
తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన దర్శదధీరుడు రాజమౌళిదే. ఆయన డైరెక్షన్లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు ప్రపంచస్థాయిలో మనసత్తా చాటాయి. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్ గెలుపుతో మరోసారి వరల్డ్ వైడ్‌గా తెలుగు సినిమా పేరు వినిపించేలా చేసింది. ఇంత ఘనత తీసుకొచ్చిన రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’(Baahubali: The Epic) పేరుతో మరోసారి రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల రాబోతుందని రాజమౌళి ప్రకటించారు. కాగా.. బాహుబలి చిత్రంలో ప్రభాస్తో పాటు రానా కీలక పాత్రలో కనిపించారు.
అయితే తాజాగా బాహుబలి టీమ్ ప్రశ్నకు హీరో రానా ఇచ్చిన సమాధానం నెట్టింట తెగ వైరలవుతోంది. ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగి ఉండేదని ట్విటర్ వేదికగా టీమ్ ప్రశ్నించింది. ఇది చూసిన హీరో రానా స్పందించాడు. కట్టప్ప ఆ పని చేయకపోతే.. నేను బాహుబలిని చంపేసేవాడినని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ భళ్లాల దేవ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాహుబలి విషయానికొస్తే.. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం లిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది. బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.
I would have killed him instead 😡🥂 https://t.co/8oe6qUZP9l
— Rana Daggubati (@RanaDaggubati) July 16, 2025