అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్‌ | Adivi Sesh Reveals He Changed His Name Because Of Sunny Leone, Know Reason Inside | Sakshi
Sakshi News home page

Adivi Sesh: మా నాన్నకు ఇష్టమని ఆ పేరు పెడితే ఏడిపించారు.. మార్చేసుకున్నా!

Published Fri, Jun 21 2024 11:37 AM | Last Updated on Fri, Jun 21 2024 12:51 PM

Adivi Sesh reveals He Changed His Name Because of Sunny Leone

గూఢచారి, హిట్‌ 2, ఎవరు? మేజర్‌ సినిమాలతో అడివి శేష్‌ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ హీరో గూఢచారి 2, డెకాయిట్‌ సినిమాలు చేస్తున్నాడు. అందులో హీరోగా నటించడమే కాకుండా ఈ రెండు చిత్రాలకు రచయితగానూ వ్యవహరిస్తున్నాడు. డెకాయిట్‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్‌ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలోని ప్రతి సీన్‌, డైలాగ్‌ను హిందీతోపాటు తెలుగులోనూ చిత్రీకరిస్తున్నారు.

అసలు పేరు ఇదీ!
ఈ సినిమాలతో బిజీగా ఉన్న అడివి శేష్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన అసలు పేరును బయటపెట్టాడు. తన ఒరిజినల్‌ నేమ్‌ సన్నీ చంద్ర అని చెప్పాడు. అమెరికాలో ఉన్నప్పుడు నా పేరు చూసి అందరూ ఏడిపించేవారు. అక్కడ ఆరెంజ్‌ ఫ్లేవర్‌లో సన్నీ డిలైట్‌ అని ఓ జ్యూస్‌ ఉండేది. అలాగే అప్పట్లో సన్నీలియోన్‌ చాలా పాపులర్‌.

ఏడిపించారు
నా పేరులో సన్నీ ఉండటంతో అందరూ టీజ్‌ చేసేవారు. ఇదే విషయం నాన్నకు చెప్పాను. అయితే శేష్‌ అనే పేరు వాడుకో అని సూచించాడు. నాకర్థం కాలేదు. సునీల్‌ గవాస్కర్‌ అభిమానిని కాబట్టి సన్నీ అని పెట్టాను. పూజారి శ అక్షరంతో పేరుండాలని చెప్పారు. అలా నీకు శేషు అనే పేరు కూడా ఉందన్నాడు. అప్పటి నుంచి నా పేరు అడివి శేష్‌గా మారింది.

చదవండి: ఆఫీస్‌లో చోరీ.. వీడియో రిలీజ్‌ చేసిన నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement