అడివి శేష్‌కు ఛాలెంజ్‌ విసిరిన హైదరాబాద్‌ సీపీ | Hyderabad CP Anand Who Challenged Actor Adivi Sesh | Sakshi
Sakshi News home page

అడివి శేష్‌కు ఛాలెంజ్‌ విసిరిన హైదరాబాద్‌ సీపీ

Jun 25 2023 11:19 AM | Updated on Jul 1 2023 6:00 PM

Hyderabad CP Anand Who Challenged Actor Adivi Sesh - Sakshi

జూన్‌ 23న ఒలింపిక్‌డే సందర్భంగా  హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ పలువురి సెలబ్రిటీలకు ఇలా ఛాలెంజ్‌ విసిరారు. 'మన జీవితాలు ఎప్పుడూ ఆందోళనకరమైనవిగానే కొనసాగుతాయి. మునుపెన్నడూ లేనంత వేగంగా కదులుతున్న ఈ ప్రపంచంలో, ప్రజలు మాత్రం శారిరక వ్యాయామం లేకుండా ఉండటం  చూస్తుంటే కలవరపెడుతుంది. అంతేకాకుండా చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పిల్లలు, యువకులు తమ సెల్ ఫోన్‌లతో పాటు ఇతర డిజిటల్ గాడ్జెట్‌లకు అంకితమవుతున్నారు. అవి వారిని  కట్టిపడేశాయి. దాంతో వారు అస్సలు కదలరు.' అని తెలిపారు. 

(ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!)

ఈ ఒలింపిక్‌డే నుంచి అయినా వారిని మేలుకొల్పాలని తను వ్యాయామం చేసిన వీడియోను మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌,పీవీ సింధు, యాక్టర్‌ అడివి శేష్, నిఖల్‌కు ట్యాగ్‌ చేసి, ఇలాంటి వర్కౌట్స్‌ చేయాలని వారికి ఛాలెంజ్‌ విసిరారు. తాజాగా సినీ నటుడు అడివి శేష్ చేసిన వ్యాయామం వీడియోను సీపీ ఆనంద్‌కు షేర్‌ చేశాడు. త్వరలో మరింత ఫిట్‌నెస్‌తో తమను రీచ్‌ అవుతానని ఆయన అన్నాడు.

(ఇదీ చదవండి: రానా నాయుడులో దుమ్ములేపిన భామ గురించి ఈ విషయాలు తెలుసా?)

అందుకు తిరిగి సీపీ ఆనంద్‌ ఇలా అన్నారు. 'ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు ధన్యవాదాలు అడివి శేష్ ! మీ నిమాల్లో స్మార్ట్ లుక్‌తో ఉంటారు. నేను పోటీ పడలేను, అంతే కాదు కష్టం కూడా' అని సీపీ ఆనంద్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement