
అడివి శేష్ నటిస్తోన్న తాజా చిత్రం ' డకాయిట్'. ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామెన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ఇందులో అడివి శేష్ సరసన హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటించింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా ఈ మూవీ నుంచి ఫైర్ థీమ్(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) రిలీజ్ చేశారు. ఈ ఫైర్ థీమ్‌ను భీమ్స్ సిసిరోలియో పవర్‌ఫుల్‌గా కంపోజ్ చేశారు. ఇక ఆడియన్స్‌కి ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది. అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఈ క్రిస్‌మస్ కానుకాగ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
Put on your headphones and enjoy the musical fire 🔥🎧#DACOITFire Glimpse OST now streaming on all platforms ❤🔥
▶️ https://t.co/cEqYoQldqu#DACOIT IN CINEMAS WORLDWIDE ON DECEMBER 25th 💥#DacoitFromDec25th@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 @Deonidas… pic.twitter.com/8DaP6zD1WH— Annapurna Studios (@AnnapurnaStdios) June 3, 2025