Adivi Sesh Emotional Comments On Chiranjeevi - Sakshi
Sakshi News home page

Adivi Sesh: మాటల్లో చెప్పలేను: చిరుపై శేష్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Jan 8 2023 2:42 PM | Updated on Jan 8 2023 6:16 PM

Adivi Sesh Emotional Comments On Chiranjeevi - Sakshi

నా చిన్నతనంలో మీ సినిమా టికెట్ల కోసం కొట్టుకునేవాళ్లం. అలాంటిది మేజర్‌ సినిమా కోసం ఒకరోజు మధ్యాహ్నం అంతా మీతో గడపడం గౌరవంగా భావించాను. ఇప్పుడేమో

'మేజర్‌', 'హిట్‌ 2' సినిమాలతో గతేడాది రెండు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్‌ హీరో అడివి శేష్‌. తను ఎంచుకున్న సినిమాలకు, యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా మేజర్‌ సినిమాకు గానూ సంతోషం సినీ అవార్డు అందుకున్నాడీ హీరో. అయితే మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో సంతోషంతో గాల్లో తేలుతున్నాడు శేష్‌.

'నా చిన్నతనంలో మీ సినిమా టికెట్ల కోసం కొట్టుకునేవాళ్లం. అలాంటిది మేజర్‌ సినిమా కోసం ఒకరోజు మధ్యాహ్నం అంతా మీతో గడపడం గౌరవంగా భావిస్తున్నా. ఏకంగా మీ చేతుల మీదుగా మేజర్‌ చిత్రానికి గానూ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు శేష్‌. దీనికి చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు నీ కష్టానికి గుర్తింపు లభించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: సీమంతం వేడుకలో లాస్య డ్యాన్స్‌
మాట్లాడినా, ఏడ్చినా అది తప్పదు: సమంత

Advertisement
 
Advertisement
Advertisement