Megastar Chiranjeevi Takes Key Decision for His Daughter Sushmita Konidela - Sakshi
Sakshi News home page

పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!

Jun 25 2023 10:12 AM | Updated on Jun 25 2023 10:58 AM

Megastar Chiranjeevi's shocking decision for his daughter Sushmita Konidela - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. వాల్తేరు వీరయ్యతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న చిరు.. అదే జోష్‌లో మాస్‌ సినిమాలు చేసేందుకు సి​ద్దమయ్యాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘భోళా శంకర్‌’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్ట్‌ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం రిలీజైన తర్వాత ఓకేసారి రెండు సినిమాలను అనౌన్స్‌ చేసేందుకు సిద్ధమయ్యాడట చిరంజీవి.

అందులో మొదటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఆ తర్వాత బింబిసార ఫేమ్‌ వశిష్ట డైరెక్షన్‌లో మరో మూవీ చేయబోతున్నాడు. ఇదే క్రమంలో తన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల కెరీర్‌ని కూడా గాడిలో పెట్టేందుకు సిద్దమయ్యారట చిరంజీవి. ఆ మధ్య సుష్మిత నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఓటీటీ కోసం ఓ వెబ్‌ సిరీస్‌తో పాటు సంతోష్‌ శోభన్‌ హీరోగా ఓ సినిమాను కూడా నిర్మించింది. అయితే ఆ రెండూ కూడా డిజాస్టర్‌గా మిగిలాయి.

(చదవండి: భోళా శంకర్‌ టీజర్‌: హద్దుల్లేవ్‌, సరిహద్దుల్లేవ్‌.. చిరు మాస్‌ డైలాగ్స్‌)

దీంతో నిర్మాతగా అడుగుపెట్టిన సుష్మితకు ఆదిలోనే అపజయాలు ఎదురయ్యాయి.  ఎలాగైన తన కూతురిని నిర్మాతగా నిలబెట్టాలని భావిస్తున్నారట చిరంజీవి. అందుకే తన తదుపరి సినిమాను కూతురి నిర్మాణ సంస్థలోనే చేయనున్నారట. ఇప్పటికే ‘సైరా’తో తన కొడుకు రామ్‌ చరణ్‌ని నిర్మాతగా పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు కూతురికి కూడా తన సినిమాతో ఓ సూపర్‌ హిట్‌ అందించి,పెద్ద ప్రొడ్యూసర్ గా చేయాలని నిర్ణయించుకున్నాడట. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో చిరు నటించబోయే సినిమాకు సుష్మితనే నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభించి, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదికి సంకాంత్రికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఆ తర్వాత వశిష్ట డైరెక్షన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నాడు చిరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement