అడివిశేష్‌తో జోడీ కట్టనున్న శృతి హాసన్‌ | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ సెట్‌.. అడివి శేష్‌తో జోడీ కట్టనున్న సలార్‌ బ్యూటీ

Published Wed, Dec 13 2023 12:31 AM

Combination of Adivi Sesh and Shruti Haasan - Sakshi

అడివి శేష్, శ్రుతీహాసన్‌ ప్రధాన పాత్రధారులుగా ఓ యాక్షన్‌ డ్రామా తెరకెక్కనుంది. అడివి శేష్‌ హీరోగా నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్‌ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు షాన్‌ దర్శకత్వం వహించారు.

శేష్, శ్రుతి కాంబినేషన్‌లో ఆయన దర్శకత్వం వహించనున్న తాజా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి సీన్, డైలాగ్‌లను హిందీతో పాటు తెలుగులో కూడా చిత్రీకరించనున్నాం. ప్రతి భాషకు ఉన్న ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ సినిమాను విభిన్నంగా చేస్తున్నాం. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్‌ నారంగ్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement