Chiranjeevi Bholaa Shankar Teaser Out Now - Sakshi
Sakshi News home page

Bholaa Shankar Teaser: షికారుకు వచ్చిన షేర్‌నంటూ చిరంజీవి ఊర మాస్‌ డైలాగ్స్‌

Jun 24 2023 6:12 PM | Updated on Jun 24 2023 7:00 PM

Chiranjeevi Bholaa Shankar Teaser Out Now - Sakshi

మొత్తం 33 మందిని చంపేశాడు. ఒక్కడు.. ఏకాకి.. హౌ? కోన్‌ హై తూ?' అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. విలన్‌ ప్రశ్నకు తన మేనరిజంలో ఆన్సరిచ్చాడు చిరు. షికారుకు వచ్చిన షేర్‌ను బే అంటూ మాస్‌ డైలాగ్‌లు పలికాడు.

చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భోళా శంకర్‌. శనివారం(జూన్‌ 24న) ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదలైంది. 'మొత్తం 33 మందిని చంపేశాడు. ఒక్కడు.. ఏకాకి.. హౌ? కోన్‌ హై తూ?' అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. విలన్‌ ప్రశ్నకు తన మేనరిజంలో ఆన్సరిచ్చాడు చిరు. షికారుకు వచ్చిన షేర్‌ను బే అంటూ మాస్‌ డైలాగ్‌లు పలికాడు. టీజర్‌లో కీర్తి సురేశ్‌, తమన్నా, సుశాంత్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ వీడియోలో యాక్షన్‌ సీన్లు మరో లెవల్‌లో ఉన్నాయి. చివర్లో 'ఈ స్టేట్‌ డివైడ్‌ అయినా అందరూ నావాళ్లే.. ఆల్‌ ఏరియాస్‌ ఆప్నా హై.. నాకు హద్దుల్లేవ్‌, సరిహద్దుల్లేవ్‌' అన్న చిరంజీవి డైలాగ్‌తో టీజర్‌ ముగిసింది.  

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తమన్నా చిరుతో జోడీ కట్టగా, కీర్తి సురేశ్‌ అతడికి చెల్లిగా నటించింది. ఏకే ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికిపాటి, సంగీతదర్శకుడు: మహతి స్వర సాగర్‌. 

చదవండి: పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్‌ విలన్‌

Advertisement
 
Advertisement
Advertisement