
టాలీవుడ్ హీరో రానా ఈ ఏడాదిలో రానా నాయుడు వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. వెంకటేశ్- రానా కాంబోలో వచ్చిన ఈ సిరీస్‌కు మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా రానా సమర్పణలో వస్తోన్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రానాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ ఫేవరేట్ సినిమాల్లో టాప్-5 ఏంటని యాంకర్ రానాను అడిగింది. ఈ ప్రశ్నకు రానా తనకిష్టమైన చిత్రాల పేర్లను వెల్లడించారు. మొదటిది స్టార్ వార్స్ అని.. ఆ తర్వాత కమల్ హాసన్ నాయకన్, స్కార్ఫేస్, గ్లాడియేటర్, లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బారెల్స్ అని హాలీవుడ్ సినిమాల పేర్లను ప్రస్తావించారు. అయితే టాప్-5లో ఒక్క తెలుగు మూవీ కూడా లేకపోవడం విశేషం. రానా చెప్పిన సినిమాల్లో కోలీవుడ్ హీరో కమల్ హాసన్ మూవీ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రానా కూడా కమల్ హాసన్ అభిమాని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.
#RanaDaggubati and #PraveenaParuchuri
Share their #imdb top 5 list
In Rana's list just one Indian film that is #Nayakan Even in Praveena's list Nayakan is there
Just Aandavar admiration things ❤️#KamalHaasan#ManiRatnam#KothapalliloOnJuly18pic.twitter.com/fZxzHei0SK— Kamal Abimaani (@Kamalabimaani1) July 17, 2025