
ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్ అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ గేమ్ సిరీస్కు ఓటీటీ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతలా ఆకట్టుకున్న ఈ వెబ్ సిరిస్లో మన తెలుగు తారలు నటిస్తే ఎలా ఉంటుంది. ఒకసారి మీరే ఉహించుకోండి. అలా అనుకుని ఏఐతో క్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మన టాలీవుడ్ సినీతారలు స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో ఊహించుకుని చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో బాలకృష్ణ, అనసూయ, రాజీవ్ కనకాలను చూపించారు. ఈ వీడియో చూస్తే ఫన్నీగా ఉండడంతో తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ వీడియోలో బాలయ్య నటిస్తోన్న అఖండ-2 చిత్రంలోని ఫైట్ సీన్ను కూడా రీ క్రియేట్ చేశారు. అందరినీ బాలయ్య ఒక్క దెబ్బకు పైకి విసిరేయడం చూస్తే బాలయ్య సినిమాల్లో పైట్ సీన్ను గుర్తుకు తెచ్చింది. కాగా.. ఇప్పటికే పలువురు తారలపై ఇలాంటి ఏఐ వీడియోలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. స్క్విడ్‌గేమ్‌లో హీరో నంబర్ 456.. ఏఐ వీడియోలో కూడా బాలకృష్ణ ప్లేయర్ నెం.456గా కనిపించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ సరదా వీడియో మీరు కూడా చూసేయండి.
— Out of Context Telugu (@OutOfContextTel) July 17, 2025