
అడివి శేష్.. క్షణం, గూఢచారి, మేజర్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ 2022లో వచ్చిన 'హిట్ 2' తర్వాత హీరోగా మరో సినిమా చేయలేదు. దాదాపు మూడేళ్లుగా కనిపించలేదు. కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' మూవీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది క్రిస్మస్‌కి థియేటర్లలోకి రానుంది. మరోవైపు చాన్నాళ్లుగా సెట్స్‌పై ఉన్న 'గూఢచారి 2' గురించి కూడా అప్‌డేట్ ఇచ్చారు.
(ఇదీ చదవండి: హీరోకి మెల్లకన్ను ఉంటే.. 'శ్రీ చిదంబరం' గ్లింప్స్ రిలీజ్)
2018లో రిలీజైన 'గూఢచారి' సూపర్ హిట్ అయింది. దానికి కొనసాగింపుగా తీస్తున్న సీక్వెల్ మాత్రం చాలా కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తోంది. తొలుత బనిత సంధు అనే హీరోయిన్ అనుకున్నారు. ఏమైందో గానీ ఆమెని తీసేసి బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బిని పెట్టుకున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూడు పోస్టర్స్ రిలీజ్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. వినయ్ కుమార్ దర్శకుడు. 'గూఢచారి' కథ మొత్తం భారతదేశంలోనే జరగ్గా.. ఈ రెండో భాగం అంతర్జాతీయంగా ఉండనుంది. తొలి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు ఈ రెండో భాగంలో పరిచయం కానున్నాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు)
