Director Sekhar Kammula Interesting Comments At Mahaveerudu Pre Release Event, Deets Inside - Sakshi
Sakshi News home page

Mahaveerudu Movie: 'మహావీరుడు'ని తెలుగువారు ఇష్టపడతారు: అడివి శేష్‌

Jul 10 2023 3:37 AM | Updated on Jul 10 2023 11:17 AM

Director Sekhar Kammula Speech at Mahaveerudu pre release event - Sakshi

శేఖర్‌ కమ్ముల, మడోన్‌ అశ్విన్, అదితీ శంకర్, శివ కార్తికేయన్, అడివి శేష్, సునీల్‌ నారంగ్‌

'మహావీరుడు’ సినిమా ట్రైలర్, విజువల్స్‌ గొప్పగా ఉన్నాయి. ఈ మూవీలో గ్రేట్‌ వైబ్‌ కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల అన్నారు. శివ కార్తికేయన్‌ హీరోగా ‘మండేలా’ ఫేమ్‌ మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మహావీరన్‌’. అదితీ శంకర్‌ హీరోయిన్‌. శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మించారు. ఈ సినిమాని ఏషియన్‌ సినిమాస్‌ ఈ నెల 14న తెలుగులో విడుదల చేస్తోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి హీరో అడివి శేష్, శేఖర్‌ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడివి శేష్‌ మాట్లాడుతూ–'నా గురువు శేఖర్‌ కమ్ముల ముందు మాట్లాడటం గౌరవంగా ఉంది. శివ కార్తికేయన్‌తో పని చేయాలని ఉంది' అన్నారు.  'రెమో, వరుణ్‌ డాక్టర్, కాలేజ్‌ డాన్‌’ సినిమాల్లా ‘మహావీరుడు’ ని తెలుగువారు ఇష్టపడతారు' అన్నారు శివ కార్తికేయన్‌. ‘‘మహావీరుడు’ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మడోన్‌ అశ్విన్‌. ‘‘మా అమ్మగారి పేరుతో ఈ సంస్థ మొదలుపెట్టి, శివ కార్తికేయన్‌తో తొలి మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు అరుణ్‌ విశ్వ. 

Advertisement
 
Advertisement
Advertisement