Samantha Shares Shaakuntalam Movie Shooting Experience - Sakshi
Sakshi News home page

Samantha: మాట్లాడినా..ఏడ్చినా అది తప్పదు, చాలా కష్టమైంది..సమంత పోస్ట్‌ వైరల్‌

Jan 8 2023 1:19 PM | Updated on Jan 8 2023 2:20 PM

Samantha Shares Shaakuntalam Movie Shooting Experience - Sakshi

స్టార్‌ హీరోయిన్‌  సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. షూటింగ్స్‌కి బ్రేక్‌ ఇచ్చి, ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సామ్‌ ఆరోగ్యం ప్రస్తుతం కాస్త కుదుట పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది. అంతేకాదు ప్రస్తుతం శాంకుతలం డబ్బింగ్‌ పనుల్లోనూ పాల్గొంటుంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శాకుంతలం పాత్రలో నటించనడానికి తాను పడిన కష్టాలను తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది సామ్‌. 

‘శాకుంతలం చిత్రం కష్టమైన అంశం ఏమిటంటే.. నడుస్తున్నప్పుడు.. మాట్లాడుతున్నప్పుడు.. పరుగెత్తున్నప్పుడు.. ఏడుస్తున్నప్పుడు కూడా దయ.. భంగిమను కొనసాగించడం. దయ చూపించడం నా వల్ల కాలేదు. దాని కోసం ట్రైనింగ్‌ తీసువాల్సి వచ్చింది. అలా కాకుండా సాషా(పెంపుడు కుక్క)ను కూడా వెంట తీసుకెళ్లి ఉండాల్సింది’అంటూ దీనంగా చూస్తున్న పెంపుడు కుక్క వీడియో పాటు శాకుంతలం భంగిమను షేర్‌ చేసింది సామ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement