Nani, Adivi Sesh Talk About Hit 2 Movie - Sakshi
Sakshi News home page

అర్జున్‌ సర్కార్‌ సైనింగ్‌ ఆఫ్‌..మళ్లీ కలుద్దాం: నాని

Dec 6 2022 9:20 AM | Updated on Dec 8 2022 12:44 PM

Nani, Adivi Sesh Talk About Hit 2 Movie - Sakshi

‘‘కష్టపడి ప్రిపేర్‌ అయ్యే బ్యాచ్‌లో శేష్‌ ఉంటాడు. నేను కాపీ కొట్టి పాస్‌ అయ్యే బ్యాచ్‌లో ఉంటాను. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను. శేష్‌ లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా హిట్స్‌ సాధిస్తున్నాడు. మంచి చిత్రాలు తీస్తే చూస్తాం అని ప్రేక్షకులు మరోసారి నిరూపించినందుకు థ్యాంక్స్‌. అర్జున్‌ సర్కార్‌ సైనింగ్‌ ఆఫ్‌ (హిట్‌ 3ని ఉద్దేశించి).. మళ్లీ కలుద్దాం.. గట్టిగా కలుద్దాం’’ అని హీరో నాని అన్నారు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్‌ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న రిలీజైంది.

ఈ సందర్భంగా విజయోత్సవంలో అడివి శేష్‌ మాట్లాడుతూ – ‘‘హిట్‌ 2’ రిలీజ్‌ తర్వాత మహేశ్‌బాబుగారు ఫోన్‌ చేసి, ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను.. అన్నలా అండగా ఉంటాను’ అంటే కంట్లో నీళ్లు తిరిగాయి’’ అన్నారు. ‘‘మల్టీప్లెక్స్‌ల్లోనే కాదు.. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లోనూ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అన్నారు శైలేష్‌ కొలను. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ, నటి కోమలీ ప్రసాద్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement