'థగ్‌ లైఫ్‌ ఆడకూడదు అంటూ వార్నింగ్‌' | Thug Life Movie Issue In Karnataka | Sakshi
Sakshi News home page

'థగ్‌ లైఫ్‌ ఆడకూడదు అంటూ వార్నింగ్‌'

Jun 3 2025 8:47 AM | Updated on Jun 3 2025 10:08 AM

Thug Life Movie Issue In Karnataka

తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌పై కర్ణాటక వ్యాప్తంగా వ్యతిరేకత అధికమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా థగ్‌ లైఫ్‌ను కర్ణాటకలో విడుదల చేయకండి అంటూ కన్నడ సంఘాలు హెచ్చరించాయి.  ఒక్క థియేటర్‌లో సినిమా ఆడినా బెంగళూరును బంద్‌ చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక నాయకులు తెలిపారు. ఈ సినిమా జూన్‌ 5న దేశమంతటా విడుదల అవుతోంది. కమల్‌ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్‌ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్ని ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్‌ సినిమా ఎట్టిపరిస్థితిల్లోనూ ఇక్కడ రన్‌ చేసేది ఉండదని వారు పేర్కొన్నారు. 

కమల్‌ని అరెస్టు చేయాలి 
కమల్‌ హాసన్‌ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చళువళి పోరాటదారుడు  వాటాల్‌ నాగరాజు, సంఘాల నేతలు కమల్‌ చిత్రానికి నిప్పుపెట్టారు. కమల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటాల్‌ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్‌ హాసన్‌ సినిమాలను పూర్తిగా బహిష్కరణ చేయాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్‌ సినిమాలను వ్యతిరేకించాలని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement