Director SS Rajamouli Speech At Hit 2 Pre Release Event - Sakshi
Sakshi News home page

Hit 2 Pre Release Event: ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు.. హిట్‌ 3, 4, 5’ సినిమాలు కూడా!

Nov 29 2022 12:22 AM | Updated on Nov 29 2022 8:40 AM

SS Rajamouli Speech At Hit 2 Pre Release Event - Sakshi

శైలేష్, మీనాక్షి, ప్రశాంతి, నాని, రాజమౌళి, అడివి శేష్‌

‘‘హిట్‌ 2’ ట్రైలర్‌ బాగా నచ్చింది. అందులోని నేపథ్య సంగీతం ఇంకా బాగుంది.. మంచి ఎనర్జీ ఇచ్చింది. ట్రైలర్‌ చూడగానే సినిమా చూడాలనే ఉత్సుకత కలిగింది’’ అని ప్రముఖ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 2న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్‌ఎస్‌ రాజమౌళి మాట్లాడుతూ–‘‘హిట్‌’ అనే అద్భుతమైన ఫ్రాంచైజీని సృష్టించిన నాని, ప్రశాంతి, శైలేష్‌లను అభినందిస్తున్నాను. థ్రిల్లర్‌ జానర్‌లో శైలేష్‌ బాగా తీశాడు.. ఈ చిత్రం హిట్‌ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ‘హిట్‌ 3, 4, 5’ సినిమాలు వస్తాయి.. అయితే ప్రతి ఏడాది ఒక సీజన్‌లో ‘హిట్‌’ ఫ్రాంచైజీ రావాలి.. ఈ సీజన్‌ ‘హిట్‌’ది అని జనాలకు అర్థం కావాలి. ప్రతి ఏడాది ఒకే నెల ఒకే తేదీన ఈ చిత్రాలు విడుదలవుతుండాలి.

సాంకేతిక విలువలు బాగున్నాయి. నటీనటులు ఫెంటాస్టిక్‌గా చేశారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న మంచి ప్రొడక్ట్‌ ఇది.. మేమంతా గర్వపడుతున్నాం’’ అన్నారు. నాని మాట్లాడుతూ–‘‘హిట్‌’ ఫ్రాంచైజీలో 3,4,5,6,7 సినిమాలు ఉంటాయి. 7వ పార్ట్‌లో యూనివర్సల్‌గా అందరి హీరోలను కలుపుతానని, ఓ పెద్ద సమస్య పరిష్కారం కోసం వాళ్లని తీసుకొస్తానని శైలేష్‌ చెప్పాడు. ఓ నిర్మాతగా కంటే ప్రేక్షకునిగా ఆ మూవీ చూసేందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉన్నాను’’ అన్నారు. ఈ వేడుకలో హీరోలు అడివి శేష్, విశ్వక్‌ సేన్, నిర్మాత శోభు యార్లగడ్డ,  మీనాక్షి చౌదరి, సంగీత దర్శకులు ఎంఎం శ్రీలేఖ, సురేశ్‌ బొబ్బిలి,  డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తదితరులు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement