అప్పుడు మేజర్.. ఇప్పుడు డెకాయిట్.. మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్ | Adivi Sesh Dacoit Movie Ticket Price Reduced | Sakshi
Sakshi News home page

Dacoit Movie: డెకాయిట్ టీమ్ గుడ్‌ న్యూస్.. భారీగా టికెట్ ధరల తగ్గింపు

Apr 23 2026 3:56 PM | Updated on Apr 23 2026 4:14 PM

Adivi Sesh Dacoit Movie Ticket Price Reduced

టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.  మొదటిరోజు అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ.. ఇప్పటికీ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.
  
తాజాగా డెకాయిట్ మూవీ టీమ్ గుడ్ న్యూస్‌ చెప్పింది. సినీ ప్రియులకు ఊరట కల్పించేలా టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్‌లో షేర్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తగ్గించారు. ఏపీలోని సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105, రూ.70గా ధరలు నిర్ణయించారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105, రూ.80, రూ.50గా ఖరారు చేశారు. టీజీలోని అన్ని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రం రూ.150గా ఫిక్స్ చేశారు. తగ్గించిన ధరలు ఈనెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాగా.. గతంలో మేజర్ సినిమాకు కూడా ఇదే తరహాలో టికెట్ ధరలు తగ్గించారని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

దీంతో డెకాయిట్ మూవీని థియేటర్లలో చూడాలనుకున్నావారికి అదిరిపోయే గుడ్ న్యూస్‌ చెప్పారు. ఈ మూవీని  సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌ నిర్మించారు. ఈ చిత్రంలో ఠాకూర్‌, అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement