Adivi Sesh Tests Positive For Covid-19 - Sakshi
Sakshi News home page

Adivi Sesh : ఆ టాక్‌ రావడం సంతోషంగా ఉంది..ట్విట్టర్‌లో శేష్‌

Aug 5 2022 6:08 PM | Updated on Aug 5 2022 6:53 PM

Adivi Sesh Tests Positive For Covid-19 - Sakshi

కల్యాణ్‌ రామ్‌ బింబిసార, ‌దుల్కర్‌ సల్మాన్‌ నటించిన సీతారామం చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. నేడు(శుక్రవారం)విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవడం పట్ల హీరో అడివి శేష్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. 'ఈ రెండు సినిమాలకు బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వస్తుండటం సంతోషంగా ఉంది. ఇది కదా కావల్సింది. ప్రస్తుతం తనకు కరోనా రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నా. అందుకే థియేటర్స్‌కి వెళ్లలేకపోతున్నా.

నా కోసం ఓ మార్నింగ్‌ షో, మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి' అంటూ అడివి శేష్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఆయనకు కరోనా అని తెలియడంతో పలువురు అభిమానులు గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement