
అశ్విని శ్రీ (Ashwini Sree).. పలు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసినా రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొన్న ఈమె షోకు గ్లామర్ అద్దింది. ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో అశ్విని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ డ్యాన్స్ షోలో హీరో అడివి శేష్ గెస్టుగా రావడాన్ని చూసి ఈ బిగ్‌బాస్ బ్యూటీ సర్‌ప్రైజ్ అయింది. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని శేష్‌కు చెప్పింది.
అక్కను పెళ్లి చేసుకుంటే..
అందుకా హీరో.. నాక్కూడా మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని బదులిచ్చాడు. అప్పుడు అశ్విని.. మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది. అంటే అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను అనేసరికి శేష్ నోరెళ్లబెట్టాడు. అయితే ఎలా వస్తాననేది కూడా చెప్తాననేసరికి హీరో నవ్వుతూనే సరేనని బదులిచ్చాడు. సదరు డ్యాన్స్ షో ప్రోమోలో ఇంతవరకే చూపించారు. ఏదేమైనా అశ్విని మాట్లాడిన తీరుకు అక్కడున్న జనం నవ్వాపుకోలేకపోయారు. ఇలా ట్విస్టులు ఇచ్చుకుంటూ మాట్లాడేబదులు అసలు విషయమేంటో డైరెక్ట్‌గా చెప్పొచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: 11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. రెండో జన్మ ఎత్తిన సింగర్!