్‌ 2’ చేయటానికి టీమ్‌ ఎంతో కష్టపడింది. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అని అడివి శేష్‌ అన్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో అడివి శేష్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘హిట్‌ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మించారు. డిసెంబర్‌ 2న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ని గురువారం విడుదల చేశారు.

అడివి శేష్‌ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారు ‘మేజర్‌’, నాని ‘హిట్‌ 2’ సినిమాలు నాతో నిర్మించడం హ్యాపీ. ‘హిట్‌ 2’ రిలీజ్‌ కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘హిట్‌’తో హిట్‌ సాధించాం. ‘హిట్‌ 2’ని స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ప్రశాంతి త్రిపిరనేని. ‘‘క్రైౖమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ 2’. అడివి శేష్‌ పర్‌ఫెక్ట్‌ జెంటిల్‌మేన్‌.. సెట్స్‌లో ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. నేను ఇక్కడ ఉండటానికి కారణం నానీగారే.. ఆయనకు థ్యాంక్స్‌’’ అన్నారు శైలేష్‌ కొలను. సినిమాటోగ్రాఫర్‌ మణికందన్‌ .ఎస్, ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్, హీరోయి¯Œ  కోమలీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
∙మీనాక్షీ చౌదరి, అడివి శేష్, ప్రశాంతి, శైలేష్‌

Advertisement
 
Advertisement
Advertisement