డెకాయిట్‌కి బై బై  | Adivi Sesh, Mrunal Thakur Dacoit Movie shoot completed | Sakshi
Sakshi News home page

డెకాయిట్‌కి బై బై 

Jan 22 2026 4:59 AM | Updated on Jan 22 2026 4:59 AM

Adivi Sesh, Mrunal Thakur Dacoit Movie shoot completed

డెకాయిట్‌కి బై బై చెప్పేశారు మృణాల్‌ ఠాకూర్‌. ఆమెకు వీడ్కోలు చెప్పింది డెకాయిట్‌ యూనిట్‌. అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా తెలుగు, హిందీ భాషల్లో రానున్న చిత్రం ‘డెకాయిట్‌’. ఛాయాగ్రాహకుడు షానియల్‌ డియోను దర్శకుడిగా పరిచయం చేస్తూ, అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

ఈ చిత్రంలోని తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేశారు మృణాల్‌ ఠాకూర్‌. అందుకే బై బై చెప్పిన ఆమెకు వీడ్కోలు పలికింది యూనిట్‌. ‘‘తెలుగు, హిందీ భాషల్లో తన పాత్రకు మృణాల్‌ డబ్బింగ్‌ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఉగాది సందర్భంగా మార్చి 19న తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement