మనసు నీకై రథమయ్యే రారా... | Visvada Naayakaa Song From Thug Life Released | Sakshi
Sakshi News home page

మనసు నీకై రథమయ్యే రారా...

Jun 3 2025 12:14 AM | Updated on Jun 3 2025 12:14 AM

Visvada Naayakaa Song From Thug Life Released

కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. శింబు, త్రిష, అభిరామి, నాజర్‌ ఇతర ప్రధానపాత్రలు పోషించారు. రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్, మద్రాస్‌ టాకీస్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 5నపాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌ రెడ్డి రిలీజ్‌ చేస్తున్నారు.

ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘విశ్వద నాయక...’ అంటూ సాగే నాలుగోపాటని విడుదల చేశారు. ‘విశ్వద నాయక.. విహిత వీరా... మనసు నీకై.. రథమయ్యే రారా...’ అంటూ ఈపాట సాగుతుంది. ‘‘ఈపాటలో కమల్‌హాసన్‌ క్యారెక్టర్‌ నేచర్, అభిరామి, త్రిషపాత్రల్లోని డైనమిక్స్‌ని లిరిక్‌ రైటర్‌ అనంత శ్రీరామ్‌ అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు. ప్రశాంత్‌ వెంకట్‌ రాసిన ర్యాప్‌ ఈపాటకు మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అలెగ్జాండ్రా జాయ్‌ వండర్‌ ఫుల్‌ వోకల్స్‌ ఎమోషన్‌ని నావిగేట్‌ చేయగా, ఏఆర్‌ అమీన్‌ ర్యాప్‌ ఎనర్జీని మరింతగా పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement