వినోదాల జడి | Jadi telugu glimpse released | Sakshi
Sakshi News home page

వినోదాల జడి

Oct 24 2026 4:48 AM | Updated on Oct 24 2026 4:48 AM

Jadi telugu glimpse released

‘జడి’పోస్టర్

సైలేంద్ర సమంత రాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్‌ హోతా ప్రధానపాత్రల్లో నటించిన ఒడియా చిత్రం ‘జడి’. దిబ్య జ్యోతి ఉదయ సింగ్‌ రచన, దర్శకత్వంలో కాజల్‌ రే నిర్మించిన ఈ చిత్రం ఒడియాలో ఘన విజయం సాధించింది. ఈ మూవీని మెగా ప్రోడక్షన్స్‌ అధినేత ఉడుగుల అశ్విని కుమార్‌ గౌడ్‌ త్వరలోనే తెలుగులో విడుదల చేయనున్నారు.

ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘కామెడీ క్రైమ్‌ డ్రామాగా రూపొందిన చిత్రం ‘జడి’. ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. దిబ్య జ్యోతి ఉదయ సింగ్‌ గ్రామీణ వాతావరణం, యువత స్నేహాలు, ప్రేమ, సంఘర్షణలను సహజంగా తెరపై ఆవిష్కరించారు. తెలుగు వెర్షన్‌కు రాకేందు మౌళిపాటలు, మాటలు రాశారు’’ అని మేకర్స్‌ వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement