Anchor Lasya Baby Shower Event: Lasya Dance Video Goes Viral - Sakshi
Sakshi News home page

నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్‌.. యాంకర్‌ లాస్య సీమంతం వీడియో వైరల్‌

Jan 8 2023 11:32 AM | Updated on Jan 8 2023 11:44 AM

Anchor Lasya Baby Shower Event: Lasya Dance Video Goes Viral - Sakshi

ప్రముఖ యాంకర్‌ లాస్య మంజునాథ్‌ మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే తాను గర్భం దాల్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది లాస్య. తాజాగా ఆమె సీమంతం వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలో బిగ్‌బాస్‌లో సంద‌డి చేసిన మెహ‌బూబా, దేత్త‌డి హారిక‌, గీతూ రాయ‌ల్ త‌దిత‌రులు పాల్గొన్ని హల్‌ చేశారు. ఇప్పటికే లాస్య సీమంతంకు సంబంధించిన సీమంతం ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా లాస్య సీమంతంకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంది. అందులో లాస్య భర్త మంజునాథ్‌ ఆమెను స్టేజ్‌పైకి తీసుకెళ్లడం..  మెడలో దండేసి, తిలకం పెట్టి, నుదుటిపై ముద్దు ఇస్తున్నాడు. అలాగే మరో వీడియోలో ఓ హిందీ పాటకు స్నేహితులతో కలిసి లాస్య డ్యాన్స్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య.  2019లో ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు.

Advertisement
 
Advertisement
Advertisement