Adivi Sesh In Part Of Akkineni Family To Celebrate Christmas, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Adivi Sesh: అక్కినేని ఫ్యామిలీలో అడివి శేష్‌.. వైరల్‌గా మారిన ఫోటో

Dec 26 2022 2:26 PM | Updated on Dec 26 2022 3:35 PM

Adivi Sesh Is Part Of Akkineni Family To Celebrate Christmas - Sakshi

క్రిస్మస్‌ పండగను సెలబ్రిటీలు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో కలిసి ఒకచోట చేరి క్రిస్మస్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడమే కాదు, ఆ ఫోటోలని  అఖిల్‌ అక్కినేని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక అక్కినేని ‍ఫ్యామిలీలో కూడా క్రిస్మస్‌ వేడకలను ఘనంగా నిర్వహించారు. అఖిల్‌, సుమంత్‌లతో పాటు మరికొంత మంది కజిన్స్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. కానీ నాగచైతన్య మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు.

ఇక తమ సెలబ్రేషన్స్‌ ఫోటోలను అఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కాసేపట్లోనే ఆ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. హీరో అడివి శేష్‌ అక్కడ కనిపించడం హాట్‌టిపిక్‌గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీలో శేష్‌ ఎందుకు ఉన్నాడంటూ పలు రూమర్స్‌ తెరమీదకి వస్తున్నాయి. ఇక పార్టీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు 'థ్యాంక్స్ అఖిల్ బ్రో' అంటూ శేష్‌ కామెంట్‌ చేయడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.  

Advertisement
 
Advertisement
Advertisement