మేనకోడలికి ఆమిర్‌ ఖాన్‌ శుభాకాంక్షలు | Aamir Khan Niece Zayn Marie Khan New Role In Dacoit | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమాలో ఆమిర్‌ మేనకోడలు.. శుభాకాంక్షలు తెలిపిన స్టార్‌ హీరో

Mar 22 2026 9:14 AM | Updated on Mar 22 2026 12:22 PM

Aamir Khan Niece Zayn Marie Khan New Role In Dacoit

బాలీవుడ్‌ దర్శక–నిర్మాత మన్సూర్‌ ఖాన్‌ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్‌ ఖాన్‌ మేనకోడలు జైన్‌ మేరీ ఖాన్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది. అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్‌’. ఈ చిత్రంలో అనురాగ్‌ కశ్యప్, జైన్‌ మేరీ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించారు.

 జైన్‌ మేరీ ఖాన్‌ బర్త్‌ డే (మార్చి 20) సందర్భంగా  పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న ఆమె ఫస్ట్‌ లుక్‌ను యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ లుక్‌ను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు ఆమిర్‌ ఖాన్‌. షానియల్‌ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. ‘‘లవ్, యాక్షన్, హార్ట్‌బ్రేక్‌ వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సహ–నిర్మాత: సునీల్‌ నారంగ్, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నేపథ్య సంగీతం: గ్యాని.   

Advertisement
 
Advertisement
Advertisement