Adivi Sesh Recalls He Cried In Frustration When Major Set Was Being Broken For A Hindi Movie Shoot - Sakshi
Sakshi News home page

Adivi Sesh: ఏం చేయాలో తెలియక బోరున ఏడ్చేశా: అడివి శేష్‌

Dec 21 2022 9:36 PM | Updated on Dec 22 2022 8:41 AM

Hero Adivi Sesh Reveals Major Movie Shooting Sets In  Studio - Sakshi

ఈ ఏడాది టాలీవుడ్ చిత్రాల్లో భారీ హిట్ చిత్రాల్లో యంగ్ హీరో అడివి శేష్ మూవీ 'మేజర్‌' ఒకటి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అడివి శేష్‌ మేజర్ సినిమాలోని‌ క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ కోసం 'మేజర్‌' సెట్‌ తొలగించాలని చెప్పగానే చాలా బాధపడ్డానని చెప్పారు. 

అడివి శేష్ మాట్లాడుతూ.. 'మా సినిమా షూటింగ్‌ జరుగుతున్న స్టూడియోను ఓ బాలీవుడ్‌ చిత్రయూనిట్‌ బుక్‌ చేసుకుంది. మేజర్‌ సినిమాలో అగ్నిప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించడంతో నేను అస్వస్థతకు గురయ్యా. అందువల్ల షూటింగ్‌ కాస్త ఆలస్యమైంది. స్టూడియో వాళ్లు మా సెట్‌ను కూల్చేయడానికి రెడీ అయ్యారు. వాళ్లని కాస్త టైం ఇవ్వాలని అడిగినా ఒప్పుకోలేదు. క్లైమాక్స్‌లో దాదాపు ఎనిమిది సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. కేవలం 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఏడ్చేశా.' అని అన్నారు. 

ఆ సమయంలో దర్శకుడు శశికిరణ్‌ నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు ఏ భావోద్వేగానికి లోనవుతున్నారో అదే కెమెరా ముందు చూపించమని సూచించారని తెలిపారు. రెండు కెమెరాలతో సన్నివేశాలను అనుకున్న సమయానికే పూర్తిచేశామని వెల్లడించారు. ఈ ఏడాది అడివి శేష్‌ నటించిన హిట్‌-2 సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement