టాలీవుడ్‌లో పెళ్లీడుకొచ్చిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ, వాళ్లంతా పెళ్లి అనే పదాన్ని డిక్షనరీలో నుంచి తీసేసినట్లుగా దాని గురించే ఆలోచించడం లేదు. ప్రభాస్, అడివి శేష్, సాయిదుర్గ తేజ్.. ఇలా కొందరు హీరోలు సినిమాల వెంట పడుతున్నారు తప్పితే పర్సనల్ లైఫ్‌పై కాస్తయినా శ్రద్ధ చూపించడం లేదు.
అడివి శేష్ లవ్ స్టోరీ
ఇంట్లోవాళ్లు ఎంత ఒత్తిడి చేసినా అవేమీ పట్టనట్లు తమ పనేదో తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా అడివి శేష్ (Adivi Sesh).. రాజు వెడ్స్ రాంబాయి సినిమా ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన లవ్‌స్టోరీ వెల్లడించాడు. నేను చిన్నప్పుడు అమెరికాలోనే పెరిగాను. 17 ఏళ్ల వయసున్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించాను.
ఆమె పెళ్లయిపోయింది
తనకోసం నా పేరెంట్స్‌కు చెప్పకుండా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వేరే దేశానికి వెళ్లిపోయాను. కట్ చేస్తే.. నా పుట్టినరోజునాడే ఆ అమ్మాయి పెళ్లయిపోయింది. తనకిప్పుడు పెద్ద పిల్లలున్నారు అంటూ నవ్వుతూ చెప్పాడు. గతంలో కూడా శేష్ ఈ ప్రేమకథను బయటపెట్టాడు. ఇప్పటికీ అదే చెప్తున్నాడు. ఈ గ్యాప్‌లో శేష్ మళ్లీ ఎవర్నీ ప్రేమించలేదా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
సినిమా
సినిమాల విషయానికి వస్తే.. అడివిశేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ క్రిస్‌మస్‌కు విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు అనివార్య కారణాల వల్ల ఈ మూవీ పోస్ట్‌పోన్ అయింది. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిట్ మూవీ గూఢచారికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న గూఢచారి 2 మే 1న విడుదల కానుంది.


