చెల్లి హల‍్దీ ఫంక్షన్‌లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. సోషల్ మీడియాలో వైరల్ | Sakshi
Sakshi News home page

Adivi Sesh: చెల్లి హల‍్దీ ఫంక్షన్‌లో యంగ్ హీరో అడివి శేష్ సందడి.. సోషల్ మీడియాలో వైరల్

Published Tue, Jan 24 2023 3:12 PM

Young Hero Adivi Sesh Attends His Sister Marriage Today - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల హిట్‌-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శేష్‌ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి -2’లో అడివి శేష్ కనిపించనున్నారు.

(ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్)

‍అయితే తాజాగా చెల్లి హల్దీ వేడుకలో సందడి చేశారు యంగ్ హీరో. తన చెల్లెలు షిర్లీ అడివి హల్దీ వేడుకలో పాల్గొన్న అడివి శేష్ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. తన బేబీ చెల్లి హల్దీ ఫంక్షన్‌ ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్‌గా మారాయి. 

అడివి శేష్ తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ..'అమ్మ, నేను, సోదరి హల్దీ ఫంక్షన్‌లో సరదాగా కలిసి సందడి చేశాం. ఈ రోజు బావ డేవిన్‌ను మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో అడివి శేష్‌ను చూసిన అభిమానులు అన్నా.. నీ పెళ్లేప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా హీరో చెల్లెలికి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement